వియారా(గుజరాత్): ఆవు పేడతో నిర్మించిన ఇళ్లు అణుధార్మికత నుంచి రక్షణ ఇస్తాయనే విషయం సైన్సు నిరూపించిందని గుజరాత్‌లోని తాపి జిల్లా సెషన్స్ జడ్జి సమీర్ వ్యాస్ పేర్కొన్నారు. గో మూత్ర ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతుందని తెలిపారు. అందుకే దేశంలోని గోవులను, వధించడం మానేసి రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గోవుల అక్రమ రవాణాకు పాల్పడిన ఓ వ్యక్తికి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులో ఈ విషయాలను ఆయన పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రపంచంలోని అన్ని సమస్యలకు గోవధే కారణమని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అమిన్ అంజుమ్(20) 2020లో గుజరాత్ నుంచి ఆవులను తరలిస్తూ పట్టుబడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment