దేశంలో కొద్ది రోజుల్లో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, భూపేష్ బఘెల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ తన ఎంపీలను, కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి భూపేష్ బఘెల్ పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ దుర్గ్‌లో ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ దుర్గ్ కోటను ఛేదించడం అంత సులువు కాదని, ఇది ఎప్పటికీ కాంగ్రెస్‌కు కంచుకోట అని అన్నారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ రాయ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలు బీజేపీ మద్దతు పలకాలని కోరారు. కాగా ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 7, 17 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు?
Comments
Please login to add a commentAdd a comment