అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. అయితే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు రామ మందిర ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ ఘటన అక్కడ ఉన్నవారందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
రామ మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ దిగ్గజ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంబర మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి లోనయ్యారు. వారిరువురు తాము కన్న కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. ఈ క్రమంలో సాధ్వి రితంబర కళ్లు చెమర్చాయి. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా పోరాడిన ఈ నేతల కలసాకారమైంది. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH
— Uma Bharti (@umasribharti) January 22, 2024
సుమారు 32 ఏళ్ల తర్వాత నేడు రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అమె అయోధ్యలో అడుగుపెట్టారు. ‘నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను. రామ్ లల్లా దర్శనం కోసం వేచి ఉన్నా’ అని ఉమాభారతి మందిరం ముందు దిగిన ఫొటోను ‘ఎక్స్’ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో ఉమాభారతి, సాధ్వి రితంబర కీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక.. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయ, సినీ ప్రముఖలు హాజరై తిలకించారు.
చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్య కొలువుదీరిన బాలరాముడు.. దర్శన వేళలు ఇవే
Comments
Please login to add a commentAdd a comment