
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి ఉమాభారతి మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్యా గాంధీ హత్యతో కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా లబ్దిపొందగా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఇబ్బందులను, నష్టాలను అనుభవించిందని ఆమె వ్యాఖ్యానించారు.
గుజరాత్‌లో పర్యటిస్తున్న ఉమాభారతి.. ఒక సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ మహాత్ముడి మరణం వల్ల లబ్ది పొందిన వ్యక్తులు, పార్టీ ఎవరో అందరికీ తెలుసునని చెప్పారు. ఇదే క్రమంలో సంఘ్ నేతలు జైలుకు వెళ్లారు.. సంఘ్‌పై నిషేధం విధించారు.. అప్పటి నుంచి ఇప్పటివరకూ సంఘ్ కార్యకర్తలు ఇబ్బందులు, సమస్యలనే ఎదుర్కొంటూనే ఉన్నారు అని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయాలు ఆయనకు తెలుసుకు కాబట్టే.. స్వతంత్రం వచ్చాక.. కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మాగాంధీ సూచించారని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment