సాక్షి, అమరావతి : మలి సందెలో ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు నేనున్నా అంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. సీఎంగా వైఎస్ జగన్ అధికారాన్ని స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలోని అవ్వా తాతలకు అండగా నిలిచారు. వారికిచ్చే వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని పెంచారు. ఇళ్ల వద్దే పింఛన్లు అందజేస్తున్నారు. ఇప్పుడు వారికి మరింత భరోసా కల్పిస్తూ ఈసారి బడ్జెట్‌లో పింఛన్లకు మరింత ఎక్కువ కేటాయింపులు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్ద పెద్ద శాఖల వార్షిక బడ్జెట్ మొత్తం స్థాయికి పింఛన్ల బడ్జెట్ పెరిగిపోయింది. గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోకంటే సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ పథకానికి పెట్టే ఖర్చు మూడు రెట్లు పెంచారు. ఇప్పుడు మరింత పెరిగి ఈసారి కేటాయింపులు రూ.18,000.90 కోట్లకు ఎగబాకాయి. ఈ ఏడాది జనవరి నుంచి పింఛన్‌ను నెలకు రూ.2,500కు పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి నెలా 61.74 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు.
థలసేమియా, సికెల్ సెల్, తీవ్రస్థాయి హీమోఫీలియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారితో పాటు కిడ్నీ దెబ్బతిన్న వారికి కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ప్రతినెలా గరిష్టంగా రూ. 10 వేల చొప్పున పింఛను అందుతోంది. మరో వైఫు వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. దీనివల్ల కొత్తగా 10,60,208 మంది పింఛను పొందుతున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment