రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగల్ బుధవారం వెరైటీ బ్రీఫ్‌కేసుతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యి అందరికీ షాక్ ఇచ్చారు. ఇది వరకే బడ్జెట్ సమావేశాలకు సూట్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చేవారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాత పద్ధతులకు స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఛతీస్‌గఢ్ సీఎం కూడా ఇంకాస్త ముందడుగా వేసి ఏకంగా ఆవు పేడతో తయారైన బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకుని అసెంబ్లీకి వెళ్లారు.
ఆవు పేడకు చెందిన పొడి, గమ్, పిండి, ఇతర పదార్థాలతో పాటు కొండగావ్‌కు చెందిన కళాకారులు హ్యాండిల్, కలపతో తయారు చేశారు. ఆ సూట్‌కేసుపై సంస్కృతంలో “గోమయే వసతే లక్ష్మి” అని రాసి ఉంది. అంటే దీని అర్థం “లక్ష్మి దేవత ఆవు పేడలో ఉంటుంది”. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆవుపేడతో తయారైన బ్రీఫ్‌కేస్‌తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం భారత్‌లో ఇదే తొలిసారి. దీన్ని తయారు చేసేందుకు పది రోజులు పట్టినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గత నెలలో పశువుల పెంపకం గ్రామస్తులు, గౌతన్‌లు, గౌతమ్ కమిటీలతో సంబంధం ఉన్న మహిళా సంఘాల కోసం తన ప్రధాన పథకం గోధన్ న్యాయ్ యోజన కోసం రూ.10.24 కోట్లను విడుదల చేసింది. పశువుల యజమానులకు కనీస ఆదాయ మద్దతును అందించడమే ఈ పథకం లక్ష్యం. ఆవు పెంపకందారులు, రైతుల నుంచి ఆవు పేడను సేకరిస్తామని 2020లో రాష్ట్రం ప్రకటించింది, భారతదేశంలో అలా చేసిన మొదటి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment