ఆవు పేడతో రాఖీలు.. ముంబై నుంచి ఆర్డర్లు | Eco Friendly Rakhis from Cow Dung | Sakshi
Sakshi News home page

ఆవు పేడతో రాఖీలు.. ముంబై నుంచి ఆర్డర్లు

Published Sun, Aug 11 2024 1:03 PM | Last Updated on Sun, Aug 11 2024 1:03 PM

Eco Friendly Rakhis from Cow Dung

ఆగస్టు 19న రాఖీ పండుగ.. ఇది అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవం. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మార్కెట్‌లో వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే  ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన పూజా మెహతా రూపొందిస్తున్న రాఖీలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ఆవు పేడలో వివిధ రకాల పప్పుదినులు కలిపి ఆమె అందమైన రాఖీలను తయారు చేస్తోంది. ఈ రాఖీలు పర్యావరణానికి అనుకూలమైనవి. ఈ రాఖీలను రూపొందిస్తున్న పూజా వీటిని విక్రయిస్తూ, స్వయం ఉపాధి కూడా పొందుతోంది. తన మాదిరిగానే ఎవరైనా సరే ఇటువంటి రాఖీలను తయారు చేసి ఉపాధి పొందవచ్చని ఆమె చెబుతోంది. తాను రూపొందిస్తున్న రాఖీలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయని పూజ తెలిపింది.

బస్‌గావ్ గ్రామ నివాసి పూజా మీడియాతో మాట్లాడుతూ తాను తయారు చేస్తున్న రాఖీలు దేశంలోని ప్రతి ప్రాంతానికి పంపిస్తానని తెలిపారు. ఢిల్లీ, గుజరాత్‌, ముంబైల నుంచి తనకు చాలా ఆర్డర్టు వస్తున్నాయని పూజా పేర్కొన్నారు. తాను ఈ రాఖీలను రూ. 40కు విక్రయిస్తున్నానని తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఈ రాఖీలను విక్రయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను ఈ ప్రత్యేకమైన రాఖీలను రూపొందించేందుకు ఆవు పేడ, ఎర్రమట్టి, బంక, పప్పుదినులు ఉపయోగిస్తానని తెలిపారు. దీంతో పాటు ఆవాలు, నువ్వులు, బంతిపూలు మొదలైనవాటిని కూడా వినియోగిస్తానని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement