ఆవు పేడతో రాకెట్ ప్రయోగం.. జపాన్ ఆవిష్కరణ | Japanese Startup Unveils Rocket Engine Fueled By Cow Dung, Watch Video Inside - Sakshi
Sakshi News home page

ఆవు పేడతో రాకెట్ ప్రయోగం.. జపాన్ ఆవిష్కరణ

Published Tue, Dec 19 2023 7:27 PM | Last Updated on Tue, Dec 19 2023 8:04 PM

Japan Unveils Rocket Engine Fueled By Cow Dung - Sakshi

టోక్యో: అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. జపాన్ ఇంజినీర్లు ఆవుపేడతో అద్బుతం సృష్టించారు. ఆవు పేడతో పనిచేసే స్పేస్ రాకెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఉద్గారాలను తగ్గిస్తూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఇంధన కొరత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.

జపానీస్ స్పేస్ స్టార్టప్ ఇంటర్‌స్టెల్లార్ టెక్నాలజీస్ సంస్థ హక్కైడో స్పేస్‌పోర్ట్‌ ద్వారా ఆవుపేడతో నడిచే రాకెట్‌ను ప్రయోగించారు. ఆవు పేడ నుంచి తయారయ్యే బయోమీథేన్ వాయువును ఈ రాకెట్ ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. సహజవనరుల నుంచి తయారు చేసిన ఈ రాకెట్ ప్రయోగం అంతరిక్ష పరిశోధన రంగంలో కీలక మలుపు కానుంది.  సాంప్రదాయ రాకెట్ ఇంజిన్లతో పోల్చితే.. బయోమీథేన్‌తో అతి తక్కువ ఖర్చులో రాకెట్ ప్రయోగాలు పూర్తి కానున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement