
నేడు ఢిల్లీకి చంద్రబాబు
సాక్షి,హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు మంత్రులతో ఈ సందర్భంగా ఆయన భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి నేతృత్వంలో జరిగే జల్‌మంథన్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో భేటీ అయి రైల్వే ప్రాజెక్టులపై చర్చిస్తారు. 12.30కు కేంద్ర టెలీ కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో బ్యాండ్‌విడ్త్‌పై సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమై రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, పరిశ్రమలకు ప్రోత్సాహకాలపై చర్చిస్తారు. ఆ తర్వాత జాతీయ రహదారుల అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అవుతారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో కూడా బాబు భేటీ అయ్యే అవకాశముంది.