budjet session
-
TS Assembly: కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మనండి, కలిసి దీక్ష చేస్తాం: సీఎం రేవంత్
Updates..👉తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.👉 ‘కేంద్ర బడ్జెట్’పై తీర్మానానికి బుధవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ముందు పెట్టారు. కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానంకేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.అసెంబ్లీలోని సభ్యులకు తీర్మానం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారు.తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారు. గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదు.గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదు.కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది వాస్తవం: హరీష్ రావుమీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామంటే రావడానికి మేము సిద్ధంఢిల్లీలో దీక్ష చేద్దాం రమ్మంటే సిద్ధం.నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలని సీఎం అన్నారురుణమాఫీ గురించి నన్ను దీక్ష చేయాలని సీఎం అన్నారుఅన్ని మేమే చేస్తే.. మీరేం చేస్తారు?ఉద్యమ సమయంలో రాజీనామా చేకుండా పారిపోయింది మీరు.పదవులు గడ్డిపోసలెక్క విసిరేసింది మేముఢిల్లీలో మంత్రులు ఆమరణ దీక్ష చేయాలన్ని కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్కేసీఆర్ను ఢిల్లీకి రమ్మని చెప్పండి.నేను కూడా దీక్షలో కూర్చుంటా.ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చుద్దాం.చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చామని మేము చెప్పలేదు.మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదుకేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్సీఎం కూడా సీనియర్ సభ్యులుఆయనకు సభా వ్యవహారాలు తెలుసుసభా నాయకుడికి అనుభవం లేదని కేటీఆర్ మాట్లాడటం సరికాదుబీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్ విషయాన్ని వదిలేసి అన్నీ మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాల కంటే బీఆర్ఎస్కు రాజకీయ ప్రమోజనాలు ముఖ్యంఅమృత్ నిధుల అంశంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.అమృత స్కీం కింద వచ్చిన నిధుల గురించి మాట్లాడి అసలు విషయం డైవర్ట్ చేస్తున్నారు.రాజకీయ విషయాలు కాకుండా రాష్ట్రానికి పనికొచ్చే విషయాలు మాట్లాడాలిఅమృత్ స్కీం కింద వచ్చిన నిధులకు టెండర్ల ప్రక్రియ సాగుతోంది - విప్ ఆది శ్రీనివాస్సగం తప్పుదారి పట్టించేలాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.బీజేపీ ప్రభుత్వం అయోధ్యలో ఓడిపోయింది. ఆదిశ్రీనివాస్ విప్ఓటమి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు - ఏలేటి మహేశ్వర్ రెడ్డితెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అక్కడ బిజెపి గెలిచింది .బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్కేంద్రం అమృత్ పథకం కింద 3500 కోట్లు ఇచ్చింది.ఆ 3,500 కోట్లను ఎవరికి తెలియకుండా కాంగ్రెస్ మంత్రులు పంచుకున్నారు.మా నియోజకవర్గానికి మూడు కోట్లు అడిగితే మంత్రులు ఇవ్వడం లేదు.మంత్రుల వాళ్ల నియోజకవర్గాలు అభివృద్ధి జరిగితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్లు కాదు.అమృత్ నిధులు టెండర్లు లేకుండా మంత్రులు లెక్కలేసుకొని పంచుకున్నారుభట్టి విక్రమార్క కామెంట్స్..కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే మంచిది.బీజేపీని అంటే బీఆర్ఎస్ ఎందుకు బయపడుతోంది. కేటీఆర్ కామెంట్స్..మేము ఎవరితోనూ చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదు.ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటాం.కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకున్నా గత పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయాలి.ఇప్పటికైనా సమయం మించిపోలేదు.బడ్జెట్ ఆమోదం పొందడానికి ముందే సవరణలు చేయాలని కోరుతున్నాంవిభజన హామీల అంశాల్లో ఒక్కటి లేదు.కేంద్రంపై అందరం కలిసి ఫైట్ చేద్దాం.బీజేపీ తెలంగాణ ప్రజలపై వివక్ష చూపిందివిభజన చట్టం ప్రకారం తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు ఇవ్వాలితెలంగాణకు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చారు.నిధులు రాబట్టడంలో బీజేపీ తెలంగాణ ఎంపీలు విఫలం అయ్యారు.దేశంలో తెలంగాణ భాగం కాదా?కేంద్రం తెలంగాణను ఎందుకు మర్చిపోయింది?కేంద్రం, బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యద్ధంకేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తీర్మానం అంటుంది.కానీ, మాకు తీర్మాన కాపీ రాలేదు. రేవంత్ రెడ్డికి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై మాట్లాడం ఇష్టం లేదనుకుంటానురేవంత్ కామెంట్స్..కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్.రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభకు ప్రతిపక్ష నాయకుడు రాలేదు.సభకి వచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు భయమేస్తోంది.సభ నుంచి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.బీఆర్ఎస్ ఎంత హడావిడి చేసినా సభ నుంచి బయటకు పంపొద్దు.ఢిల్లీలో చీకటి ఒప్పందాలు బయటపడతాయిన బీఆర్ఎస్ భయపడుతోందితండ్రి పేరుతో తాను రాజకీయం చేయడం లేదు.నేనేమీ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి, ముఖ్యమంత్రి కాలేదు.కేటీఆర్ కౌంటర్..పేమెంట్ కోటాలో పదవులు పొందలేదు.తండ్రి పేరు అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీని ముఖ్యమంత్రి అంటున్నారా? అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..నిధుల కేటాయింపులో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందిటూరిజం డెవలప్మెంట్ అంశంలో తెలంగాణకు నిధులు నిల్.నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరాం కేంద్ర బడ్జెట్‌పై మంత్రి సీతక్క ట్వీట్ఇది ఎన్డీఏ బడ్జెట్, ఇండియా బడ్జెట్ కాదుతనను భయపెట్టే బాబు, నితీష్ మీద మోదీ ప్రేమ కురిపించారుఏపీకి 15వేల కోట్లు, బీహార్‌కు 26 వేల కోట్లుఇది యూనియన్ బడ్జెట్ కాదు, కుర్చీ కాపాడుకునే బడ్జెట్ It’s NDA Budget, not INDIA Budget.AP Budget 15,000 cr Bihar Budget 26,000 cr Modi ji showed love on those who he fears ( Babu & Nithish )It’s not union Budget it’s Kursi Bachao Budget @RahulGandhi @revanth_anumula @kharge #KursiBachaoBudget #Budget2024— Danasari Seethakka (@seethakkaMLA) July 24, 2024 👉రేవంత్ తీర్మానం.. తెలంగాణకు అన్యాయం జరిగింది అని సభలో చర్చ జరపాలని తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డిఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కామెంట్స్..సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతుందిరుణమాఫీ చేయడంతో రైతుల కుటుంబాలు పండుగ చేసుకుంటున్నారురాహుల్ గాంధీ వరంగల్‌లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశారుత్యాగాల కుటుంబం గాంధీ కుటుంబంరుణమాఫీ చేసినందుకు తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారురుణమాఫీ చేసినందుకు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ప్రసాదం లడ్డులు అసెంబ్లీలో పంపిణీ చేసాం. అసెంబ్లీ లాబీలో హరీష్‌రావు చిట్‌చాట్..కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదు.వీహెచ్ వంటీ సీనియర్ నేతకు ఏ పదవి దక్కలేదు.నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన కేశవరావుకు మాత్రం పదవి ఇచ్చారు.మరో సీనియర్ నేత కోదండరెడ్డిని కూడా పక్కకు పెట్టారు.అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి చిట్‌చాట్..బీఆర్ఎస్కు సభలో మాట్లాడేందుకు వాయిస్ లేదువాయిస్ లేదు కాబట్టే ఆర్టీసీ అంశాన్ని మాట్లాడింది.బీఆర్ఎస్కు అసెంబ్లీలో హరీష్ రావు తప్ప వేరే లీడర్లు లేరు.బీఆర్ఎస్ పార్టీ పోయి తీహార్ జైల్లో పడింది.ఇక, వాళ్ల పార్టీలో ఎవ్వరూ ఉండరు.కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపించింది.తెలంగాణ పేరు ఎత్తకుండా సెంట్రల్ బడ్జెట్ పెట్టడం వివక్షే.తెలంగాణలో బీజేపీకి మంచి గుణపాఠం చెప్తం.సెంట్రల్ బడ్జెట్‌పై రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడలేక వాయిస్ పోయింది. అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క చిట్‌చాట్..10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తోంది.బీఆర్ఎస్ హయంలో అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారుతెలంగాణ ఏర్పడిందే నియామకాల కోసం అలాంటి నియామకాలు మీద అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ స్పందించలేదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలతో పాటు, జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాంఅధికారం పోయాక బీఆర్ఎస్కు నిరుద్యోగులు గుర్తుకు వచ్చి ప్రొటెస్ట్ చేయటం హాస్యాస్పదంగా ఉంది.పదేళ్లుగా ఉద్యోగాల భర్తీని పట్టించుకోని బీఆర్ఎస్, జాబ్ క్యాలెండర్ కోసం డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందిఅసెంబ్లీ పోడియంలోకి వెల్లినా, ప్లకార్డులు ప్రదర్శించినా గత ప్రభుత్వం సస్పెండ్ చేసేదికానీ మా ప్రభుత్వం అలా చేయడంలేదుగతంలో నిరసనలను అణగదొక్కిన బీఆర్ఎస్, ఇప్పుడు నిరసనకు దిగడం ఆశ్చర్యంబీఆర్ఎస్ నిరసనలతో రాష్ట్రంలో ఎంత ప్రజాస్వామ్యం ఉందో అర్థం అవుతుందిఉద్యోగాల భర్తీలో ఉన్న చిక్కు ముడులను విప్పి నియామకాలు చేపట్టాముత్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం గ్రూప్ పరీక్షలపై సభలో హరీష్ రావు కామెంట్స్..జీవో-55 ప్రకారం 1:50 క్యాన్సిల్ చేసిందికాస్ట్ వారీగా మేము 1:50 మేము తీసుకున్నాం.కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ దాన్ని తొలగించి జీవో-29 తెచ్చింది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారుసీఎం రేవంత్ 1:100 సాధ్యం కాదు అంటున్నారు.కానీ 2006లో వైఎస్సార్ ఈ రేషియో ప్రకారం గ్రూప్-1 చేశారు.వైఎస్ జగన్ గ్రూప్-2 కూడా చేశారువాళ్లకు లేని ఇబ్బంది. మీకు ఎందుకు వస్తుందిగ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల సంఖ్య పెంచండి అంటున్నాముఇబ్బంది వస్తుంది అని సీఎం రేవంత్ అంటున్నారు.కానీ మేము యాడ్ చేశాం.. మాకు రాని లీగల్ సమస్య మీకు ఎందుకు వస్తుంది2008-09లో కాంగ్రెస్ సర్కార్ పోస్టుల సంఖ్య పెంచిందికానీ రేవంత్ సర్కార్ మాత్రం పోస్టుల సంఖ్యను పెంచడం లేదుపలు సమస్యలపై హరీష్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందిరాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారుఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంఆర్టీసీ యూనియన్ ను పునరుద్ధరణ చేయడంఇలాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదునేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా రాజీనామా చేశానుమేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయిందిమేము అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారుఊసరవెల్లి సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతుందికాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందిఅధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందిగ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారురాష్ట్రంలో నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారునిరుద్యోగులపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వడం లేదురాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయికాంగ్రెస్ వస్తే 25వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు 👉 బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కామెంట్స్..మా నియోజకవర్గాలకు చెందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడాలంటే స్పీకర్ అవకాశం ఇవ్వలేదుబీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావుకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారుసభలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలిప్రశ్న అందరి ప్రాపర్టీ అని సీఎం అంటున్నారు కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలని కోరుతున్నాం 👉అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులకు టీ బ్రేక్..బీఆర్ఎస్, బీజేపీ వాయిదా తీర్మానం తిరస్కరణ..తెలంగాణ రాష్ట్రంలో పంటల నష్టం గురించి బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇతర న్యాయపరమైన డిమాండ్లపై బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లు చర్చించాలని కోరుతూ కేటీఆర్ వేసిన ప్రతిపాదనను తిరస్కరించిన స్పీకర్ pic.twitter.com/ViedsXuvAB— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024వీడియో క్రెడిట్.. Telugu Scribe సీఎం రేవంత్ కామెంట్స్.. హరీష్ రావు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి.హరీష్ రావుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది.స్పీకర్ కుర్చీపై ఆరోపణలు చేయడం ఏ మంత్రికి తగదు.ఆర్టీసీ అంశం ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య.ఆర్టీసీ కార్మికుల దీక్షలు చేసి 50 మంది చనిపోయినప్పుడు.. ఆనాడు ప్రభుత్వం వివక్ష చూపింది.సీపీఐ కార్మికుల కోసం కొట్లాడింది వాళ్ల కోసం మాట్లాడడానికి సీపీఐకి అవకాశం ఇచ్చారు.హరీష్ రావు మాట్లాడుతుంది చట్టాలకు విరుద్ధం.ఎవరు ప్రశ్న అడిగితే వాళ్లకే అవకాశం ఇవ్వాలి అన్నది రూల్‌లో లేదుప్రశ్నోత్తరాలు సభకు వస్తే అది సభ సొంతమవుతుంది.సభ సభ్యులందరి ఆస్తి.ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది చైర్ విచక్షణ మీద ఉంటుంది.రూల్ బుక్కు గురించి బీఆర్ఎస్ అసలు విషయం తెలుసుకోవాలి.గతంలో ఎమ్మెల్యే తన సీటును వదిలి పక్కకు వస్తే సభ నుంచి సస్పెండ్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ఆనవాయితీలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వాళ్లు కోరుకుంటున్నారు.కుటుంబం వల్ల కార్మిక సంఘాలను గత ప్రభుత్వం రద్దు చేశారు.కార్మికులను కార్మిక సంఘాలను రద్దుచేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తగా బీఆర్ఎస్ బురద చల్లుతుంది.హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు.సభలో కొత్త సభ్యులు ఉన్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 👉రేపు కేబినెట్ భేటీ..రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం.రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్.మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు. 👉మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికుల గురించి హరీష్ రావు దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు.కార్మిక సంఘాలను రద్దు చేసి ఆర్టీసీని చంపేశారు.ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోలేదు.2013 నుంచి ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విడుదల చేసాము.ఆర్టీసీ ఏడువేల కోట్ల అప్పులతో బీఆర్ఎస్ మాకు అప్పగించింది.మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల రెండు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది.మూడు వేల ఉద్యోగాలు నియామకం చేశాము. ఆర్టీసీకి ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల కోట్లు చెల్లించాం - మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/3do5ayZUDF— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024వీడియో క్రెడిట్: Telugu Scribeఓవర్ లోడ్ అవుతుంది.కానీ కార్మికులకు డబుల్ పేమెంట్ జరుగుతుంది.గత మూడు నెలల నుంచి ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను ఎండీగా పెట్టీ ఆర్టీసీని బీఆర్ఎస్ నడిపించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా అప్పగించారుఆర్టీసీకి అన్యాయం జరగకుండా భవిషత్లో అన్ని చర్యలు తీసుకుంటాంబీఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత లేదురిటైర్డ్ ఈడీనీ ఆర్టీసీకి ఎందుకు ఎండీగా పెట్టిందో చెప్పాలి? 👉హరీష్‌రావు Vs మంత్రి శ్రీధర్ బాబు.. హరీష్‌రావు కామెంట్స్..ప్రభుత్వం భాధ్యతారహితంగా సమాధానం చెబుతోంది.ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది.ఆర్టీసీ పీఆర్సీని ప్రభుత్వం రాగానే ఇస్తాం అన్నారు.ఆర్టీసీ ఉధ్యోగులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలి.300 కోట్లు పీఆర్సీ బకాయి చెక్కులు ఫిబ్రవరిలో ఇచ్చారు.ఇంతవరకు అది బస్‌భవన్‌కు చేరలేదు.ఆర్టీసి ప్రభుత్వంలో విలీనంపై ఎందుకు జాప్యం జరుగుతుంది..మంత్రి పొన్నం ప్రభాకర్ జాప్యం జరగటం లేదని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు.కొత్త యూనియన్లు ఎప్పటిలోగా పునరుద్దరిస్తారు.ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదుగతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాము.కొత్త బస్సుల ప్రారంభం నాడు 300కోట్లు చెక్ చూపించారుమహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చింది ఎంత?సీసీఎస్ డబ్బులు మళ్ళించి కార్మికులకు జీతాలు ఇచ్చారా లేదా? 👉హరీష్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..హరీష్ రావుకు క్వశ్చన్ అవర్‌లో క్వశ్చన్ అడిగాలని తెలియదా?ఈ ఉపన్యాసం ఏంటి?.కాంగ్రెస్ మేనిఫెస్టోను హరీష్ రావు బట్టి పట్టారు.. చాలా సంతోషం.సభ్యులు ప్రశ్నలు మాత్రమే అడగండి.. ఉపన్యాసాలు వద్దు. 👉సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..రోడ్డు, కరెంటు లేకుండా తండాను గ్రామ పంచాయతీలు చేశారు.ప్రతీ తండా నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు వేస్తాం.ప్రతీ తండాకు తాగు నీటితో పాటు కరెంటు, రోడ్డు వేస్తాం.ఏడు లక్షల ఇళ్ళకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు.బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్తారో చెప్పండి తీసుకెళ్తాం.ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదు.తండాల అభివృద్ధి జరిగినప్పుడే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది.సరైన రోడ్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. 👉ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య..తండా గ్రామపంచాయతీలు చెట్ల కింద ఉండి పాలన సాగుతుంది.సర్పంచ్ల నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళించింది.సర్పంచ్ల ఆత్మహత్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం.ఎమ్మెల్యే వంశీకృష్ణ కామెంట్స్..నెంబర్ కోసమే అన్ని తండాలను గ్రామపంచాయతీలు చేశారు.ఒకే తండాను రెండుగా విడగొట్టి, రెండు గ్రామపంచాయతీలు చేశారు.తండా గ్రామపంచాయతీల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..62 కోట్ల మంది మహిళలు ఫ్రీ ఆర్టీసీ బస్సును ఉపయోగించుకున్నారు..ఫ్రీ బస్సు వల్ల దేవాలయాల వద్ద రద్దీ పెరిగింది.కొత్త బస్సులు కొనుగోలు చేసి.. ఆర్టీసీ సర్వీసులు పెంచాలి.రోడ్డు భధ్రత వారోత్సవాలపై మరింత అవగాహన పెంచాలి .మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా బస్సు టైమింగ్స్ సెట్ చేస్తున్నాం.ఆర్టీసీ ప్రయాణం భధ్రత విషయంలో రాజీపడం.ఆర్టీవోలు కఠినంగా వ్యవహరించాలి.ప్రభుత్వ విప్ రాంచంద్ర నాయక్గత ప్రభుత్వం ఓట్ల కోసం నామమాత్రంగా తండాలను గ్రామపంచాయతీలను చేసింది.తండా గ్రామపంచాయతీలకు ఎటువంటి ఫండ్స్ లేవు.ప్రస్తుతం ప్రభుత్వం ప్రతీ తండా గ్రామపంచాయతీలకు ఆఫీస్‌తో పాటు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. మీడియా పాయింట్.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్..బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.విభజన తరువాత 2 రాష్ట్రాలు చాలా నష్ట పోయాయి..నిర్మల సీతారామన్ తెలంగాణలో పర్యటన సమయంలో..రేషన్ షాప్‌ల దగ్గర ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదు అని డీలర్‌ను, కలెక్టర్‌ను ప్రశ్నించారు.తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి, సంజయ్ వస్తారుమూసీకి ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం ఎన్నో సార్లు అడిగారుతెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు క్షమాపణ చెప్పాలిహైదరాబాద్లో వారిని తిరగనివ్వం.ఇలాంటి ఆర్థిక మంత్రి దేశానికి ఉండటం అరిష్టంవిభజన చట్టంలో ఉన్న అంశాలు పరిష్కారం చేయకపోవడం బాధాకరంఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోకోవాలినిన్న బడ్జెట్లో తెలంగాణ పేరు తీయకపోవడం విచారకరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేపీ వివేకానంద కామెంట్స్..కేంద్ర బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీరని అన్యాయం చేసిందిబీఆర్ఎస్ హయాంలో కేంద్రం ఎన్నో ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్ళిందిదేశానికి ఆదాయం అందించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి మూడు, నాలుగు స్థానాల్లో ఉందితెలంగాణలో కేసీఆర్ నాయకత్వం ఉండకూడదని కుట్ర చేశారుకేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలకు తెరదీశారుమోదీని బడే భాయ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారుఅసెంబ్లీలో చర్చ పెట్టి హామీలను నెరవేర్చకుండా కేంద్రంపై నెపంవేసే ప్రయత్నం సీఎం చేస్తున్నారుతెలంగాణకు ఎలాంటి ఐఐఎం ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి సీఎంకు లేఖ రాశారుతన కేసుల కోసం కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి రాజీపడ్డారుబీజేపీతో కుమ్మక్కు అయ్యి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నారు. 👉బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొట్టి రూపాయి కూడా తీసుకురాలేదుతెలంగాణలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి చెరో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇచ్చారుతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే ఎన్ని వేల కోట్లు వచ్చే అవకాశం ఉండేదో ఆలోచించండిఏపీకి 15 వేల కోట్లు ఇచ్చారుతెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డ్రామాలు బంద్ చేయాలితెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తామురెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడ చేశారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి 👉నేడు రెండో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు సదరు మంత్రులు సమాధానం చెబుతారు.👉షార్ట్ డిస్కషన్ కింద కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ను ప్రభుత్వం కోరనుంది. ఈ క్రమంలో స్పీకర్ అనుమతి ఇస్తే కేంద్ర బడ్జెట్‌పై సభలో చర్చ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం.. సభలో తీర్మానం చేయనుంది.👉మరోవైపు.. గోదావరి పరివాహక ప్రాంతంలో పంట నష్టంపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు.నేడు అసెంబ్లీలో ఇలా..1) ప్రశ్నోత్తరాలు .2) ప్రభుత్వ రిజల్యూషన్3) నిన్న బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు ఉభయసభల్లో టేబుల్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.4) వివిధ శాఖల్లో యాన్యువల్ రిపోర్టులను ఉభయ సభల్లో టేబుల్ చేస్తారు.ఇదిలా ఉండగా..1. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ 23వ వార్షిక రిపోర్టును సభలో ప్రవేశపెడతారు.2. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ యాన్యువల్ రిపోర్టును విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు.3. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెడతారు.4. ఇటీవల దివంగతులైన మాజీ శాసనసభ్యులు డాక్టర్ నెమురు గొమ్ముల సుధాకర్ రావు, మహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్, ధర్మపురి శ్రీనివాస్, రమేష్ రాథోడ్‌లకు సభలో సంతాపం వ్యక్తం చేయనున్నారు.5. శాసనసభలో స్వల్పకాలిక చర్చ(యాక్టివిటీస్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ మెట్రో సిటీ).శాసనసభలో చర్చకు వచ్చే ప్రశ్నోత్తరాలు..1.పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీలు.2.తండాలు గ్రామపంచాయతీలుగా ఉన్నతీకరణ3.ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు.4.వాణిజ్య పనుల శాఖలో అవకతవకలు.5.నిజామాబాద్ పట్టణ శాసనసభ నియోజకవర్గంలో క్రీడా సముదాయం.6.తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐటీ ఏర్పాటు.7.ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లింపు.8.రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.9.జాతీయ రహదారి విస్తరణ పనులు.10.మూసీ నదికి ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ చెరువుల అనుసంధానం. -
కేసీఆర్ సర్కార్ Vs గవర్నర్.. మండలి ఛైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల రిపబ్లిక్ డే సందర్బంగా చోటుచేసుకున్న మాటల యుద్ధం తాజాగా మరో స్థాయికి చేరుకుంది. కాగా, రాష్ట్ర బడ్జెట్ 2023–24 ప్రతిపాదనలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోద్ర ముద్ర వేయలేదు. దీంతో, ఈ విషయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ వ్యవస్థ, లౌకిక విధానం కాపాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు రాజ్యాంగానికి ఆటంకం కలిగిస్తున్నాయి. వక్రబుద్దితో రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాలి. శాసన సభ, శాసన మండలి, గవర్నర్ ఎవరైనా సరే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునుఏ ధోరణిలో ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. గవర్నర్ సిఫారసుల కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. అయితే గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో ఈ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాజ్‌భవన్‌లోనే ఉండిపోయాయి. -
పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే ముగిసిపోయాయి. పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14న మొదలై షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 శుక్రవారం వరకు జరగాల్సి ఉండగా ఒకరోజే ముందే ముగిశాయి. ఈసారి బడ్జెట్ ఆమోదంతో పాటు కీలక బిల్లులైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లులకి పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. -
నారా లోకేష్, చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్
సాక్షి, అమరావతి: కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డమైన మద్యం బ్రాండ్లను చంద్రబాబు తీసుకువచ్చారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొడాలి నాని గురువారం మాట్లాడుతూ..‘‘మద్యం అమ్మకాలను ప్రొత్సహించింది చంద్రబాబే. మద్యం అమ్మకాల ద్వారా కమీషన్ తీసుకుని ఆస్తులు పెంచుకున్నది చంద్రబాబు. కమీషన్లకు కక్కుర్తిపడి బార్లకు ఐదేళ్లు లైసెన్లు ఇచ్చారు. బార్లకి గతంలో కేవలం రెండేళ్లే అనుమతులు ఉండేవి.. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నారు. అడ్డమైన బ్రాండ్లకు చంద్రబాబే అనుమతిచ్చారు. మనం ఏం చెప్తే అది నమ్మే ప్రజలు ఉన్నారనుకునే 420 బ్యాచ్ అది. వాళ్లు తమ మీడియా ద్వారా అబద్దాలు చెప్తున్నారు. సీ బ్రాండ్, ఎల్ బ్రాండ్ లకు చంద్రబాబు ఎలా అనుమతి ఇచ్చారో రాష్ట్రం అంతా చూసింది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. దేనికీ పనికిరాని చంద్రబాబుని అల్లుడుని చేసుకుంటే ఔరంగజేబులాగా మారాడని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలకు పేటెంట్ చంద్రబాబు. 175 నియోజకవర్గాలను 175 జిల్లాలను చేయమని లోకేష్ అడుగుతున్నాడు. అప్పట్లో కుప్పంని డివిజన్ చేయాలని చంద్రబాబుకు ఎందుకు అనిపించలేదు?.. ఇప్పుడు సీఎం జగన్‌కు ఎలా ఉత్తరాలు రాస్తాడు?.. కాస్తయినా చంద్రబాబుకి సిగ్గులేదా?.. అభివృద్ధి పనులను అడ్డుకుంటే టీడీపీ రాజకీయ భవిష్యత్తుకు జనం సమాధి కడతారు. ఎన్నికల వరకు ఈ 420 బ్యాచ్ భరించక తప్పదు’’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే మద్యం నియంత్రణ గురించి చెప్పారు. అధికారంలోకి రాగానే 45 వేల బెల్టుషాపులు తొలగించారు. పర్మిట్ రూమ్‌లను పూర్తిగా ఎత్తివేయించారు. బార్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుని నడుపుతున్నారని కొడాలి విమర్శించారు. -
బడ్జెట్లో బీసీలకు ప్రత్యేక ప్యాకేజీ: ఆర్. కృష్ణయ్య హర్షం
సాక్షి, అమరావతి: దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల(బీసీల) అభివృద్ధికి ఏకంగా రూ.28 వేల కోట్లు కేటాయించడం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. బడ్జెట్‌పై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. దేశంలో బీసీ ముఖ్యమంత్రులున్న రాష్ట్రాల్లోనూ బీసీలకు రూ.5 వేల కోట్లకు మించి కేటాయింపులు చేయలేదని గుర్తు చేశారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీసీల సంక్షేమానికి కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి నామమాత్రంగానే నిధులు కేటాయించిందన్నారు. అందుకు విరుద్ధంగా ఏపీలో జనాభా ప్రాతిపదికన బీసీలకు ఏకంగా రూ.28 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యసాహసాలకు సలామ్ చేస్తున్నానన్నారు. ఇప్పటికే బీసీ కులాల అభివృద్ధికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం వాటా ఇవ్వడం సీఎం వైఎస్ జగన్ గొప్ప దార్శనికతకు అద్దం పడుతోందన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి విప్లవాత్మక పథకాలతో బీసీ, అట్టడుగు వర్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. -
అవ్వాతాతలకు అండగా జగనన్న..
సాక్షి, అమరావతి : మలి సందెలో ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు నేనున్నా అంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. సీఎంగా వైఎస్ జగన్ అధికారాన్ని స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలోని అవ్వా తాతలకు అండగా నిలిచారు. వారికిచ్చే వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని పెంచారు. ఇళ్ల వద్దే పింఛన్లు అందజేస్తున్నారు. ఇప్పుడు వారికి మరింత భరోసా కల్పిస్తూ ఈసారి బడ్జెట్లో పింఛన్లకు మరింత ఎక్కువ కేటాయింపులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్ద పెద్ద శాఖల వార్షిక బడ్జెట్ మొత్తం స్థాయికి పింఛన్ల బడ్జెట్ పెరిగిపోయింది. గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోకంటే సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ పథకానికి పెట్టే ఖర్చు మూడు రెట్లు పెంచారు. ఇప్పుడు మరింత పెరిగి ఈసారి కేటాయింపులు రూ.18,000.90 కోట్లకు ఎగబాకాయి. ఈ ఏడాది జనవరి నుంచి పింఛన్‌ను నెలకు రూ.2,500కు పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి నెలా 61.74 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. థలసేమియా, సికెల్ సెల్, తీవ్రస్థాయి హీమోఫీలియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారితో పాటు కిడ్నీ దెబ్బతిన్న వారికి కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ప్రతినెలా గరిష్టంగా రూ. 10 వేల చొప్పున పింఛను అందుతోంది. మరో వైఫు వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. దీనివల్ల కొత్తగా 10,60,208 మంది పింఛను పొందుతున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. -
ఆవు పేడతో సూట్‌కేస్.. అసెంబ్లీకీ తీసుకువెళ్లిన ఛత్తీస్‌గఢ్ సీఎం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగల్ బుధవారం వెరైటీ బ్రీఫ్‌కేసుతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యి అందరికీ షాక్ ఇచ్చారు. ఇది వరకే బడ్జెట్ సమావేశాలకు సూట్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చేవారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాత పద్ధతులకు స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఛతీస్‌గఢ్ సీఎం కూడా ఇంకాస్త ముందడుగా వేసి ఏకంగా ఆవు పేడతో తయారైన బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకుని అసెంబ్లీకి వెళ్లారు. ఆవు పేడకు చెందిన పొడి, గమ్, పిండి, ఇతర పదార్థాలతో పాటు కొండగావ్‌కు చెందిన కళాకారులు హ్యాండిల్, కలపతో తయారు చేశారు. ఆ సూట్‌కేసుపై సంస్కృతంలో “గోమయే వసతే లక్ష్మి” అని రాసి ఉంది. అంటే దీని అర్థం “లక్ష్మి దేవత ఆవు పేడలో ఉంటుంది”. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆవుపేడతో తయారైన బ్రీఫ్‌కేస్‌తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం భారత్‌లో ఇదే తొలిసారి. దీన్ని తయారు చేసేందుకు పది రోజులు పట్టినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గత నెలలో పశువుల పెంపకం గ్రామస్తులు, గౌతన్‌లు, గౌతమ్ కమిటీలతో సంబంధం ఉన్న మహిళా సంఘాల కోసం తన ప్రధాన పథకం గోధన్ న్యాయ్ యోజన కోసం రూ.10.24 కోట్లను విడుదల చేసింది. పశువుల యజమానులకు కనీస ఆదాయ మద్దతును అందించడమే ఈ పథకం లక్ష్యం. ఆవు పెంపకందారులు, రైతుల నుంచి ఆవు పేడను సేకరిస్తామని 2020లో రాష్ట్రం ప్రకటించింది, భారతదేశంలో అలా చేసిన మొదటి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. -
బడ్జెట్ సమావేశాల్లో మండలి చైర్మన్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో సుమారు 9 నెలలుగా ఖాళీగా ఉన్న శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులకు ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి వారంలోనే షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది. 40 మంది సభ్యులున్న మండలిలో టీఆర్ఎస్కు 36 మంది సభ్యుల బలం ఉండటంతో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఏకగ్రీవం కానున్నాయి. మండలి చైర్మన్‌గా వ్యవహరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గతేడాది జూన్ 3న మండలి సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకున్నారు. వారిద్దరి పదవీకాలం ఏకకాలంలో ముగియడంతో మండలిలో సీనియర్ సభ్యుడు వెన్నవరం భూపాల్‌రెడ్డిని గతేడాది జూన్ 4న ప్రొటెమ్ చైర్మన్‌గా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నామినేట్ చేశారు. అయితే ఎమ్మెల్సీగా భూపాల్‌రెడ్డి పదవీకాలం జనవరి 4న ముగియడంతో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ అమీనుల్ హసన్ జాఫ్రీ గత నెల ప్రొటెమ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. అమీనుల్ హసన్ జాఫ్రీని ప్రొటెం చైర్మన్‌గా నామినేట్ చేయాలని కోరుతూ ప్రభుత్వం పంపించిన సిఫారసుతో గవర్నర్ తొలుత విభేదించినట్లు సమాచారం. అయితే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికను తక్షణమే నిర్వహించడం సాధ్యం కాదని... బడ్జెట్ సమావేశాల్లో ఎన్నిక నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గవర్నర్ అందుకు అంగీకరించి జాఫ్రీ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనివార్యం కానుంది. మరోవైపు మండలిలో చీఫ్ విప్‌తోపాటు మరో నలుగురు విప్‌లు ఉండగా ఎంఎస్ ప్రభాకర్‌రావు మినహా గతంలో చీఫ్ విప్, విప్ పదవులు నిర్వహించిన ఎమ్మెల్సీలంతా పదవీకాలం పూర్తి చేసుకున్నారు. గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు మండలి వివిధ కోటాల్లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా 21 మంది ఎన్నికయ్యారు. గతంలో విప్‌లుగా వ్యవహరించిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, తానిపర్తి భానుప్రసాద్‌రావు స్థానిక సంస్థల కోటాలో మళ్లీ ఎమ్మెల్సీలయ్యారు. చైర్మన్‌గా మళ్లీ గుత్తానే? గవర్నర్ కోటాలో గతేడాది నవంబర్‌లో తిరిగి మండలి సభ్యుడైన గుత్తా సుఖేందర్‌రెడ్డికే మరో సారి చైర్మన్ పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మధుసూదనాచారి, కడియం శ్రీహరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన గుండా ప్రకాశ్ ముదిరాజ్‌కు వైస్‌చైర్మన్ పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్, వాణీదేవి, తక్కళ్లపల్లి రవీందర్రావు, వీజీ గౌడ్ తదితరుల పేర్లు ప్రభుత్వ విప్‌లుగా పరిశీలనలో ఉన్నట్లు తెలియవచ్చింది. -
మీ పాలనలో అంతరం మరింత పెరిగింది
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ పాలనతో ఏకీకృత భారతం కాస్తా, సంపన్న భారతం, పేదరిక భారతంగా మారిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ రెండు అసమానత భారతాల మధ్య అంతరం తగ్గించే ప్రయత్నం చేయాలని కేంద్రానికి సూచించారు. మొత్తం దేశ సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఇకనైనా దేశ సంపదను ఆ కొద్దిమందికి పంచడం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఇండియా రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగం చెబుతోందని, అలాంటి దేశాన్ని కేంద్రమే పరిపాలించాలనుకోవడం దురదృష్టకరమని, ఈ ధోరణి దేశానికి పెను ముప్పు అని హెచ్చరించారు. 1947లో బ్రిటీష్‌వాళ్లు దేశాన్ని వదిలిపోవడంతోనే పోవడంతోనే అంతమైన రాచరిక వ్యవస్థ, బీజేపీ హయాంలో మళ్లీ పురుడుపోసుకుందని నిప్పులు చెరిగారు. దేశంలో ఉన్న భిన్న భాషలు, సంస్కృతులను అణచివేయొద్దని, ఇది ప్రజాస్వామ్యమే కానీ, రాచరికం కాదని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ పార్లమెంటులో తొలి ప్రసంగం చేశారు. ‘‘మా ముత్తాత 15ఏళ్లు జైలు పాలయ్యారు. మా నాన్నమ్మ 32 తూటాలకు బలయ్యింది. మా నాన్న ముక్కలు ముక్కలైపోయారు. అవన్నీ అనుభవించినవాడిగా చెబుతు న్నా... చాలా ప్రమాదకరమైన దానితో ఆడుకుంటున్నారు. అది ఆపేస్తే మంచిది. లేకపోతే కచ్చితంగా సమస్యను సృష్టించినవారవుతారు’’ అని హెచ్చరించారు. ప్రభుత్వం నిత్యం మేడిన్ ఇండియా అని మాట్లాడుతోందని, కానీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించకుండా అది సాధ్యం కాదని తెలిపారు. ఉద్యోగాలు కల్పించే శక్తి వాటికే ఉందన్నారు. బిహార్‌లో ఉద్యోగార్థుల ఆందోళన ప్రస్తుతం దేశంలో ఉన్న నిరుద్యోగానికి అద్దం పడుతోందన్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగసస్ వంటివాటిని ఉపయోగించుకుని రాష్ట్రాల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై దాడి చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. బీజేపీ అనుబంధ సంస్థలు ఉద్యమాలు చేస్తున్న రైతులను ఉగ్రవాదులుగా ముద్రవేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ఏడాది కోట్ల ఉద్యోగాలిస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్కారు చెబుతున్న మార్పు, సమానత్వం మాటల్లోనే తప్ప క్షేత్రస్థాయిలో లేదన్నారు. డీఎంకే ఎంపీ తిరుచీ శివ మాట్లాడుతూ.. అఖిల భారత సర్వీసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకపోవడాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ... కేంద్రం సమాఖ్య స్ఫూర్తిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని ణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ మండిపడ్డారు. అఖిల భారత సర్వీసు క్యాడర్ నిబంధనల్లో మార్పు ప్రతిపాదనలను, వందమంది మాజీ ఐఏఎస్‌లు, ఐఎఫ్స్లు, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నా కేంద్రం నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. అభివృద్ధిని చూసే గెలిపిస్తున్నారు ఐదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్లే జనం 2019లో స్పష్టమైన మెజారిటీతో గెలిపించారని ఉత్తరప్రదేశ్ బీజేపీ రాజ్యసభ సభ్యురాలు గీత అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మాన చర్చలో ఆమె రాజ్యసభలో బుధవారం మాట్లాడారు. ప్రభుత్వం తన సంక్షేమ పథకాలతో అట్టడుగు వర్గాలు, వెనుకబడిన తరగతుల ప్రజల ఆర్ధిక సమానత్వానికి కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీ వర్గానికి చెందిన 27 మంది, ఎస్సీఎస్టీకి చెందిన వారు 20 మంది, మహిళలు 11 మంది ఉన్నారన్నారు. పెళ్లి వయసును 18 నుంచి 23కు పెంచుతూ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందని తెలిపారు. బీజేపీ సభ్యుడు శ్వేత్మాలిక్ మాట్లాడుతూ...కాంగ్రెస్ నేతృత్వంలోని గత ప్రభుత్వాలు తమ అవినీతితో సామాన్యుని నడ్డి విరిచాయని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం అతి పెద్ద తప్పిదమన్నారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాద దాడులను సర్జికల్ స్ట్రైక్‌తో తిప్పికొట్టిందన్నారు. -
TS: 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 22 నుంచి వారం పాటు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి 26న బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఆరు నెలలలోపు అంటే ఈ నెల 26లోపు సభ తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి సమావేశాలు జరిగే అవకాశాలు న్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. శాసనసభను వారం రోజులు, మండలిని మూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నెల రెండో వారంలోనే సమావేశాలు నిర్వహించాలని భావించినా.. వినాయక నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు తెలిసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు జరపనున్నారు. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌పై ఒకట్రెండు రోజుల్లో స్పష్టతవచ్చే అవకాశం ఉంది. దళితబంధు పథకానికి చట్టబద్దతతో పాటు ఏయే అంశాలపై బిల్లులు ప్రవేశ పెట్టాలనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. -
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : జనవరి 29 నుంచి(శుక్రవారం) పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 ప్రతిపక్ష పార్టీలు గురువారమే ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం పార్లమెంటు సచివాలయం మూడు చోట్ల ఎంపీలకు సీటింగ్ ఏర్పాటు చేసింది. చదవండి: 16 పార్టీల ప్రకటన.. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ 33 పనిదినాలపాటు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనుండగా.. ప్రతి రోజు నాలుగు గంటల చొప్పున లోక్‌సభ, రాజ్యసభ సమావేశం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలలో యథావిధిగా జీరో అవర్, ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్రం ఎకనామిక్ సర్వే టేబుల్ చేయనుంది. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు రైతు ఉద్యమం, కరోనా, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, చైనా దూకుడు తదితర అంశాలను ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. -
ఈసారి డిజిటల్ బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ సభ్యులకు ఈసారి డిజిటల్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్–19 ప్రొటోకాల్ దృష్ట్యా సభ్యులకు ఈసారి ముద్రిత ప్రతుల పంపిణీ ఉండదు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరం(2021–22) బడ్జెట్ కాపీలను కోవిడ్–19 వ్యాప్తి ప్రమాదం దృష్ట్యా ముద్రించడానికి బదులు ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇలాంటి పరిణామం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమం. స్వాతంత్య్ర భారతావనిలో మొట్టమొదటి సారిగా దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.7% పడిపోయిన నేపథ్యంలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. కోవిడ్ మహమ్మారితో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు వృద్ధి రేటును పెంచే చర్యలుంటాయని భావిస్తున్నారు. కసరత్తు తప్పింది సాధారణంగా ఆర్థిక బిల్లుతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల పద్దు, కొత్తగా విధించే పన్నులు, ఇతర చర్యల వివరాలుండే ముద్రణ ప్రతులను పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో సభ్యులకు అందజేయడం ఆనవాయితీ. ఆర్థిక బిల్లులో దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను తెలిపే వివరాలుంటాయి. భారీ సంఖ్యలో ఉండే ఈ పత్రాలన్నిటినీ పార్లమెంట్ సభ్యులకు అందజేస్తారు. ముద్రణకు ఆరంభ సూచికగా హల్వా పేరుతో వేడుక ఉంటుంది. -
టీడీపీ వ్యతిరేకించినట్టా? స్వాగతించినట్టా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య సమన్వయ లోపం బయటపడింది. బడ్జెట్‌పై గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ నల్లచొక్కాలు ధరించిన టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో వాకౌట్ చేశారు. మరోవైపు మండలిలో మాత్రం గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా మండలిలో నిరసన తెలిపారు. ఇదే అంశంపై అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. అసెంబ్లీలో వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు మండలిలో ఎందుకు చేయలేదంటూ బీజేపీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆరా తీస్తున్నారు. (విశాఖనే పరిపాలన రాజధాని) అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపి బయటకు వచ్చేయాలని, కౌన్సిల్లో మాత్రం రెండురోజులు చర్చలో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు సభ్యలు భిన్నవాదనలు వినిపించినట్లు సమాచారం. దీనిపై బీజేపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ.. వాకౌట్ విషయంలో టీడీపీలో సమన్వయ లోపం కన్పించిందన్నారు. వాకౌట్ విషయమై టీడీపీ ముందుగా చర్చించుకోలేదేమోనని అభిప్రాయపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ వ్యతిరేకించినట్టా..? స్వాగతించినట్టా అని సభ్యులు చర్చించుకుంటున్నారు. (అసెంబ్లీలో నిరసన.. కౌన్సిల్లో ఘర్షణ!) మరోవైపు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును శాసనమండలిలో అడ్డుకోవాలని ప్రతిపక్షం భావిస్తోంది. దీనిలో భాగంగానే మండలిలో మెజార్టీ ఉన్నందున సభ్యులంతా పాల్గొనాలని చంద్రబాబు వారికి దిశానిర్ధేశం చేశారు. మూడు రాజధానుల సహా ముఖ్యమైన బిల్లులు మళ్లీ కౌన్సిల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని, వస్తే వాటిని అడ్డుకోవాలని సభ్యులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లుపై ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూడాలని హితబోధ చేశారు. -
ఏపీ బడ్జెట్ సమావేశాలు.. అప్డేట్స్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉ.10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సభ ఎజెండాను రూపొందించేందుకు బీఏసీ సమావేశం కానుంది. దీని తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రూ. 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్లో కూడా సంక్షేమ పథకాలు, నవరత్నాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఏపీ మంత్రివర్గం సమావేశంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి తొలుత ఆమోదం తెలపగగా, 2020-2021 రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2019-20 సప్లమెంటరీ బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్–2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో మంత్రి సుభాష్‌చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. (నవరత్నాల వెలుగులు) ఏపీ బడ్జెట్ (2020-21) లైవ్ అప్డేట్స్ మీకోసం.. బీఏసీ సమావేశం అనంతరం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బీఏసీ సమావేశం అనంతరం శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు. కాసేపట్లో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభంకానుంది. రెండు రోజుల పాటు శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని మండలి బీఏసీలో నిర్ణయం. మండలి బీఏసీ సమావేశం ముగిసింది. శాసనమండలి చైర్మన్ షరీఫ్ నేతృత్వంలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు. ‘టీడీపీ సభ్యుల మధ్య సమన్వయలోపం కనిపించింది’ - బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ‘టీడీపీ ఈరోజు సభలో ద్వంద్వ విధానాన్ని అవలంభించింది. టీడీపీలో అవగాహన లోపం స్పష్టంగా కనిపించింది. అసెంబ్లీలో వాకౌట్ చేసి.. కౌన్సిల్లో నిరసన చేపట్టింది. గవర్నర్ ప్రసంగం కాబట్టి ఈరోజు జరిగింది ఉమ్మడి సమావేశం. టీడీపీ చేస్తే పూర్తిగా నిరసన కార్యక్రమం చేపట్టాలి. లేదంటే గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వాలి’ - విప్ సామినేని ఉదయభాను టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య సమన్వయ లోపం శాసనసభలో వాకౌట్ చేసి మండలిలో నిరసన తెలిసిన టీడీపీ గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ వ్యతిరేకించినట్టా స్వాగతించినట్టా అని లాబీల్లో చర్చ కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానం, సమావేశాల అజెండాపై చర్చించనున్నారు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసింది ఏపీ 2020-2021 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగం. ప్రసంగంలోని ప్రధానమైన అంశాలు.. ఏడాదిలో సంక్షేమ పథకాల కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేశాం వివిధ పథకాల కింద 3.98 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాం గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధిగా నమోదయింది 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చాము. మరో 39 హామీలు పరిశీలనలో ఉన్నాయి 1060 కొత్త 108, 104 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15337 కోట్లు కేటాయించాం వైఎస్సార్ రైతుభరోసా పథకం మొదటి దశ పూర్తయింది. రూ.12,500 ఇస్తామని చెప్పినప్పటికీ.. దీన్ని రూ.13,500లకు పెంచాం నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీని కోసం రూ.1534 కోట్లు ఖర్చు చేశాం విద్యార్థులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్ద పథకం. దీనికోసం 1105 కోట్లు ఖర్చు చేశాం జగనన్న వసతి దీవెన కింద 18.51 లక్షల మందికి లబ్ధి. దీనికోసం 3857 కోట్లు ఖర్చు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద 1.06 లక్షల మందికి లబ్ధి. దీని కోసం రూ.72.82 కోట్లు ఖర్చుచేశాం. వైఎస్సార్ కంటివెలుగు కింద 67.69 లక్షల మందికి లబ్ధి. దీని కోసం 53.85 కోట్లు ఖర్చు చేశాం. గ్రామసచివాలయాల్లో 12వేల వైఎస్సార్ క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15,337 కోట్లు కేటాయించాం మొదటి దశలో 49.44 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ రూ.10,209.32 కోట్లు ఖర్చు చేశాం కౌలురైతులకు కూడా ప్రయోజనం కల్పిస్తూ చర్యలు చేపట్టాం ప్రతి గ్రామసచివాలయంలోనూ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి నియోజకవర్గస్థాయిలో 147 వైఎస్సార్ వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేశాం జిల్లాస్థాయిలో 13 ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేశాం పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ.2వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రూ.7వేల కోట్లతో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తున్నాం, మహిళల పేరిట ఈ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయిస్తాం నాలుగేళ్లలో 25 లక్షల గృహాలను సమకూరుస్తాం 15 లక్షల ఇళ్లకు సంబంధించి ఆగస్టులో పనులు ప్రారంభమవుతాయి కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం 11,158 గ్రామ సచివాలయాలు, 3876 వార్డు సచివాలయాలున్నాయి.. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం 2వేల మంది అవసరాలను తీరుస్తున్నాయి.. ఒక్కో సచివాలయంలో 10 మంది శాశ్వత సిబ్బంది, 40 మంది వాలంటీర్లు ఉన్నారు సున్నావడ్డీ పథకంతో 91 లక్షల మందికి ప్రయోజన చేకూరనుంది 45-60 మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.75వేల ఆర్ధికసాయం చేస్తున్నాం. రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళల సాధికారిత కోసం నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం రిజిర్వేషన్లు కల్పించాం 51,400 మంది ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలోకి తీసుకుంటూ ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం ప్రాజెక్టుల గురించి.. జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఉద్దేశించిన 54 సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో 14 ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశాం మిగిలిన ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయి ఈ ఏడాది పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండోదశ, వంశధార-నాగావళి అనుసంధానం, అవుకు రెండో సొరంగం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ది గురించి విద్యుత్ బకాయిలకు సంబంధించి డిస్కంలకు రూ. 17904 కోట్లు కేటాయించాం ఏపీఐఐసీ ద్వారా 1466పైగా కంపెనీలకు భూములు కేటాయించాం దీని ద్వారా 36810 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.11548 కోట్ల పెట్టుబడులు వస్తాయి చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం వైఎస్ఆర్ నవోదయ పథకాన్ని ప్రారంభించాం.. భోగాపురం, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు పనులను వేగవంతం చేశాం జీఎంఆర్ సంస్థతో రూ.2,300 కోట్ల మేర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు కొత్త ఓడరేవుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం 3200 కోట్ల వ్యయంతో మూడేళ్లలో 8 చేపలు పట్టే ఓడరేవులను నిర్మిస్తాం రివర్స్ టెండరింగ్ గురించి.. ప్రభుత్వం స్వచ్ఛమైన మరియు అవినీతిరహితమైన పాలనకు కట్టుబడి ఉంది రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా చేశాం 100 కోట్లకుపైబడిన అన్ని టెండర్లను రిటైర్డ్ హైకోర్టు జడ్జి ద్వారా పరిశీలించబడి కమిషన్ ద్వారా ఖరారు చేయబడుతుంది. భూమి హక్కు గుర్తింపు చట్టం ద్వారా రిజిస్ట్రేషన్లలో అవకతవకలను భూ వివాదాలకు తావులేకుండా చేస్తున్నాం మూడు రాజధానులపై గవర్నర్ ఏమన్నారంటే.. పరిపాలన వికేంద్రీకరణ అనేది కీలక అంశం మూడు రాజధానులు ఏర్పాటు శాసన ప్రక్రియలో ఉంది శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది, ఆంగ్లమాధ్యమం గురించి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాం. 97శాతం మంది తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకున్నారు. ఇందులో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పడికీ త్వరలోనే తొలగిపోతాయి. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను నియంత్రించడానికి చట్టం తీసుకొచ్చాం. జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటుచేశాం. చారిత్రాత్మకమైన దిశ బిల్లును తీసుకొచ్చాం మహిళలపై జరిగే నేరాలకు సత్వర విచారణ జరిపి 21 రోజుల్లో విచారణ జరిపేలా చట్టం 18 దిశా పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేశాం దిశ చట్టం అమలుక ప్రత్యేక న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేస్తాం మద్యపాన నిషేధం దిశగా అడుగులు దశల వారీ మద్యం నిషేధం అమల్లో భాగంగా 43వేల బెల్ట్‌షాపుల తొలగించాం. 4,300 పర్మిట్ రూమ్‌లను తొలగించాం కరోనా, లాక్డౌన్, వలసకూలీల గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి.. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది కరోనా పరీక్షల నిర్వహణలో ఇతర రాష్ట్రాలకంటే ఏపీ ముందుంది రోజుకు దాదాపు 15వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 5.5 లక్షల పరీక్షలు పూర్తి చేశాం రాష్ట్రంలో మరణాల రేటు.. జాతీయ సగటు కంటే చాలా తక్కువ రికవరీ రేటు.. జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది ప్రభుత్వం టెస్టింగ్ ల్యాబ్‌లను 1 నుంచి 13కు పెంచింది రాష్ట్రంలో 5 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులున్నాయి కరోనా నివారణకు జిల్లాల్లో 65 ఆస్పత్రులు, 5,400 ఐసీయూ బెడ్స్, 38వేల ఐసోలేషన్ బెడ్స్, ఆక్సిజన్ సరఫరాతో 15వేల బెడ్స్ ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో రూ.వెయ్యి ఆర్ధిక సహాయంతో పాటు ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం, కిలో పప్పు ఇచ్చాం. వలసకూలీల సమస్యలను పరిష్కరించేందుకు 400 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి 1.2లక్షలకు పైగా వలస కూలీలకు ఆహారం వసతి అందించాం ఇతర రాష్ట్రాల్ల్లో చిక్కుకున్న 3.2లక్షల వలస కార్మికులను ఉచితంగా వారి గృహాలకు చేర్చాం, ఆర్టీసీ బస్సులు , శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని సొంత గ్రామాలకు తరలించాం కరోనా సమయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రూ.2,200 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు చర్యలు తీసుకున్నాం, వాలంటీర్ల ద్వారా నాలుగు విడతలుగా ఇంటించి సర్వే చేయించాం. -
కమల్‌ను కాపాడిన ‘కరోనా’
భోపాల్/న్యూఢిల్లీ: మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో సోమవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరోనా వైరస్ కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా ఆదుకుంది. విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని గవర్నర్ లాల్జీ టాండన్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ఆదేశించిన నేపథ్యంలో.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభను మార్చి 26 వరకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అంతకుముందు, కోవిడ్–19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్త మహమ్మారిగా నిర్ధారించిందని, ఆ వైరస్ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో.. రాజస్తాన్, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారని మంత్రి గోవింద్ సింగ్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు, మంగళవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆదేశిస్తూ గవర్నర్ టాండన్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సోమవారం మరో లేఖ రాశారు. విశ్వాస పరీక్ష జరపనట్లయితే.. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లు భావించాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడడంతో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, తక్షణమే బల నిరూపణకు ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. నిమిషం పాటే గవర్నర్ ప్రసంగం: బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ సభను ఉద్దేశించి ఇచ్చే ప్రసంగం సోమవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క నిమిషం పాటే కొనసాగింది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలు, వాగ్వివాదాల గందరగోళం మధ్య ఒక నిమిషంలోనే గవర్నర్ లాల్జీ టాండన్ తన ప్రసంగాన్ని ముగించి, వెళ్లిపోయారు. ఆ తరువాత, సోమవారమే బల నిరూపణ జరగాలని బీజేపీ చీఫ్ విప్ నరోత్తమ్ మిశ్రా, సభలో విపక్ష నేత గోపాల భార్గవ డిమాండ్ చేశారు. అనంతరం, గందరగోళం మధ్యనే కరోనా వైరస్ ముప్పును శాసనసభ వ్యవహారాల మంత్రి గోవింద్ సింగ్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో సభను 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ వద్దకు బీజేపీ నేతలు: ఆ తరువాత, శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ నివాసానికి వెళ్లి, తక్షణమే విశ్వాస పరీక్ష జరగాలని ఆదేశించాలని అభ్యర్థించారు. మరోవైపు, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసుల సాయంతో కర్నాటకలో బీజేపీ నిర్బంధించిందని, ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష రాజ్యాంగవిరుద్ధం అవుతుందని కమల్‌నాథ్ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
ఏదైనా మంచి ఉంటే గదా.. చెప్పడానికి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఒక్క మంచి మాట అయినా కాంగ్రెస్ సభ్యులు చెప్పలేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారని, అసలు ఈ బడ్జెట్లో ఏదైనా మంచి ఉంటే గదా చెప్పడానికి అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి సమాధానం అనంతరం వివరణల్లో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. తమది సంక్షేమ ప్రభుత్వమని, సంక్షేమ బడ్జెట్ అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, సంక్షేమ ప్రభుత్వమైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఫీజులపై బడ్జెట్లో ఎందుకు కోత విధించిందని ప్రశ్నించారు. తమను కర్రు కాల్చి ప్రజలు వాతపెట్టారని ప్రభుత్వం అంటోందని, తమకేమీ ప్రజలు వాత పెట్టలేదని, అధికార పార్టీ సభ్యులను ఎలా గెలిపించారో, తమను కూడా ప్రజలు అలాగే గెలిపించారన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపేందుకు ప్రతిపక్ష సభ్యులుగా తమను సభకు పంపారని చెప్పారు. మేడిగడ్డ నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయలే.. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్ప లు చెప్పుకుంటోందని, ఈ ప్రభుత్వం గొప్పలు చెపుతున్నట్టు మేడిగడ్డ నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని భట్టి విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉండే శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, కడెం, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టిందని, కాకతీయ కెనాల్, వరద కాల్వ కూడా తాము తవ్వినవేన ని టీఆర్ఎస్ గ్రహించాలన్నారు. రెప్పపాటు కూడా కరెంటు పో కుండా తామేదో చేశామని ప్రభు త్వం గొప్పలు చెబుతోందని, ఈ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి అదనంగా చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాదాద్రి, భద్రాద్రి ప్రాజెక్టుల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో ఒప్పందం తప్ప ఏమీ చేయలేదని, భద్రాద్రి, యాదాద్రి ఇంతవరకు పూర్తి కాలేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి కారణంగానే రాష్ట్ర విద్యుత్ పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఆరోపించారు. సీఎంను పిలిపించండి.. అంతకుముందు తన ప్రసంగంలో భాగంగా భట్టి మాట్లాడుతూ.. తమను అనాల్సినవి అన్నీ అనేసి సీఎం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షం చెప్పే సూచనలను సీఎం వింటే బాగుంటుందని వెంటనే పిలిపించాలని స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా అధికార పక్షం అడ్డుకునే ప్రయత్నం చేయగా స్పీకర్ పోచారం రాజకీయ వ్యాఖ్యలు కాకుండా బడ్జెట్ గురించి మాట్లాడాలని భట్టికి సూచించారు. దీనిపై స్పందించిన భట్టి ‘మాకు స్పీకర్ స్థానంపై గౌరవముంది. మేం మాట్లాడేటప్పుడు కట్టడి చేస్తాం. వాళ్లకు మాత్రం మమ్మల్ని తిట్టేందుకు అవకాశం ఇస్తాం అనడం మాత్రం సరైంది కాదు.’అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత హరీశ్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలో స్పీకర్ ఉదారంగా వ్యవహరిస్తున్నారని, ఆయననుద్దేశించి భట్టి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. బడ్జెట్‌పై కాంగ్రెస్ సభ్యులు ఎంతసేపు మాట్లాడారో హరీశ్ సభకు వివరించారు. -
కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలకు పోయినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. 50–60 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందని, యూపీఏ ప్రభుత్వంపై విసుగెత్తి వీళ్లేదో ఉద్ధరిస్తారని ప్రజలు గెలిపిస్తే చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇది ఒక దేశమని, ఎవడబ్బ సొత్తు కాదనే విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు రాజాసింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తున్న సందర్భంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ.. దేశాన్ని నడిపే విషయంలో కాంగ్రెస్, బీజేపీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని వ్యాఖ్యానించారు. ‘కేంద్రం ఏదో మేమిచ్చినం... మేమిచ్చినం అంటోంది. మీరెవరండీ ఇచ్చే దానికి నాకర్థం కాదు. నాకు తిక్కరేగి ఇప్పుడున్న హోం మంత్రిని క్షమాపణ అడిగిన. నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తానని చెప్పిన. అయినా వీళ్లు ఇచ్చేది ఏంది? రాజ్యాంగం మేరకు పన్నుల వాటా ఇవ్వాల్సిందే. దానికి పేరు మాత్రం సెంట్రల్ డివల్యూషన్ అని పెట్టారు. సెంట్రల్ డివల్యూషన్ లేదు... మన్ను లేదు. కొన్ని రకాల పన్నులను అన్ని రాష్ట్రాల నుంచి వసూలు చేసే బాధ్యత కేంద్రంపై రాజ్యాంగం పెట్టింది. ఆ ప్రకారం రాష్ట్రం వాటాగా ఆ పన్నులు ఇవ్వాల్సిందే. అదేమీ బిచ్చమెత్తుకునేది కాదు’అని స్పష్టం చేశారు. సీఎస్టీ పేరుతో యూపీయే ప్రభుత్వం రాష్ట్రాల పన్నులను మింగేస్తే జీఎస్టీ పేరుతో ఎన్డీయే సర్కార్ మింగేస్తోందని, ఆ జీఎస్టీకే దిక్కులేదని వ్యాఖ్యానించారు. కేంద్రం వాటా కింద ఇచ్చే పన్నులపై ఆధారపడి ఉద్యోగస్తులకు ప్రతి నెలా మొదటి తారీఖు కల్లా జీతాలిస్తామని, కానీ ఇప్పుడున్న కేంద్రం ఇవ్వడం లేదని, రూ.3,910 కోట్లకు ఇప్పటివరకు దిక్కులేదన్నారు. ఇవ్వాల్సింది ఇవ్వకపోగా మన నెత్తిమీద మన చెయ్యి పెట్టినట్లు రూ.1,410 కోట్లు అప్పు తెచ్చుకోవాలని కేంద్రం చెప్పిందని ఎద్దేవా చేశారు. పన్నుల వాటాలో కేంద్రం మెహర్బాణీ ఏమీ లేదని, ఎన్డీయే ప్రభుత్వం ఏ ఒక్క ఏడాది కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.10వేల కోట్లకు మించి ఇవ్వలేదన్నారు. దానికే తామేదో చేసేస్తున్నట్లు బాజా కొట్టుకుంటున్నారని, బాజాలో బీజేపీ.. కాంగ్రెస్ తాత అయిందని పేర్కొన్నారు. ‘కిత్నే ఆయా బోలో... కిసీ కా బాప్‌కా హై? దేశాన్ని సాదే మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. మిగిలినవన్నీ అడుక్కుతినే రాష్ట్రాలే. మనం రూ.50 వేల కోట్లు ఇస్తే వాళ్లు రూ.24 వేల కోట్లు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికయినా బీజేపీ నీచబుద్ధి మానుకోవాలి’అని సీఎం కేసీఆర్ సూచించారు. మేం మొదటి సారే గెలిచాం.. బీజేపీ లేకలేక అధికారంలోకి వచ్చిందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యుడు రాజాసింగ్ స్పందించి తాము రెండుసార్లు అధికారంలోకి వచ్చామని, టీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చింది కూడా రెండోసారేనని అన్నారు. దీనికి కౌంటర్‌గా సీఎం మాట్లాడుతూ.. తాము మొదటిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే గెలిచామని, బీజేపీ 50–60 ఏళ్లకు అధికారంలోకి వచ్చిందని వివరించారు. కిసీకా బాప్‌కా హై.. బడ్జెట్లో పెట్టిన నిధులు ఖర్చుపై గురువారం సభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. బడ్జెట్‌పై ప్రభుత్వ సమాధానంలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం ఏదో ఇస్తున్నామని చెబుతోందని, అది బిచ్చమెత్తుకునేది కాదని, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాటా అంటూ ‘కిసీకా బాప్‌కా హై’అని వ్యాఖ్యానించారు. తర్వాత సీఎల్పీ నేత ముల్లు భట్టి విక్రమార్క మాట్లాడుదూ.. రైతుబంధు కింద రాష్ట్రంలోని రైతాంగానికి ఇచ్చే నిధులు ‘మీ జేబుల్లోంచి ఇచ్చారా..? టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి తెచ్చారా’అని ఘాటుగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు ‘కిసీ కా జాగీర్ నహీ హై... కిసీకా బాప్‌కా నహీ హై’అని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అధికార సభ్యులు భట్టి వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు. మీరు ఎస్సారెస్పీ కట్టామని చెబుతున్నారు.. ఆ నిధులు మీ ఇంట్లోంచి తెచ్చారా అని భట్టిని ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజాధనం ఖర్చు విషయంలో భట్టి మాట్లాడిన మాటలు అసంబద్ధమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు ద్వారా రాష్ట్ర రైతాంగానికి సాయం చేయాలన్న సోయి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సంపద పెంచాలి... పేదలకు పంచాలి.. అనేది తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. మొత్తంమీద ప్రజాధనం మీద చర్చ పార్టీల మధ్య విమర్శలకు దారితీసింది. చదవండి: ‘మక్కల లొల్లి’కి... మంత్రుల కౌంటర్ సంక్షేమం ఆగదు.. -
సంక్షేమం ఆగదు..
ఆర్థిక మాంద్యం నెలకొన్నా సీఎం కేసీఆర్ సూచనల మేరకు సంక్షేమానికి నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్ ద్వారా ఆసరా పెన్షనర్లు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు, రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు పెరుగుతున్నారన్న విషయాన్ని ప్రజలు, ఇతర పార్టీలు గ్రహించాలి. తొలిసారిగా రాష్ట్ర ఖజానా నుంచి దేవాలయాల అభివృద్ధికి రూ.500కోట్ల నిధుల కేటాయింపు ఘనత మాకే దక్కుతుంది. సాక్షి, హైదరాబాద్: డబ్బులకు వెనుకాడకుండా పేదలే ఎజెండాగా, ప్రజలే కేంద్ర బిందువుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆర్థిక మంత్రి టి. హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రతి ఇంటా సౌభాగ్యం, ప్రతి కంట్లో సంతోషం చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రపంచం ఆగ మయినా, దేశంలో ఏం జరిగినా, ఎంత కష్టమొచ్చినా రాష్ట్రంలో సంక్షేమం ఆగదని తేల్చి చెప్పారు. తమ బడ్జెట్ ప్రజలను సంతోషపెట్టిందని, కాంగ్రెస్‌ను మాత్రం నిరాశపరిచిందని ఎద్దే వా చేశారు. ప్రతిపక్షం చెబుతున్నట్లు ఈ బడ్జెట్ ప్రజలను భ్రమల్లోకి నెట్టలేదని, కాంగ్రెస్ నేత ల భ్రమలను బద్దలు కొట్టిందన్నారు. 2020– 21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ అనంతరం ప్రభుత్వ పక్షాన హరీశ్‌రావు గురువారం అసెంబ్లీలో సమాధానమిచ్చారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను, విధానాలను, ఐదున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు. హరీశ్ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... మాంద్యంలోనూ సంక్షేమానికి నిధులు... ‘‘ఆర్థిక మాంద్యం నెలకొన్నా సీఎం కేసీఆర్ సూచనల మేరకు సంక్షేమానికి నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్ ద్వారా ఆసరా పెన్షనర్లు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు, రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు పెరుగుతున్నారన్న విషయాన్ని ప్రజలు, ఇతర పార్టీలు గ్రహించాలి. తొలిసారి గా రాష్ట్ర ఖజానా నుంచి దేవాలయాల అభివృద్ధికి రూ. 500 కోట్ల నిధుల కేటాయింపు ఘనత మాకే దక్కుతుంది. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం ఎన్నిసార్లు కేంద్రానికి లేఖలు రాసినా, స్వయంగా ఢిల్లీ వెళ్లి కోరినా ప్రయోజనం లేకపోవడంతో ఈసారి బడ్జెట్లో రూ. 10 వేల కోట్లను హైదరాబాద్ అభివృద్ధికి కేటాయించాం. రైతు సంక్షేమం కోసం రైతు బంధు నిధులు పెంచడంతోపాటు మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. రైతు బీమా బడ్జెట్ పెంచడంతోపాటు రైతు వేదికలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాం. కాంగ్రెస్‌ది కరెంటు బంద్ ప్రభుత్వం... విద్యుత్‌రంగ అభివృద్ధి లెక్కలు చెబితే కాంగ్రెస్ నేతలు పశ్చాత్తాపపడక తప్పదు. ఎంత డిమాండ్ ఉన్నా కనురెప్పపాటు కూడా కరెంటు పోకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వం మాది. కాంగ్రెస్ పార్టీది కరెంటు బంద్ ప్రభు త్వమైతే మాది రైతు బంధు ప్రభుత్వం. దేశంలోనే ప్రజారోగ్యం అందిస్తున్న మూడు రాష్ట్రా ల్లో తెలంగాణ ఒకటి. గతంలో రాష్ట్రంలో ఒక్క డయాలసిస్ సెంటర్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు 40కిపైగా ఏర్పాటు చేశాం. జిల్లాకు నాలుగైదు ఐసీయూ యూనిట్లు పెట్టాం. కేసీఆర్ పేదల మనిషి... ఎన్నికలకు ముందు వరాలివ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం మా విధానం కాదు. మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా కల్యాణలక్ష్మి, రైతు బంధు, మిషన్ కాకతీయ లాంటి పథకాలను అమలు చేస్తున్నాం. ఎన్నికలు, ఓట్లు, సీట్ల కోసం పనిచేసే వ్యక్తి సీఎం కేసీఆర్ కాదు. ఆయన పేదల మనిషి. మానవీయకోణంలో ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన మనిషి. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిద్దిపేట పరిధిలోని ఇమాంబాద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి తన అల్లుడు కట్నంగా సైకిల్ అడుగుతున్నాడని, అది ఇవ్వకపోతే కూతురు పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఉందని చెబితే వెంటనే సైకిల్ ఇచ్చి పంపించిన హృదయం కేసీఆర్‌ది. అందుకే ఆయన సూచనల మేరకు ఈసారి బడ్జెట్లో కల్యాణలక్ష్మికి రూ. 700 కోట్లు పెంచాం. ఓవర్సీస్ స్కాలర్షిప్, రుణమాఫీ, గుడుంబా నిర్మూలన, పునరావాసం, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిన ఘనత టీఆర్ఎస్దే. గృహ నిర్మాణ రుణాల మాఫీ, నీటి తీరువా రద్దు, తాటి చెట్లపై పన్ను రద్దు, చేనేత రుణాలు, ఆటో, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సెలూన్లకు డొమెస్టిక్ కేటగిరీ వర్తింపు, నివాస స్థలాల క్రమబద్ధీకరణ, సాదాబైనామాల పరిష్కారం లాంటి చాలా కార్యక్రమాలను ప్రజల కోసం చేశాం. పన్నేతర ఆదాయంపై క్లారిటీ ఉంది.. పన్నేతర ఆదాయం పెంచుకొనే విషయంలో మాకు క్లారిటీ ఉంది. వాణిజ్య పన్నుల శాఖలో అపరిష్కృత కేసుల వన్‌టైం సెటిల్మెంట్, మైనింగ్, ఇసుక కొత్త పాలసీ, కోకాపేటలో గెలిచిన భూముల అమ్మకం, పరిశ్రమలకు లీజుకిచ్చిన భూముల క్రమబద్ధీకరణ ద్వారా అదన పు ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. ఈ విషయంలో కాంగ్రెస్‌కు అనుమానాలు అక్కర్లేదు. అభివృద్ధి ప్రజలకు కనపడుతున్నందునే ప్రతి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తున్నారు. మూసీ నది పాపం, పుణ్యం కాంగ్రెస్‌దే. ఆ కంపును వదిలించేందుకు మేము కంకణం కట్టుకున్నాం. ఈ విషయంలో కాంగ్రెస్ చెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి. అవసరమైతే అప్పులు మరిన్ని తెచ్చయినా ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తాం. కాంగ్రెస్‌లాగా సంకుచిత ధోరణులు మాకు ఉండవు. ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగానే అప్పులు తెస్తున్నాం. ఈ విషయంలో ఎక్కడా పరిధి దాటట్లేదు. అప్పులతోపాటు జీఎస్డీపీ పెరిగిందని ప్రతిపక్షాలు గుర్తించాలి. కేంద్రం నిధులివ్వట్లేదు... కేంద్రం నుంచి ఆశించినంత సాయం అందట్లేదు. జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు, మిషన్ కాకతీయ, భగీరథ గ్రాంట్లు, వెనుకబడిన జిల్లాలకు సాయం, పన్నుల వాటా కలిపి రూ. 10 వేల కోట్లకుపైనే రావాల్సి ఉంది. అయినా ప్రజల కోసం ఖర్చుకు వెనుకాడం. మాది పేదల ప్రభుత్వం. పేదల సంక్షేమం కోసమే ప్రతిపైసా ఖర్చు పెడతాం. కాంగ్రెస్‌ది వద్దుల పార్టీ.. అందుకే ప్రజలు వద్దనుకున్నారు బడ్జెట్ గురించి కాంగ్రెస్ ఒక్క మంచి మాటయినా చెబుతుందని ఆశించాం. అయినా కాంగ్రెస్ సభ్యులు మాత్రం పాడిందే పాట పాచిపళ్ల బాట అన్న రీతిలోనే విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు కరెంటు వద్దంటారు.. జిల్లాలు, ప్రాజెక్టులు, మిషన్ భగీర థ వద్దని చెబుతారు. అందుకే కాంగ్రెస్ వద్దు ల పార్టీ అయింది. ప్రజలు కూడా ఆ పార్టీ వద్దని రద్దు చేశారు. వరుస ఓటములతో అ యినా ఆ పార్టీకి జ్ఞానోదయం అవుతుందని ఆశించినా, అన్ని ఎన్నికల్లో ప్రజలు గుణపా ఠం చెప్పినా వారి తీరులో మార్పులేదు. ప్రజ లు కర్రుకాల్చి వాతపెడుతున్నా ఆత్మవిమర్శ చేసుకోని కాంగ్రెస్‌ను ఆ దేవుడే కాపాడాలి.’’ చదవండి: ‘అప్పుడు కరెంట్ బందు.. ఇప్పుడు రైతు బంధు’ క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ -
‘మక్కల లొల్లి’కి... మంత్రుల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ‘మక్కల లొల్లి’కి వేదికయింది.పౌల్ట్రీ పరిశ్రమలో మక్కల (మొక్కజొన్నల)కుంభకోణం జరిగిందని బుధవారం తన ప్రసంగంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలకు గురువారం సభలో ప్రభుత్వం దీటైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. బడ్జెట్‌పై చర్చకు సమాధానంలో భాగంగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ భట్టి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.వాటికి మంత్రి ఈటల వివరంగా జవాబిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఈటల మాట్లాడుతూ భట్టి చేసిన ఆరోపణల్లో నిజం లేదని, కరోనా ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో ఉన్న సమయంలో చేయాల్సిన ఆరోపణలు కావని అన్నారు. ‘కరోనా ప్రభావంతో కుప్పకూలింది....పౌల్ట్రీ రంగానికి చెందిన ఏ రైతు ఇంటికి వెళ్లినా చనిపోయిన వారి కుటుంబాలను తలపిస్తున్నాయి. అయినా భట్టి ఇంతటి అవాస్తవాలు ఎలా చెప్పారో అర్థం కావడం లేదు.పౌల్ట్రీకి ప్రభుత్వం సబ్సిడీపై మక్కలు ఇవ్వలేదు. మొదటి ఏడాది కొనుగోలుకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పౌల్ట్రీకి ఇవ్వాలన్న తమ విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో అంగీకరించారు. అయినా ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా టన్నుకు రూ.100–200 కన్నా ఎక్కువ తగ్గించలేదు. అంతా కలిపిన అందులో ప్రభుత్వం తగ్గించుకుంది రూ.6–7 కోట్లకు మించి ఉండదు. వందల కోట్ల కుంభకోణం అని అంటున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమ అయిన పౌల్ట్రీపై ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల కాంగ్రెస్ నేతలే అభాసుపాలవుతారు. ఇచ్చిన మక్కల్లో కూడా 2లక్షల టన్నులు పౌల్ట్రీ రైతులకే ఇచ్చారు. ఆ తర్వాత మిగిలినవే పెద్ద పెద్ద బ్రీడర్ కంపెనీలకు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మక్కలు పెద్ద కంపెనీలకు మూడు నెలలకు కూడా సరిపోవు.మరి అలాంటప్పుడు అమ్ముకునేది ఎక్కడిది? ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు.’ అని అన్నారు. ఏ ఏడాదిలో పౌల్ట్రీ పరిశ్రమలకు ఎంత మక్కలు ఇచ్చారన్న వివరాలు తమకు పంపుతానని, సభ్యులకు ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. బేజాప్తా కాదు బాజాప్తా చేస్తాం : సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ చర్చలో జోక్యం చేసుకుని ఇందులో కుంభకోణం లేదు లంబకోణం లేదని వ్యాఖ్యానించారు. పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునేందుకు రెండు, మూడు వందల కోట్లు ఇవ్వాల్సి వచ్చినా తాము ఖాతరు చేయబోమని, ఖచ్చితంగా ఇస్తామని స్పష్టం చేశారు. ఇందులో దాచుకోవాల్సింది ఏమీ లేదని, పౌల్ట్రీ రంగం కూలిపోకుండా బేజాప్తా కాదు బాజాప్తా ఇస్తామని అన్నారు. ‘పరిశ్రమలు నిలబడాలంటే కొన్ని రాయితీలు ఇవ్వక తప్పదు. రాష్ట్రం ఏర్పాటయిన రెండేళ్లకే మనకు ఓ బడా పరిశ్రమరావడం ఖాయమయిపోయింది. కానీ, అప్పుడున్న మహారాష్ట్ర సీఎం చురుగ్గా వ్యవహరించి ఏకంగా రూ.3,500 కోట్ల విలువైన ప్రోత్సాహకాలిచ్చి ఆ పరిశ్రమను అక్కడకు తీసుకెళ్లారు. పారిశ్రామిక రాయితీలు ఆనవాయితీగా ఇస్తున్నారు. నాడు వైఎస్సార్, కోట్ల, జలగం వెంగళరావు ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి. పరిశ్రమను నిలబెట్టుకోవాలంటే ఇవ్వాల్సిందే.’అని వ్యాఖ్యానించారు. అనంతరం ఈటల మళ్లీ వివరణ ఇస్తున్న సందర్భంలో రాష్ట్రంలో కరోనా లేదని చెప్పాలని సీఎం సూచించారు. వాటికనుగుణంగా రాష్ట్రంలో కరోనా లేదని చెప్పిన వైద్య మంత్రి అపోహలకు పోకుండా పౌష్టికాహారమైన గుడ్లు, చికెన్ తినాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేం కాదు... మీ నేతలవే చిల్లర పనులు : భట్టి అనంతరం భట్టి మాట్లాడుతూ మక్కల విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందని తాము చెప్పడం లేదని, పౌల్ట్రీ ఫెడరేషన్‌కు ఇచ్చినవి దుర్వినియోగం అయ్యాయన్నదే తమ ఆరోపణ అని, వాటిని అమ్ముకున్నారా లేదా అన్నదానిపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తే అడిగిన దానికి చెప్పకుండా ఏవేవో చెపుతున్నారన్నారు. మంత్రి ఈటల చెప్పినట్టు తమవి చౌకబారు, చిల్లర ఆరోపణలు కావని, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు చిల్లర పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో సభలో కొంత గందరగోళం నెలకొంది. అడ్డగోలు ఆరోపణలు... రొడ్డ కొట్టుడేనా : సీఎం కేసీఆర్ పౌల్ట్రీ కుంభకోణం ఆరోపణలపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీనుద్దేశించి సీఎం కేసీఆర్ ఘాటు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతిపక్షాలు చేసే విమర్శ పట్ల విచక్షణ ఉండాలి. ప్రతిదాన్నీ అడ్డగోలుగా మాట్లాడి రొడ్డకొట్టుడు కొట్టుడేనా? మీకు ప్రజలెందుకు ఓట్లు వేస్తలేరో ఇప్పటికీ అర్థమయితలేదు. ఈవీఎంలన్నారు.. బ్యాలెట్ వచ్చినా ఏం జరిగింది. అంటే ప్రతి సందర్భంలో ప్రజలు మాకు స్పష్టంగా చెబుతున్నారు. వాళ్లెన్ని అరిచినా పట్టించుకోవద్దని, మీ దారిలో మీరు వెళ్లాలని చెపుతున్నారు. మీరు సమీక్షించుకోవాలి. మీ పద్ధతి మారాలి. మేం చెపుతున్నా మీరు సవరించుకోవడం లేదు.’అని వ్యాఖ్యానించారు. -
రేపే బడ్జెట్ : హరీష్‌రావు తొలిసారి
సాక్షి, హైదరాబాద్ : శాసనసభలో 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చజరుగుతోంది. ఇక కీలకమైన రాష్ట్ర బడ్జెట్ రేపు (ఆదివారం) సభ ముందుకు రానుంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్‌రావు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి విత్తమంత్రి హోదాలో ఆయన సభలో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. కాగా రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణలో కీలకమైన ఆర్థికశాఖను హరీష్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి హోదాలో గత ఏడాది బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలిలో రేపు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ సమర్పించనున్నారు. (సీఏఏ, ఎన్ఆర్సీలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు) -
కరోనాపై వెయ్యి కోట్లు ఖర్చు చేస్తాం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనాపై అసత్యాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కరోనా రావొద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని సీఎం అన్నారు. రాష్ర్టానికి కరోనా వైరస్ రాదు.. రానివ్వం కూడా అని సీఎం తేల్చిచెప్పారు. ఈ వైరస్ ఇక్కడ పుట్టినది కాదు, ఒక వేళ వచ్చినా.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చిందన్నారు. ఈ 31 మంది కూడా దుబాయ్, ఇటలీ లాంటి ఇతర దేశాలకు పోయి వచ్చినా వారే అని సీఎం తెలిపారు. (సీఏఏ, ఎన్ఆర్సీలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు) మన రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌లు ఎందుకు? అని కేసీఆర్ ప్రశ్నించారు. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్ బతకదు అని సీఎం సభలో చెప్పారు. మన దగ్గర 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.. అలాంటప్పుడు ఆ వైరస్ ఎలా బతుకుతుందని సీఎం ప్రశ్నించారు. మాస్క్ కట్టుకోకుండానే కరోనాపై యుద్ధం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. వైరస్ లక్షణాలు ఉన్నవారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని, ఎవరూ బయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. -
సీఏఏ, ఎన్ఆర్సీలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సభలో కీలక ప్రసంగం చేశారు. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వివాదాస్పద చట్టాలు సీఏఏ, ఎన్ఆర్సీలపై కేసీఆర్ సభలో ప్రస్తావించారు. వీటిపై పౌరులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నాయని, వీటిపై ఓ రోజంతా సభలో చర్చించి తీరుతామని సీఎం అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని, ఇక సామన్య ప్రజలకు ఏం ఉంటుందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి చట్టాలపై దేశ వ్యాప్తంగా సుధీర్ఘ చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఈ చట్టాలపై తమ అభిప్రాయాలను వెల్లడించాలని సీఎం కోరారు. కాంగ్రెస్ సభ్యల సస్పెండ్.. ఇక చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం చెబుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరవడం సరికాదు అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగించే చర్యలను సహించమని కేసీఆర్ తేల్చిచెప్పారు. సభలో ఎవరు అరాచకం చేస్తున్నారో స్పష్టంగా కనబడుతుందని సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీకి ఒక పద్ధతి ఉంటుందని.. దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని హితవు పలికారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరిచి, అరాచకం సృష్టిస్తే కుదరదు అని విపక్ష సభ్యులను కేసీఆర్ హెచ్చరించారు. ఏదో ఒక విధంగా బయటకు వెళ్లాలనేది కాంగ్రెస్ సభ్యుల గొడవ.. అందుకే అరుస్తున్నారని సీఎం పేర్కొన్నారు. సభకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు. దీంతో ఆరుగురు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. దీనిపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షాన్ని లేకుండా చూడాలని సీఎం ప్రయత్నిస్తున్నాంటూ సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. ఎన్నిక ఏదైనా.. విజయం మాదే కాంగ్రెస్ సభ్యుల అసత్య ఆరోపణలను ఆపడానికే వారిని సభ నుంచి సస్పెండ్ చేశామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నీరుకార్చే ప్రయత్నం చేసిందని, ఉద్యమకారులపై కేసుల పెట్టిన చరిత్ర ఆ పార్టీ అని నిప్పులు చెరిగారు. అన్ని పార్టీలను ఏకంచేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా.. ప్రజలంతా టీఆర్ఎస్ పక్షాణే నిలుస్తున్నారని అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోతుందో ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సీఎం హితవుపలికారు. -
6 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ 2020 వార్షిక బడ్జెట్ సమావేశాలను మార్చి 6 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన తీరుపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పట్టణ ప్రగతి ముగిసిన వెంటనే ఒక రోజు విరామం ఇచ్చి ఆరో తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలా షెడ్యూలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మార్చి 6న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చర్చ జరిగే అవకాశం ఉంది. మార్చి 8 ఆదివారం, మరుసటి రోజు హోళీ పండుగ కావడంతో పదో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. 12 పని దినాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేస్తున్నారు. మార్చి 22లోపు బడ్జెట్ సమావేశాలు ముగిసే అవకాశమున్నట్లు సమాచారం. శాసనమండలి సమావేశాలను మాత్రం కేవలం 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019 సెప్టెంబర్ 9 నుంచి 22 వరకు జరిగిన పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ 11 రోజులు సమావేశం కాగా, శాసనమండలిలో మాత్రం కేవలం 4 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి. -
సీఏఏ చరిత్రాత్మకం
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్ముని ఆశయ సాధనకు కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) చారిత్రకమైందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. నిరసనల పేరుతో కొందరు హింసకు పాల్పడటం దేశాన్ని, సమాజాన్ని బలహీనపరుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి అధికార పక్షం నేతలు బల్లలు చరుస్తూ మద్దతు ప్రకటించగా ప్రతిపక్షం నిరసన ప్రకటించింది. సుమారు 70 నిమిషాల పాటు జరిగిన రాష్ట్రపతి కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే... బడ్జెట్ సమావేశం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను పార్లమెంటుకు తీసుకువస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నెరవేరిన గాంధీజీ ఆశయం.. సీఏఏకు వ్యతిరేకంగా దేశంలో నిరసనల పేరుతో హింస చెలరేగడం సరికాదు. సర్వమత సమానత్వం భారత్ చిరకాలంగా నమ్ముతున్న సూత్రం. దేశ విభజన సమయంలో ఈ నమ్మకంపై తీవ్రమైన దాడి జరిగింది. పాకిస్తాన్లో నివసించేందుకు ఇష్టపడని హిందువులు, సిక్కులు భారత్‌కు తిరిగి రావచ్చు. అలా వచ్చిన వారు ఇక్కడ సాధారణ జీవితం గడిపేలా చేయడం ప్రభుత్వ బాధ్యతని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు. ఆయన ఆకాంక్షలను గౌరవించడం అందరి బాధ్యత. ఉభయసభలు ఆ బాధ్యతను నెరవేర్చడం సంతోషకరమైన విషయం. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా సీఏఏ అమల్లోకి రావడం సంతోషకరం. పాకిస్తాన్లో జరుగుతున్న నాన్కానా సాహెబ్ గురుద్వారాపై దాడి వంటి ఘటనలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతర్జాతీయ సమాజం కూడా ఇలాంటి ఘటనలను ఖండించడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలి. దేశీయ ఉత్పత్తులనే కొనండి... దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు రికార్డు స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రామజన్మభూమి అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉంచిన నమ్మకాన్ని బలపరిచేదిగా ఉంది. ఈ తీర్పుపై దేశ ప్రజలు స్పందించిన తీరు ప్రశంసార్హమైంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానమైన హక్కులు సాధించుకోవడం ద్వారా జమ్మూ కశ్మీర్, లడాఖ్ ప్రజలూ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఓ చారిత్రక ఘట్టం. జాతి ప్రయోజనాల కోసం ప్రతి వ్యక్తి తన బాధ్యతలు గుర్తెరిగి నడుచుకునేలా చేయాలి. అందరం కలిసికట్టుగా ఈ దశాబ్దాన్ని తమ బాధ్యతలను నెరవేర్చేందుకు అంకితం చేద్దాం. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం త్రివిధ దళాల మధ్య సమన్వయం సాధించేందుకు దోహదపడుతుంది. ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. మహిళల భద్రత కోసం 1,000 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మహిళలకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు ఇవి దోహదపడతాయి. సభలో తొలిరోజు.. ► సమావేశానికి ముందుగా రాష్ట్రపతి కోవింద్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు తోడ్కొని వచ్చారు. ► మొదటి వరుసలో ప్రధాని మోదీతోపాటు మంత్రులు థావర్ చంద్ గహ్లోత్, ఎస్.జైశంకర్, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, తదితరులతోపాటు ప్రతిపక్షం నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రమే ఆసీనులయ్యారు. ► కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొదటి వరసకు బదులుగా శశి థరూర్, మనీష్ తివారీ తదితరులతో కలిసి ఐదో వరుసలో కూర్చున్నారు. ► రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు తెలుపుతున్న నిరసనలను టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రియాన్ తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ కనిపించారు. ► బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)కి చెందిన అతుల్ రాయ్ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాయ్.. రేప్ కేసులో అరెస్టై జైలులో ఉన్నారు. కోర్టు పెరోల్ ఇవ్వడంతో ప్రమాణం చేశారు. -
నేటితో బడ్జెట్ సమావేశాల ముగింపు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆదివారం శాసనసభ, శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం వాయిదా పడనున్నాయి. ఈ నెల 9న 2019–20 వార్షిక బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తర్వాత.. 14వ తేదీకి వాయిదా పడింది. 14న తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ వివిధ శాఖల పద్దులపై ఎనిమిది రోజులుగా చర్చించి ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాల చివరి రోజున శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన అనంతరం సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తారు. శాసనమండలి కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నెల 9న ప్రారంభం కాగా, ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు బడ్జెట్‌ను సమర్పించారు. ఆదివారం పలు బిల్లులను ఆమోదించాక నిరవధికంగా వాయిదా పడనుంది. సభా కమిటీలపై ప్రకటన.. శాసనసభ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా శాసనసభ కమిటీలను ప్రకటించనున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, అండర్ టేకింగ్స్ కమిటీ వంటి ఆర్థిక కమిటీలతో పాటు అసెంబ్లీలో మొత్తం 21 కమిటీ లు ఉంటాయి. కీలకమైన ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవిని శాసనసభలో రెండో అతిపెద్ద పక్షంగా ఉన్న ఎంఐఎం ఆశిస్తోంది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంచనాల కమిటీ చైర్మన్‌గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి మరోమారు అవకాశం దక్కనుంది. మంత్రులుగా, విప్‌లుగా అవకాశం దక్కని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చైర్మన్లుగా, కమిటీ సభ్యులుగా అవకాశం దక్కనుంది.