సాక్షి, న్యూఢిల్లీ : జనవరి 29 నుంచి(శుక్రవారం) పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 ప్రతిపక్ష పార్టీలు గురువారమే ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం పార్లమెంటు సచివాలయం మూడు చోట్ల ఎంపీలకు సీటింగ్ ఏర్పాటు చేసింది. చదవండి: 16 పార్టీల ప్రకటన.. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ
33 పనిదినాలపాటు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనుండగా.. ప్రతి రోజు నాలుగు గంటల చొప్పున లోక్‌సభ, రాజ్యసభ సమావేశం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలలో యథావిధిగా జీరో అవర్, ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్రం ఎకనామిక్ సర్వే టేబుల్ చేయనుంది. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు రైతు ఉద్యమం, కరోనా, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, చైనా దూకుడు తదితర అంశాలను ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment