► కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్త అర్థం చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అంటే నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ అన్నారు. మోదీ సర్కార్ వద్ద ఏ డేటా ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో గంగానదిలో తేలిన మృతదేహాలపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు .
► ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోలు ఉండేవి కావని ప్రధాని మోదీ అన్నారు. పేదలు కనీస అవసరాల కోసం ఇన్నాళ్లు ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేది కాదని తెలిపారు. మహాత్మా గాంధీనే కాంగ్రెస్‌ను వద్దనుకున్నారని మోదీ చెప్పారు.
► రాజ్యసభలో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కరోనాతో దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొందని తెలిపారు. కరోనాతో ఎన్నో జీవితాలు అతలాకుతలం అయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశం ఏనాడో బాగుపడేదని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
► రాజ్యసభ జీరో అవర్‌లో రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లు అవుతున్న కేంద్ర ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చడం లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమి, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
► రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరారు. పేపర్ లీక్, కోర్టు కేసులతో ఒక పరీక్ష మూడేళ్లపాటు నడుస్తోందని, దీని వల్ల విద్యార్థులు ఎంతో మంది నష్టపోతున్నారని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడోరోజు ఉభయ సభలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
చదవండి: లతకు పార్లమెంటు నివాళి
Comments
Please login to add a commentAdd a comment