ఓ వైద్యుడు ఆవు పేడను తింటున్న వీడియో ఇంటర్నెట్‌లో దూసుకుపోతోంది. అతని ట్విటర్ ఖాతా ప్రకారం ఆ వ్యక్తి డాక్టర్ మనోజ్ మిట్టల్‌గా గుర్తించారు. అతను హర్యానాలోని కర్నాల్‌కు చెందిన చిన్న పిల్లల వైద్య నిపుణుడు. ఆ వీడియోలో ఆ వైద్యుడు ఓ పశువుల శాల వద్దకు వెళ్లి.. ఆవు నుంచి లభించే ‘పంచగ్రావ్య’ లేదా ఆవుల నుంచి పొందగలిగే ఐదు అంశాల గురించి వివరించారు.
తన తల్లి ఉపవాసం ఉండేటపుడు ఆవు పేడను తినేవారని చెప్తూ, ఆయన కూడా కొంచెం పేడను తిన్నారు. పేడ మన మనస్సును, ఆత్మను ప్రక్షాళన చేసే సామర్థ్యం ఉందని, అది వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత, శరీరాన్ని కూడా శుద్ధి చేస్తుందని ఆయన అన్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఇక వంట చేయాల్సిన పని లేదు, కనీసం అందులో ఉప్పు కూడా వెయ్యనక్కర్లేదు? సూపర్ ఫుడ్ అని ఒకరు కామెంట్ చేయగా, స్వీటు అనుకున్నావా ఏంటి .. ఆవు పేడను అలా తినేస్తున్నావ్ అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.
Dear Doctors of Twitter,
— عادل مغل 🇵🇸 (@MogalAadil) November 13, 2021
I present you this gentleman!pic.twitter.com/YtFHGo9cQH
చదవండి: Haunted Hotels In UK: ఆ హోటల్‌లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి..
Comments
Please login to add a commentAdd a comment