Parliament Sesson
-
Union Budget 2022: ద్రవ్య స్థిరత్వానికి బడ్జెట్లో ప్రాధాన్యత!
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న 2023–24 వార్షిక బడ్జెట్ ద్రవ్య స్థిరత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 2022–23లో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) రూ.16.61 లక్షల కోట్లు ఉండాలని 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనాలకు అనుగుణంగా 6.4 శాతంలోపునకే (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక రానున్న (2023–24) ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా వంటి సంస్థలు అంచనావేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దన్నుతో భారత్ పన్ను వసూళ్లు 2023 మార్చితో ముగిసే 2022–23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకన్నా రూ.4 లక్షల కోట్ల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని స్వయంగా ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. 2022–23లో రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు కట్టడికి (జీడీపీలో 6.4 శాతం వద్ద) దోహదపడే అంశం ఇది. వ్యయ ప్రతిపాదనలకు సూచన పార్లమెంట్ (రెండు భాగాల) బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి ఆర్థికశాఖ 2022–23కు సంబంధించి తుది వ్యయ ప్రతిపాదనలను కోరింది. గ్రాంట్లకుగాను రెండవ, తుది సప్లిమెంటరీ డిమాండ్ల ప్రతిపాదనలను ఆర్థికశాఖ కోరినట్లు ఒక అధికారిక మెమోరాండం పేర్కొంది. గ్రాంట్ల కోసం తుది సప్లిమెంటరీ డిమాండ్లను సమావేశాల్లోని రెండవ విడతలో సమర్పించే అవకాశం ఉందని సమాచారం. గత నెలలో, ప్రభుత్వం రూ. 3.25 లక్షల కోట్లకు పైగా నికర అదనపు వ్యయాన్ని అనుమతించే గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్ల మొదటి బ్యాచ్‌ను ఆమోదించింది. ఇందులో ఎరువుల సబ్సిడీ చెల్లింపునకు ఉద్దేశించిన రూ. 1.09 లక్షల కోట్లు కూడా ఉన్నాయి. ఈ అదనపు వ్యయం 2022–23 బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం కంటే అధికం. 2021–22లో బడ్జెట్ వ్యయం రూ.37.70 లక్షల కోట్లు. 2022–23లో బడ్జెట్ ప్రతిపానల్లో దీనిని రూ.37.70 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. నియంత్రణలు సడలించాలి... ఫార్మా, హెల్త్‌కేర్ పరిశ్రమ విజ్ఞప్తి ∙ ప్రోత్సాహకాల కోసం వినతి రాబోయే కేంద్ర బడ్జెట్లో ఫార్మా, హెల్త్‌కేర్ రంగానికి సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేయాలని సంబంధిత వర్గాలు విజ్ఞప్తి చేశాయి. పలు ప్రోత్సాహకాలతో పాటు, ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు, పరిశోధనా అభివృద్దిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దేశీయ ఫార్మా పరిశ్రమ ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని, 2030 నాటికి 130 బిలియన్ డాలర్లు, 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు ఎదగాలన్నది పరిశ్రమ ఆంకాంక్షని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. ఈ దిశలో బడ్జెట్లో చర్యలు ఉంటాయని భావిస్తున్నామని అన్నారు. ఔషధ పరిశ్రమ అభివృద్ధికి సహాయపడే సహాయక విధానాలు, సరళీకృత నిబంధనలు, జీఎస్టీ నిబంధనల సరళీకరణ ప్రతిపాదనలు బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా, సిప్లా, లుపిన్, గ్లెన్‌మార్క్‌లతో సహా 24 ప్రముఖ దేశీయ ఫార్మా కంపెనీల కూటమే ఐపీఏ. ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) డైరెక్టర్ జనరల్ వివేక్ సెహగల్ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి బాటలో ’ఆత్మనిర్భర్ భారత్’ విజన్‌కు లైఫ్ సైన్సెస్ రంగం వాస్తవికంగా దోహదపడేలా ప్రభుత్వం విధానాలు అవసరమని అన్నారు. ప్రొడక్షన్ ఆధారిత ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం మాదిరిగానే, పరిశోధన ఆధారిత ఇన్సెంటివ్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. హెల్త్‌కేర్ రంగం విషయానికొస్తే, ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని పరిశ్రమల సంఘం నాథేల్త్ ప్రెసిడెంట్ శ్రవణ్ సుబ్రమణ్యం అన్నారు. ఈ దిశలో మౌలిక సదుపాయాల సామర్థ్యాలను పెంపొందించడం అత్యవసరమని పేర్కొన్నారు. అల్యూమినియంపై దిగుమతి సుంకాలు పెంచాలి అల్యూమినియం, అల్యూమినియం ఉత్పత్తులపై రాబోయే బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని కనీసం 12.5 శాతానికి పెంచాలని ఇండస్ట్రీ సంస్థ– ఫిక్కీ కోరింది. ఈ చర్య అల్యూమినియం ఉత్పత్తుల డంపింగ్‌ను అరికట్టడానికి అలాగే దేశీయ తయారీ– రీసైక్లింగ్ వృద్ధిని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం అల్యూమినియం, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో అల్యూమినియం దిగుమతులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దిగువ స్థాయి అల్యూమినియం దిగుమతుల్లో 85 శాతానికి పైగా చైనా వాటా ఉంటోందని ఒక ప్రకటనలో తెలిపింది. -
Budget Session: ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్త అర్థం చెప్పిన చిదంబరం
► కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్త అర్థం చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అంటే నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ అన్నారు. మోదీ సర్కార్ వద్ద ఏ డేటా ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో గంగానదిలో తేలిన మృతదేహాలపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు . ► ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోలు ఉండేవి కావని ప్రధాని మోదీ అన్నారు. పేదలు కనీస అవసరాల కోసం ఇన్నాళ్లు ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేది కాదని తెలిపారు. మహాత్మా గాంధీనే కాంగ్రెస్‌ను వద్దనుకున్నారని మోదీ చెప్పారు. ► రాజ్యసభలో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కరోనాతో దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొందని తెలిపారు. కరోనాతో ఎన్నో జీవితాలు అతలాకుతలం అయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశం ఏనాడో బాగుపడేదని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ► రాజ్యసభ జీరో అవర్‌లో రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లు అవుతున్న కేంద్ర ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చడం లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమి, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ► రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరారు. పేపర్ లీక్, కోర్టు కేసులతో ఒక పరీక్ష మూడేళ్లపాటు నడుస్తోందని, దీని వల్ల విద్యార్థులు ఎంతో మంది నష్టపోతున్నారని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడోరోజు ఉభయ సభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. చదవండి: లతకు పార్లమెంటు నివాళి -
టీఆర్ఎస్ తీరుతోనే రైతులు ఆత్మహత్యలు: ఎంపీ అరవింద్
LIVE UPDATES 07:01PM ► లోక్‌సభ రేపటికి ( మంగళవారం) వాయిదా ►దొంగే దొంగ అని అరిచినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ధాన్యం సేకరణ ఒప్పందాన్ని కేసీఆర్ తుంగలోతొక్కారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ►ఇటీవల ఏపీలో సంభవించిన వరదల వల్ల 1.85 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాణి భరత్ అన్నారు. లోక్‌సభలో వరదనష్టంపై మాట్లాడిన ఆయన.. కేంద్ర బృందం అంచనాల ప్రకారం దాదాపు 6 వేల కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. వరదల సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ►కిసాన్ రైళ్ల వ్యవస్థ రైతాంగానికి ఎంతో మేలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ అన్నారు. లోక్‌సభలో ప్రజా ప్రాముఖ్యత విషయాల చర్చ సందర్భంగా రైతు సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. కిసాన్ రైలు రవాణా వినియోగించుకుంటున్న రైతులకు ఇస్తున్న సబ్సిడీని ఏడాదికి 150 కోట్ల రూపాయలకు పెంచాలని కోరారు. ► లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తిప్పికొట్టారు. బ్యాంకులను మోసం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రఘురామకృష్ణంరాజుపై రెండు సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ థర్మల్ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ►లోక్‌సభలో నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అమెండ్మెంట్ బిల్లును కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై లోక్‌సభ సభ్యులు చర్చించారు. కొవిడ్ ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సింగారి అన్నారు. 04:38PM ► రాజ్యసభ రేపటికి వాయిదా 03:40 PM ► లోక్‌సభలో నాగాలాండ్ ఘటనపై అమిత్ షా మాట్లాడుతూ.. ఉగ్రవాదులనే అనుమానంతో కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామి ఇచ్చారు. ప్రస్తుతం నాగాలాండ్‌లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. 03:20 PM ► నాగాలాండ్ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో వివరణ ఇచ్చారు. 02:30 PM ► పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా 02:00 PM ► నాగాలాండ్ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్యాహ్నం 3 గంటలకు కీలక ప్రకటన చేయనున్నారు. 01: 16 PM ► సాయుధ దళాల చట్టం దుర్వినియోగమవుతుందని మజ్లీస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17 మంది అమాయకులను చంపిన జవాన్లను కఠినంగా శిక్షించాలన్నారు. వివాదాస్పద చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 01: 10 PM ► నాగాలాండ్ కాల్పుల ఘటనలో మృతి చెందిన వారికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం నష్టపరిహరం చెల్లించాలని కోరారు. నాగాలాండ్‌లో శాంతిని పునరుద్ధరించాలని కోరారు. ఈ ఘటన వల్ల సైన్యం నైతికత దెబ్బతినకూడదని.. అదేవిధంగా పౌరులకు న్యాయం జరగాలని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. 12: 35 PM ► పార్లమెంట్‌కు నాగాలాండ్ కాల్పుల సేగ తగిలింది. ఈ ఘటనపై వెంటనే ప్రకటన చేయాలంటూ విపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభలో, సాయంత్రం 4 గంటలకు రాజ్యసభలో హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ.. పలువురు కీలక ఎంపీలతో సమావేశమయ్యారు. దీనిలో నాగాలాండ్ ఘటనతో పాటు సభలో అమలు చేయాల్సిన వ్యూహలపై చర్చించినట్లు తెలుస్తోంది. 12: 05 PM ► వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభమయ్యింది. 11: 25 AM ► విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. 11: 20 AM ► పార్లమెంట్ శీతాకాల సమావేశంలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి లోక్‌సభలో అటెన్షన్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులో.. పోలవరం సవరించిన అంచనా వ్యయం 55,657 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆలస్యం వలన పునరావాసం పనులకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ ఏడాది ఖర్చు చేసిన 1,920 కోట్ల రూపాయలను వెంటనే రియంబర్స్ చేయాలన్నారు. కాగా, వచ్చే ఏడాది కల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు సహకరించాలన్నారు. 11: 15 AM ► నాగాలాండ్ కాల్పుల ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ క్రమంలో స్పీకర్ ఓంబిర్లా.. దీనిపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని తెలిపారు. అదే విధంగా.. టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యసేకరణ అంశంపై తీవ్ర ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో పోడియం చేరి చుట్టు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం తీసుకురావాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రబీ ధాన్యం సేకరణ సమస్యను పరిష్కరించాలన్నారు. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఆరో రోజు సభ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం పార్లమెంట్లో నాగాలాండ్ ఘటనపై విపక్షాలు తీవ్ర ఆందోళనలు చేపట్టాయి. కాల్పుల ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. కాల్పుల్లో 17 మంది అమాయక ప్రజలు చనిపోవడాన్ని ప్రతి పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
ఈ ఘనత నాది కాదు: మోదీ
న్యూఢిల్లీ: దేశాభివృద్ధిలో రాష్టాలూ కీలకభూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీ నుంచే అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రాలు తమవంతు పాత్ర పోషించాలని అన్నారు. నిధులను రాష్ట్రాలు ఎక్కడ ఖర్చు చేయాలో ఇప్పటివరకు ఢిల్లీలోనే నిర్ణయించేవారని, తాము ఈ పరిస్థితిని మార్చామని చెప్పారు. శుక్రవారం హిందూస్థాన్ టైమ్స లీడర్ షిమ్ సమిట్ లో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పుడు మనదేశం అభివృద్ధి ఆగలేదని తెలిపారు. సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమన్నారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని అన్నారు. దేశంలో ఇప్పటికి 18 వేల గ్రామాలకు కరెంట్ లేదని తెలిపారు. గత ప్రభుత్వాలు పనిచేయలేదని తాను చెప్పడం లేదని, 1000 రోజుల్లో గ్రామాలన్నింటికీ కరెంట్ అందిస్తామని హామీయిచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు సజావుగా నడుస్తున్నాయని.. ఈ ఘనత తానొక్కడితే కాదని అన్ని పార్టీలకు చెందుతుందని నరేంద్ర మోదీ అన్నారు.