
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గం కాంగ్రెస్‌దైతే.. గాడ్సే, వీర్ సావర్‌కర్‌ల హింసాత్మక మార్గం ప్రధాని మోదీది అని అన్నారు. అమర జవాన్ల జ్యోతి విశిష్టత తెలియక మోదీ ప్రభుత్వం దాన్ని తొలగించిందని ఆరోపించారు.
ప్రజల మనోభావాలను కేంద్రం దెబ్బతీసిందని మండిపడ్డారు. అమర జవాన్ల జ్యోతిని ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటు చేస్తామన్న భూపేష్ బాగేల్.. ఫిబ్రవరి 3న దీనికి రాహుల్‌గాంధీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment