Budget session of Parliament
-
Union Budget 2023-24: హెల్మెట్లపై జీఎస్టీని తొలగించాలి
పార్లమెంట్ (రెండు భాగాల) బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్లో హెల్మెట్లపై విధించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీని) తొలగించాలని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బడ్జెట్లో నిర్ణయం ఉండాలని కోరుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖ రాసినట్లు ఐఆర్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. సురక్షితమైన రహదారుల కోసం ఐఆర్ఎఫ్ కృషి చేస్తోంది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే రోడ్డు ప్రమాద మరణాలలో భారత్ 11 శాతం వాటా కలిగి ఉందని ఐఆర్ఎఫ్ ఎమెరిటస్ ప్రెసిడెంట్ కేకే కపిల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుల విషయంలో ఇది దాదాపు 31.4 శాతంగా ఉందన్నారు. -
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రెండు విడతల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 6న ముగియనున్నాయని తెలిపారు. తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరగనున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుందన్నారు. రెండో విడతలో మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. 66 రోజుల వ్యవధిలో మొత్తం 27 రోజల పని దినాల్లో ఈ సమావేశాలు కొనసాగున్నట్లు తెలిపారు. ఈ అమృత కాలంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని పేర్కొంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా ఈ సమావేశాల్లో తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు. చదవండి: ఢిల్లీ సర్కార్ వర్సెస్ కేంద్రం.. నియంత్రణ కేంద్రానిదే అయితే రాష్ట్ర సర్కార్ దేనికి? Budget Session, 2023 of Parliament will commence from 31 January and continue till 6 April with 27 sittings spread over 66 days with usual recess. Amid Amrit Kaal looking forward to discussions on Motion of Thanks on the President’s Address, Union Budget & other items. pic.twitter.com/IEFjW2EUv0 — Pralhad Joshi (@JoshiPralhad) January 13, 2023 -
పొగరాయుళ్లకు కేంద్రం షాక్! ఇక సిగరెట్లు అలా లభించడం కష్టమే?
పొగరాయుళ్లకు కేంద్రం షాకివ్వనుంది. రానున్న రోజుల్లో విడిగా సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేలా సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వదులుగా ఉన్న సిగరెట్ల అమ్మకాలు పొగాకు నియంత్రణపై చేస్తున్న ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కమిటీ సభ్యులు వాదించారు. దీంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో స్మోకింగ్ జోన్లను తొలగించాలని కమిటీ సిఫార్స్ చేసింది. స్టాండింగ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తే, పార్లమెంట్ త్వరలో సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని నిషేధించవచ్చు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇ-సిగరెట్ల అమ్మకం, వాడకాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. జీఎస్టీ అమలు తర్వాత కూడా పొగాకు ఉత్పత్తులపై పన్నులో పెద్దగా పెరుగుదల లేదని స్టాండింగ్ కమిటీ గుర్తించింది. మద్యం, పొగాకు ఉత్పత్తుల వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని కమిటీ హైలైట్ చేసింది.తాజా పన్ను శ్లాబుల ప్రకారం..బీడీలపై 22 శాతం, సిగరెట్లపై 53 శాతం, పొగలేని పొగాకుపై 64 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. మరోవైపు, పొగాకు ఉత్పత్తులపై 75శాతం జీఎస్టీ విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఏడాదికి 3.5లక్షల మందికి మరణం పలు నివేదికల ప్రకారం, మన దేశంలో స్మోకింగ్ కారణంగా ఏడాదికి 3.5 లక్షల మంది మరణిస్తున్నట్లు తేలింది. 2018 లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ధూమపానం చేసే వారిలో 46 శాతం మంది నిరక్షరాస్యులు, 16 శాతం మంది కాలేజీ విద్యార్ధులు ఉన్నారు. ఫౌండేషన్ ఫర్ స్మోక్ ఫ్రీ వరల్డ్ నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 6.6 కోట్ల మంది సిగరెట్లు తాగుతుండగా, 26 కోట్లకు పైగా ఇతర పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. పొగాకు వాడకం వల్ల భారతదేశంలో సుమారు 21శాతం మందికి క్యాన్సర్ సోకుతున్నట్లు ఓ అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. -
Budget Session: ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్త అర్థం చెప్పిన చిదంబరం
► కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్త అర్థం చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అంటే నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ అన్నారు. మోదీ సర్కార్ వద్ద ఏ డేటా ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో గంగానదిలో తేలిన మృతదేహాలపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు . ► ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోలు ఉండేవి కావని ప్రధాని మోదీ అన్నారు. పేదలు కనీస అవసరాల కోసం ఇన్నాళ్లు ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేది కాదని తెలిపారు. మహాత్మా గాంధీనే కాంగ్రెస్‌ను వద్దనుకున్నారని మోదీ చెప్పారు. ► రాజ్యసభలో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కరోనాతో దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొందని తెలిపారు. కరోనాతో ఎన్నో జీవితాలు అతలాకుతలం అయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశం ఏనాడో బాగుపడేదని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ► రాజ్యసభ జీరో అవర్‌లో రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లు అవుతున్న కేంద్ర ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చడం లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమి, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ► రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరారు. పేపర్ లీక్, కోర్టు కేసులతో ఒక పరీక్ష మూడేళ్లపాటు నడుస్తోందని, దీని వల్ల విద్యార్థులు ఎంతో మంది నష్టపోతున్నారని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడోరోజు ఉభయ సభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. చదవండి: లతకు పార్లమెంటు నివాళి -
లతా మంగేష్కర్‌కు నివాళి అర్పించిన ప్రధాని మోదీ
► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్‌కు ప్రధాని నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత్ లీడర్‌గా ఎదుగుతోందన్నారు. అయితే మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ సభాపక్షనేత అధిర్ రంజన్ అడ్డుకున్నారు. దీంతో కొందరు ఇంకా 2014లోనే ఉన్నారని అధిర్ రంజన్‌ను ఉద్దేశించి మోదీ పంచ్ వేశారు. 1972లో చివరిసారి బెంగాల్లో కాంగ్రెస్ గెలిచిందంటూ అధిర్‌కు కౌంటర్ వేశారు. ► తెలంగాణ ఇచ్చినా కూడా అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వలేదని మోదీ చురకలంటించారు. ఎన్ని ఓటములు ఎదురైనా కాంగ్రెస్ తీరు మారడం లేదని విమర్శించారు. గత రెండేళ్లుగా భారత్ కోవిడ్‌తో పోరాడుతోందని, కోవిడ్‌ను కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ► వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్లో కళ్లు తిరిగిపడిపోయారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. ►కేంద్రం కేటాయించిన జడ్ కేటగిరి భద్రతను స్వీకరించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకిహోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఒవైసీ కాన్యాయ్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రాజ్యసభలో దీనిపై ప్రకటన చేసిన షా.. ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని, ఆల్టో కారు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ► రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ విషప్రచారాన్ని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి బలంగా తిప్పికొట్టారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అవాస్తవాలను వల్లేవేశారు .సినిమా టికెట్లు సహా పలు అంశాలపై తప్పుడు ప్రచారం చేయడానికి కనకమేడల ప్రయత్నించారు. దీనిపై స్పందించిన వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ పాలన కంటే వైఎస్సార్సీపీ పాలన వెయ్యిరెట్లు గొప్పగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ► గాయిని లతా మంగేష్కర్‌కు మృతిపట్ల నివాళిగా ఉభయ సభలను గంటపాటు వాయిదా వేశారు. లోక్‌సభ బడ్జెట్‌పై చర్చలో భాగంగా.. గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి అర్జున్ ముండా త్రిపురలోని షెడ్యూల్డ్ తెగల జాబితాను సవరించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో భారత రత్న, దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో లతా మంగేష్కర్ సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. -
జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు మలి విడత సమావేశాలు జరుగుతాయి. పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫారసుల మేరకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్టు పార్లమెంటు వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన జనవరి 31న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అదే రోజు ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 11న తొలి విడత సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత నెల రోజుల పాటు విరామం ఉంటుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు, పోలింగ్ ఉండడంతో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10 వెలువడతాయి. ఫలితాలు వచ్చాక అంటే మార్చి 14 నుంచి రెండో విడత సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 8తో పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడం, ఇటీవల 400 మంది పార్లమెంటు సిబ్బంది కరోనా బారిన పడడంతో పార్లమెంటు నిర్వహణకు పూర్తిస్థాయిలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంపీలు, పార్లమెంటులోకి రావాలనుకునే ఇతరులు రెండు టీకా డోసులు తీసుకున్నట్లు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్తో పాటు ఆర్టీ–పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ సమర్పించాలి. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు షిఫ్ట్‌లలో నిర్వహించే అవకాశాలున్నాయి. బడ్జెట్ రోజు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. -
బడ్జెట్ సమావేశాల్లో 38 బిల్లులు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 38 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో కేంద్ర బడ్జెట్ సహా ఐదు ఫైనాన్స్ బిల్లులు ఉన్నాయి. నాలుగు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రతిపాదించనుంది. అలాగే 3 చట్టాల ఉపసంహరణకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి. శాసన సంబంధిత బిల్లులు 1. నేషనల్ క్యాపిటల్ రీజియన్, సమీప ప్రాంతాల వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ బిల్లు–2021 (ఆర్డినెన్స్ స్థానంలో.) 2. మధ్యవర్తిత్వం, సయోధ్య (సవరణ) బిల్లు, 2021 (ఆర్డినెన్స్ స్థానంలో) 3. జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లు, 2021 (ఆర్డినెన్స్ స్థానంలో) 4. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2021 ( ఆర్డినెన్స్ స్థానంలో) 5. డీఎన్ఏ టెక్నాలజీ (యూజ్ అండ్ అప్లికేషన్) రెగ్యులేషన్ బిల్లు, 2019. 6. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం (సవరణ) బిల్లు, 2019 7. ది ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు, 2020 8. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ బిల్లు, 2019 9. సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 2019 10. లోక్‌సభ ఆమోదించిన ఆనకట్ట భద్రతా బిల్లు, 2019. 11. లోక్‌సభ ఆమోదించిన మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు, 2020 12. పురుగుమందుల యాజమాన్య బిల్లు, 2020 13. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ బిల్లు, 2020 14. లోక్‌సభ ఆమోదించిన 2020 మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లు. 15. గనుల (సవరణ) బిల్లు, 2011 (ఉపసంహరణ కోసం) 16. అంతర్రాష్ట్ర వలస కార్మికుల (ఉపాధి నియంత్రణ, సేవా నిబంధనలు) సవరణ బిల్లు, 2011 (ఉపసంహరణ కోసం) 17. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంబంధిత చట్టాలు (సవరణ) బిల్లు, 2013 (ఉపసంహరణ కోసం) 18. ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజెస్∙(ఖాళీల తప్పనిసరి నోటిఫికేషన్) సవరణ బిల్లు, 2013 (ఉపసంహరణ కోసం) 19. మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, 2021 20. నేషనల్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లు, 2021 21. చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు (సవరణ) బిల్లు, 2021 22. కాంపిటిషన్ (సవరణ) బిల్లు, 2021 23. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, 2021 24. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) బిల్లు, 2021 25. క్రిప్టోకరెన్సీ, డిజిటల్ కరెన్సీ రెగ్యులేషన్ బిల్లు 2021 26. జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీ బిల్లు, 2021 27. మెట్రో రైలు (నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ) బిల్లు, 2021 28. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, 2021 29. విద్యుత్ (సవరణ) బిల్లు, 2021 30. మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్లు, 2021 31. ఇన్లాండ్ వెసల్స్ బిల్లు, 2021 32. మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం, పునరావాస సవరణ బిల్లు, 2021 33. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) సవరణ బిల్లు, 2021 ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన బిల్లులు 1. ఆర్థిక బిల్లు, 2021 2. 2020–21 నిధుల కోసం అనుబంధ డిమాండ్లపై అప్రొప్రియేషన్ బిల్లు 3. 2021–22 నిధుల డిమాండ్లపై చర్చ, ఓటింగ్, సంబంధిత అప్రొప్రియేషన్ బిల్లు 4. 2020–21 ఆర్థిక సంవత్సరానికి జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల నిధుల కోసం అప్రొప్రియేషన్ బిల్లు 5. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల నిధుల కోసం అప్రొప్రియేషన్ బిల్లు -
10కోట్ల మంది రైతులకు లబ్ధి
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలతో దేశవ్యాప్తంగా రైతులకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాలను ఆయన గట్టిగా సమర్థించారు. వీటి అమలుతో 10 కోట్ల మంది సన్నకారు రైతులు తక్షణమే ప్రయోజనం పొందుతారని తెలి పారు. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రా జధాని ఢిల్లీలో హింస చోటుచేసుకోవడం, రై తుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా మువ్వన్నెల జాతీయ జెండాకు అవమానం జరగడం చా లా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏ సీ) వద్ద శాంతికి పొరుగు దేశం విఘాతం కలి గిస్తోందంటూ పరోక్షంగా చైనాపై మండిపడ్డా రు. కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ► సరిహద్దులో యథాతథ స్థితిని మార్చడానికి కొన్ని దేశాలు చేస్తున్న కుట్రలను మన సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ►పేదలు, సన్నకారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల పురోగతికి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ► కొత్త సాగు చట్టాలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. గతంలో వివిధ పార్టీలు ఈ చట్టాలకు మద్దతునిచ్చాయి. ► రాజ్యాంగం మనకు భావప్రకటనా స్వేచ్ఛను ఇచ్చింది. అదే సమయంలో చట్టాలను గౌరవించాలని, రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించాలని రాజ్యాంగం బోధించిందన్న సంగతి మరచిపోవద్దు. ► మూడు కొత్త సాగు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం కచ్చితంగా గౌరవిస్తుంది. కోర్టు ఆదేశాలతో ఈ చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ► సన్న, చిన్నకారు రైతుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారి పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.13 లక్షల కోట్లను బదిలీ చేసింది. ► కరోనా వ్యాప్తి సమయంలో ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు 8 నెలలపాటు ఉచి తంగా నిత్యావసరాలను సరఫరా చేసింది. ► కరోనా కల్లోల సమయంలోనూ భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. బహిష్కరించిన ప్రతిపక్షాలు రాష్ట్రపతి తన ప్రసంగంలో గత ఏడాది మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా 20 ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగానే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. పార్లమెంట్లో రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతుండగా కొందరు ప్రతిపక్ష ఎంపీలు జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. -
కీలక నిర్ణయం: రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ
న్యూఢిల్లీ : బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రేపు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా చట్టాలు ఆమోదం చేసుకున్నారని ఆరోపించాయి. ఈ కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా ఆహర భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం 16 ప్రతిపక్ష పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ మేరకు రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ పార్టీలు బహిష్కరించనున్నాయి. ఈ సందర్భంగా విపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టాలతో ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం నిలిచిపోతుందని.. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఉభయ సభల్లో సాగు చట్టాలను బలవంతంగా ఆమోదం చేయించినట్లు ఆరోపించారు అందుకే రైతులు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ ఆందోళనల్లో 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గణతంత్రం రోజు హింసాత్మక ఘటనలు ఖండనీయమని ప్రకటించారు. ఈ దుశ్చర్యల వెనుక అసలు కుట్రదారులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని 16 పార్టీలు పేర్కొన్నాయి. దీనికోసం నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి. -
కరోనా ఎఫెక్ట్ : లోక్‌సభ నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై కరోనావైరస్ ఎఫెక్ట్ పడింది. ఆర్థిక బిల్లు ఆమోదం తర్వాత లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఏప్రిల్ 3వ తేది వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయితే కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సమావేశాలు వాయిదా వేయాలని అఖిలపక్షం కోరింది. దీంతో లోక్‌సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. కీలకమైన ఆర్థిక బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటు ద్వారా తెలిపింది. -
31 నుంచి బడ్జెట్ పార్లమెంటు !
న్యూఢిల్లీ: ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదించింది. ఈనెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు విడతల్లో నిర్వహించాలని అందులో పేర్కొంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం చెప్పాయి. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహిస్తారని తెలిపాయి. రెండు విడతల మధ్య ఉండే విరామంలో శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి. -
పార్లమెంట్ ముందుకు రఫేల్‌పై కాగ్ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రఫేల్ ఒప్పందంపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదకను ప్రభుత్వం సభ ముందుంచవచ్చని భావిస్తున్నారు. రఫేల్ ఒప్పందంతో పాటు పలు రక్షణ ఒప్పందాలపై కాగ్ లేవెనెత్తిన పలు ప్రశ్నలకు ఇప్పటికే ప్రభుత్వం సమాధానాలు ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలన్నింటినీ కాగ్‌కు అందుబాటులో ఉంచామని గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కాగ్ నివేదిక కోసం వేచిచూస్తున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రఫేల్ సహా రక్షణ ఒప్పందాలపై కాగ్ నివేదికను పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం బహిర్గతం చేయవచ్చని అధికార వర్గాలు సంకేతాలు పంపాయి. కాగా, రఫేల్ ఒప్పందంపై ఇప్పటికే కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీ సర్కార్‌ను ఇరుకునపెడుతున్న క్రమంలో ఈ వ్యవహారంపై కాగ్ నివేదిక పార్లమెంట్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
121 గంటలు వృధా; వెంకయ్య ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎలాంటి కీలక అంశాలను చేపట్టకుండానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. పెద్దల సభగా పేరొందిన రాజ్యసభలో సభ్యుల నిరవధిక ఆందోళనతో ఏకంగా 121 గంటల విలువైన సభా సమయం వృధా అయింది. వాయిదాల పర్వం, సభ్యుల ఆందోళనలతో రాజ్యసభలో 27 రోజుల పాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టలేదని సభాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. కేవలం 44 గంటల పాటే సభా సమయం సజావుగా సాగింది. అటు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు తీవ్ర ఆందోళనకు దిగి, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా సభ సజావుగా లేదంటూ చర్చకు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక కావేరీ జలాలపై బోర్డు ఏర్పాటు, విగ్రహాల ధ్వంసం, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీం ఉత్తర్వులు వంటి పలు అంశాలపై పార్లమెంట్లో తీవ్ర గందరగోళం చెలరేగింది. రాజ్యసభలో నాలుగింట మూడొంతుల సమయం సభ్యుల అభ్యంతరాలు, అవాంతరాలు, వాయిదాలతో వృధా అయింది. విలువైన సభా సమయం హరించుకుపోవడం తనను తీవ్ర విచారానికి గురిచేస్తోందని రాజ్యసభ 245వ సమావేశాల ముగింపు సందర్భంగా చైర్మన్ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. -
జనవరి 29నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూడిల్లీ: ప్లార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు మొదటి బడ్జెట్ సమావేశాలు, రెండవ దశ సమావేశాలు మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగనున్నాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి. దేశ అధ్యక్షుడు రామనాథ్ కోవింద్ పార్లమెంటులోని రెండు సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజున ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌మార్ మీడియాకు చెప్పారు. కాగా రాజకీయంగా విపరీతమైన వేడిని పుట్టించిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు గందరగోళం నడుమ ఉభయసభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. -
‘బడ్జెట్’ భేటీకి తెర
► లోక్‌సభలో 23, రాజ్యసభలో 14 బిల్లులకు ఆమోదం ►ముందస్తు బడ్జెట్; రైల్వే బడ్జెట్ విలీనం ఈ సమావేశాల్లోనే న్యూఢిల్లీ: పలు చరిత్రాత్మక పరిణామాలకు తెరతీసిన తాజా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం ముగిశాయి. బడ్జెట్ కససత్తు ముగించి నిరవధికంగా వాయిదా పడ్డాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన 4 బిల్లుల ఆమోదంతోపాటు ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే నిధుల కేటాయింపు కోసం బడ్జెట్‌ను ఒక నెల ముందుకు జరిపి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం, అందులో రైల్వే బడ్జెట్ విలీనం ఈ సమావేశాల్లోని విశేషాలు. జనవరి 31న మొదలైన భేటీలు ఆ రోజు నుంచి ఫిబ్రవరి 9 వరకు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 12 వరకు రెండు విడతలుగా సాగాయి. కుల్‌భూషణ్ యాదవ్‌కు పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమావేశాల్లో అన్నీ పార్టీలూ ఏకతాటిపైకి వచ్చాయి. జీఎస్టీ సహా కీలక బిల్లులకు ఆమోదం 29 రోజులు సమావేశాలు జరగ్గా, లోక్‌సభ 176 గంటల 39 నిమిషాలు, రాజ్యసభ 136 గంటలు పనిచేశాయి. వివిధ అంశాలపై గొడవలతో లోక్‌సభలో 8 గంటల 12 నిమిషాలు, రాజ్యసభలో 13 గంటల సమయం వృథా అయింది. దేశంలో అతి పెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. నోట్ల రద్దు, ప్రసూతి ప్రయోజనాల సవరణ, శత్రు ఆస్తుల స్వాధీనం, మోటారు వాహనాల సవరణ తదితర 23 బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 560 స్టార్ గుర్తు ప్రశ్నల్లో 136 ప్రశ్నలకు ప్రభుత్వం మౌఖిక సమాధానాలు ఇచ్చిందని, 158 ప్రైవేటు సభ్యుల బిల్లులను సభలో ప్రవేశపెట్టారని స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశాల ముగింపు సందర్భంగా వెల్లడించారు. జీఎస్టీ, శత్రు ఆస్తుల స్వాధీనం తదితర 14 బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వెనక బెంచీల్లో కూర్చున్నవారు ఈసారి ఉత్సాహంగా సభకార్యకలాపాల్లో పాల్గొన్నారని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ బుధవారం ప్రశంసించారు. పార్లమెంటు చరిత్రలో ఎక్కువగా ఫలప్రదమైన సమావేశాల్లో ఇవి ఒకటని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ విలేకరులతో అన్నారు. -
40 శాతం వరకూ జీఎస్టీ పన్ను!
శ్లాబుల్లో ప్రస్తుతం మార్పులు లేవు ∙అధికారుల వెల్లడి న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటును బిల్లులో ఉన్న 14 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించిన నేపథ్యంలో పన్ను అత్యధికంగా 40 శాతం వరకూ ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. వచ్చే వారం ప్రారంభమయ్యే రెండో దఫా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు చర్చకు వచ్చినపుడు పన్ను రేటు ‘14 శాతానికి మించకూడదు’ అనే నిబంధన స్థానంలో ‘20 శాతానికి మించకూడదు’ అనే నిబంధన చేర్చనున్నారు. ఈ మార్పు ప్రభావం 4 శ్లాబ్‌ల విధానంపై ఉండదని, అయితే భవిష్యత్‌లో పన్ను పెంపుదలకు ఇబ్బందిలేకుండా ఉండటానికే కొత్త నిబంధన అని అధికారులు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. భవిష్యత్‌లో పన్ను పెంచాల్సి వస్తే పార్లమెంట్ అనుమతి తీసుకోనక్కర్లేకుండానే.. కొత్త నిబంధన వల్ల జీఎస్టీ కౌన్సిల్ పెంచవచ్చని చెప్పారు. దీంతో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీలు అత్యధికంగా 20 శాతం చొప్పున ఉండనున్నాయి కాబట్టి పన్ను అత్యధికంగా 40 వరకూ ఉండే అవకాశం ఉంటుందని వారు వెల్లడించారు. -
‘బడ్జెట్’పై ఏమంటారు?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాధారణ బడ్జెట్‌ను వెనక్కు జరపడంపై అభిప్రాయం తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. ఈ నెల పదో తేదీలోగా బదులివ్వాలని సూచించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. నియమావళి అమల్లో ఉన్నందున కేంద్ర బడ్జెట్‌ను వెనక్కి జరిపేలా ఆదేశాలివ్వాలని ప్రతిపక్షాలు ఈసీని కోరాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నసీమ్ జైదీ.. కేంద్ర కేబినెట్ సెక్రటరీ పి.కె.సిన్హాకు శుక్రవారం లేఖ రాశారు. 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 31న సమావేశం కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభ, రాజ్యసభలను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది. -
న్యాయవ్యవస్థ పెత్తనం
శాసన వ్యవస్థను ఆక్రమిస్తోంది: జైట్లీ ♦ పన్ను అధికారాన్నీ న్యాయవ్యవస్థ చేతుల్లో పెట్టడం దుస్సాహసం ♦ జీఎస్టీపై కాంగ్రెస్ తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలి న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ)పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది. ప్రత్యేకించి.. జడ్జి సారథ్యంలో వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయాలన్న అంశంపై పునరాలోచించాలని కోరింది. న్యాయవ్యవస్థ ఒక్కో అడుగు చొప్పున, ఒక్కో ఇటుక చొప్పున శాసనవ్యవస్థను ఆక్రమిస్తోందని, అటువంటి న్యాయవ్యవస్థ చేతుల్లో పన్నువిధించే అధికారాలను పెట్టటం దుస్సాహసం అవుతుందని పేర్కొంది. ఆర్థిక బిల్లుపై రాజ్యసభలో చర్చకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం సమాధానం ఇస్తూ.. జీఎస్టీపై తాము చేసిన మూడు కీలక సిఫారసులకు ప్రభుత్వం అంగీకరిస్తే ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్ పేర్కొన్న నేపథ్యంలో ఆ పార్టీని ఒప్పించేందుకు ప్రయత్నించారు. ‘శాసనవ్యవస్థను, కార్యనిర్వాహణ అధికారాన్ని న్యాయవ్యవస్థ ఏ విధంగా ఆక్రమిస్తోందో చూస్తే.. ఇక మనకు మిగిలిన చివరి అధికారం.. బహుశా ఆర్థిక అధికారం, బడ్జెట్ తయారు చేయటం మాత్రమే. రాష్ట్రాలకు ఉన్న ఏకైక అధికారం పన్ను విధించటమే. పన్ను అధికారాన్ని న్యాయవ్యవస్థకు అప్పగించాలని ఏ రపార్టీ అన్నా అది చాలా పొరాపాటు ఆలోచన’ అని అన్నారు. జీఎస్టీ బిల్లును తెచ్చింది వాస్తవానికి కాంగ్రెసేని అంగీకరిస్తూ.. దీనిని రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఆమోదించడానికి కాంగ్రెస్ నేతలతో తాను చర్చిస్తానని పేర్కొన్నారు. జైట్లీ ప్రసంగం తర్వాత రాజ్యసభ ఆర్థిక బిల్లు, వినియోగ బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో పార్లమెంటులో బడ్జెట్ ప్రక్రియ ముగిసినట్లయింది. సుప్రీం కోర్టు బుధవారమే జాతీయ విపత్తు సహాయ నిధి, రాష్ట్ర విపత్తు సహాయ నిధిలతో పాటు విపత్తు నివారణ నిధిని ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను జైట్లీ ప్రస్తావించారు. ‘వినియోగ బిల్లు ఆమోదం పొందింది. సుప్రీం నిర్దేశాలను అమలు చేయటానికి అదనపు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కో అడుగుగుఆ న్యాయవ్యవస్థ..నిర్మాణాన్ని ధ్వంసం చేస్తుండటాన్ని మీరు చూడలేరా? వినియోగ బిల్లుకు వెలుపల.. ఈ నిధి, ఆ లెవీ ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య పన్ను విధించటంలో వివాదమొస్తే దానిని జడ్జి నిర్ణయించాలని ఒక పక్షం అడిగినట్లయితే.. పార్లమెంటు వెలుపల బడ్జెట్ తయారవుతుంద’న్నారు. పన్ను విధించటం అనేది రాజకీయ అంశమంటూ దానిని రాజకీయంగానే పరిష్కరించుకోవాలని, ఆ అధికారాన్ని కోర్టులకు అప్పగించజాలమని అన్నారు. జీఎస్టీ గరిష్ట పరిమితిని 18%గా రాజ్యాంగంలో పేర్కొనాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. అలా రాజ్యాంగాన్ని సవరించటం సాధ్యం కాదని, ప్రభుత్వం ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధిక పన్ను విధించాల్సి రావచ్చొన్నారు. జీఎస్టీపై కాంగ్రెస్ పార్టీ విధించిన మూడు నిబంధనలపై పునరాలోచించాలని.. లేదంటే జీఎస్టీ బిల్లు భవితవ్యాన్ని నిర్ణయించే పార్లమెంటు ఓటింగ్ ప్రక్రియను జరగనివ్వాలన్నారు. జీఎస్టీ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినా ప్రభుత్వానికి మెజారిటీ లేని రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. రెండు రోజుల ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కొనసాగుతున్న లోక్‌సభ సమావేశాల షెడ్యూలు గడువు మరో రెండు రోజులు మిగిలివుండగానే బుధవారం అర్థంతరంగా ముగించారు. అవాంతరాల కారణాల వల్ల వాయిదాలు లేకుండా మూడు వారాల పాటు కొనసాగింది. 16వ లోక్‌సభ ఎనిమిదో విడత సమావేశాలు.. ఏప్రిల్ 25వ తేదీన మొదలవగా 13 సార్లు సామావేశమై 92 గంటల 21 నిమిషాల పాటు పనిచేసింది.తాజాగా ముగిసిన సమావేశాలను.. బడ్జెట్ సమావేశాల్లో రెండో విడత భేటీగా తొలుత నిర్ణయించినప్పటికీ, మార్చి 10న తొలి విడత సమావేశాలు ముగిసిన తర్వాత ప్రొరోగ్ (అధికారికంగా సమావేశాలను ముగించటం) చేయటంతో ఈ సమావేశాలను వేరేగా పరిగణించారు. ఈ నెల 13వ తేదీ వరకూ సమావేశాల గడువు ఉన్నప్పటికీ బుధవారం నాడే ముగించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. మరోపక్క.. గురువారం సభాకార్యక్రమాల అనంతరం రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడనుందని అధికార వర్గాలు చెప్పాయి. -
కేంద్రాన్ని బతిమాలుదాం.. ఒత్తిడి తేవద్దు
♦ టీడీపీపీ సమావేశంలో ఎంపీలకు బాబు సూచన ♦ రైల్వే బడ్జెట్లో గతం కంటే కేటాయింపులు బాగానే చేశారు ♦ రైల్వే జోన్ ఎందుకివ్వలేదో కారణం చెబితే బాగుండేది ♦ భేటీకి హాజరైన బీజేపీ సభ్యులు హరిబాబు, గోకరాజు సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపై కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని టీడీపీ నిర్ణయించింది. బతిమాలి నిధులు సాధించుకోవడమొక్కటే మార్గమని అభిప్రాయపడింది. ఆదివారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ) సమావేశానికి ఏపీ, తెలంగాణలకు చెందిన టీడీపీ ఎంపీలతోపాటు ఏపీ బీజేపీ ఎంపీలు హరిబాబు, గోకరాజు గంగరాజులు హాజరయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులతోపాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రైల్వేబడ్జెట్‌లో ఏపీకి చేసిన కేటాయింపులపట్ల చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారు. గతంలో రైల్వేబడ్జెట్లలో చేసిన కేటాయింపులకంటే ఈసారి మెరుగుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు ఎంపీలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని మనం పదేపదే కోరినా బడ్జెట్లో ప్రకటన లేకపోవడాన్ని ప్రస్తావించగా.. ప్రకటన చేయకపోవడానికి కారణాలేమిటో తెలియదని, అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండని చంద్రబాబు వారికి సూచించారు. రాష్ట్రవిభజన సమయంలో కేంద్రమిచ్చిన హామీల అమలులో భాగంగా ఈసారి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు, ప్యాకేజీలు మెరుగ్గా ఉంటాయేమో వేచిచూద్దామన్నారు. ఒకవేళ ఆశించినంతగా లేకపోతే ప్రధాని, ఆర్థికమంత్రి, నీతిఆయోగ్ దృష్టికి లేఖరూపంలో తెలియచేద్దామన్నారు. కరువు, వరదలవల్ల రాష్ట్రానికి నష్టం జరిగినా కేంద్రంనుంచి ఆశించినంతగా నిధుల కేటాయింపు లేదని ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. అది నిజమేనని అంగీకరించిన చంద్రబాబు దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని వారిని కోరారు. కాగా ఇప్పటికే ఇసుక విధానంలో అనుసరించిన వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, ఇప్పుడు ఉచిత ఇసుక విధానంతో అపప్రద తెచ్చుకోకుండా చూడాలని ఎంపీలు సూచించారు. ఉచితం పేరుతో పార్టీ నేతలు, ఇతరులు భారీగా ఇసుకను నిల్వచేసి ఇతర రాష్ట్రాలకు తరలించి, రాష్ట్రంలో ఎక్కువ ధరలకు అమ్మితే మరింత చెడ్డపేరు వస్తుందన్నారు. ప్రత్యేక హోదానా.. అంతకంటే ఎక్కువగానా అనేది తేలుస్తాం: సుజనా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తారా? అంతకంటే ఎక్కువ ప్యాకేజీ ముట్టజెబుతారా? తేల్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీడీపీపీ సమావేశంలో నిర్ణయించినట్టు కేంద్రమంత్రి సుజనాచౌదరి చెప్పారు. ఎంపీలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదాకు చట్టపరమైన ఇబ్బందులున్నందున..ఎక్కువ నిధులు రాబట్టే మార్గాలను చూస్తున్నట్టు చెప్పారు. రైల్వేజోన్‌ను రైల్వే బడ్జెట్ సవరణలో పెట్టకపోయినా అది వస్తుందని చెప్పారు. ఫిరాయింపులే లక్ష్యంగా పనిచేయండి.. టీడీపీపీ సమావేశంలో ఫిరాయింపుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఫిరాయింపులపై నేతలమధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. అయితే వలసలే లక్ష్యంగా పనిచేయడంతోపాటు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎంపీలకు ఈ సందర్భంగా చంద్రబాబు హితబోధ చేశారు. పదవులు, నిధులు, ఇతర విషయాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంద్వారా ప్రతిపక్ష పార్టీలోని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలను టీడీపీలో చేర్పించేందుకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలని సూచించినట్టు సమాచారం. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో ప్రతిపక్షాల్ని బలహీనపర్చడంలో అధికారపార్టీలు విజయవంతమయ్యాయని, అందువల్లే అక్కడ ఒకే పార్టీ దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతుందని, ఇక్కడా ఆ పరిస్థితి రావాలంటే ఫిరాయింపులద్వారా పార్టీని బలపర్చుకోవడమే ఏకైక మార్గమని ఎంపీలకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది. -
అమర జవాన్లకు పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: ఉగ్ర దాడులు, సరిహద్దు రక్షణలో అమరులైన సైనికులకు పార్లమెంటు మంగళవారం ఘన నివాళులర్పించింది. పఠాన్‌కోట్ ఉగ్ర దాడిలో అసువులు బాసిన ఏడుగురు భద్రతా సిబ్బందితోపాటు సియాచిన్‌లో మంచుచరియల కింద చిక్కుకొని కన్నుమూసిన ఎనిమిది మంది జవాన్లు, లడఖ్‌లో మంచుచరియలకు బలైన నలుగురు జవాన్లకు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నివాళులర్పించారు. ఉగ్రవాదుల మతిలేని హింస తీవ్రంగా ఖండించదగ్గదన్నారు. మాజీ ఎంపీ, జమ్మూకశ్మీర్ దివంగత సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్, లోక్‌సభ మాజీ స్పీకర్, మాజీ గవర్నర్ బలరాం ఝాఖడ్, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ తదితరుల మృతికి అన్సారీ సంతాపం తెలిపారు. అమర జవాన్ల గౌరవార్థం రాజ్యసభ కాసేపు మౌనం పాటించింది. లోక్‌సభ కూడా అమర జవాన్లకు నివాళులర్పించింది. జేఎన్‌యూపై నేడు రాజ్యసభలో చర్చ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బుధవారం న రాజ్యసభలో జేఎన్‌యూ వివాదంపై చర్చతో అధికార, విపక్షాలు తలపడనున్నాయి. మంగళవారం నాటి సభా కార్యక్రమాల సలహా సంఘం భేటీలో.. అధికార, విపక్ష సభ్యుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు బుధవారం జేఎన్‌యూ అంశంపై చర్చించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జేఎన్‌యూ అంశంతో పాటు.. ఇష్రాత్ జహాన్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటూ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలంపైనా చర్చ జరపాలంటూ బీజేపీ ఎంపీ భూపీందర్‌యాదవ్ నోటీస్ ఇచ్చారు. భావప్రకటన స్వేచ్ఛపై చర్చకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. -
చర్చ జరగాలి.. గొడవ కాదు
పార్లమెంటు సమావేశాలపై రాష్ట్రపతి ప్రణబ్ ♦ అధికార, విపక్షాలకు పరస్పర సహకారం అవసరం ♦ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం; కేంద్ర పథకాలపై ప్రశంసలు న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గొడవలు చేయటం ఆపి.. ఆరోగ్యకరమైన చర్చ జరిగేలా విపక్షాలు సహకరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రజల మనోభావాలను ప్రతిబింబించాల్సిన పార్లమెంటులో వివాదాలు జరగటం సరికాదన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా సెంట్రల్హాల్లో ఉభయ సభలనుద్దేశించి ప్రణబ్ ప్రసంగించారు. ఇటీవలికాలంలో పార్లమెంటును విపక్షాలు స్తంభింపచేయటంపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. సభ్యులంతా పరస్పర సహకారంతో.. సభను ప్రజాసమస్యలపై చర్చకు వినియోగించుకోవాలని ప్రణబ్ కోరారు. రాజ్యసభలో ప్రభుత్వానికి వీలైనంత మెజారిటీ లేకపోవటం వల్లే ఇంత రాద్ధాంతం జరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. సభాకార్యక్రమాలను విపక్షాలు అడ్డుకోవటంపై మాట్లాడినపుడు సభ చప్పట్లతో మార్మోగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు, బ్యాంకుల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రశంసించారు. వారూ వీరూ కలసి.. కాగా, రాష్ట్రపతి ప్రసంగం కోసం ఏర్పాటుచేసిన సమావేశంలో.. సోనియా గాంధీ, అద్వానీ పక్క పక్కన కూర్చోగా.. రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒకచోట కూర్చుని మాట్లాడుతూ కనిపించారు. ప్రధాని మోదీతో అరుణ్ జైట్లీ, రాజ్యసభ విపక్షనేత గులాంనబీ ఆజాద్ కలసి కూర్చున్నారు. రాష్ట్రపతి ప్రసంగంలోని పలు ముఖ్యాంశాలు.. ► పేదరిక నిర్మూలనకు కట్టుబడిన మోదీ ప్రభుత్వం ఈ దిశగా పలు పథకాలను చేపట్టింది. ► నల్లధనం వెనక్కు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. ► జన్‌ధన్ యోజన ద్వారా తెరిచిన అకౌంట్లతో.. ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు చేసే ఆర్థికసాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే వెళుతుంది. ► ప్రధాన మంత్రి ముద్రయోజన కింద 2.6 కోట్ల మందికి లక్షకోట్ల నిధులిచ్చారు. ఇందులో 2.07 కోట్ల మంది వ్యాపారులు మహిళలే. ► నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను పునరుజ్జీవింపచేసేందుకు 70 వేల కోట్ల రూపాయల సాయం అందించింది. ► ప్రపంచ ఆర్థిక రంగం కష్టాల్లో ఉన్నా.. భారత ఆర్థిక పరిస్థితి మాత్రం చెక్కుచెదరలేదు. మోదీ సర్కారు అవలంబించిన కార్యక్రమాలే దీనికి కారణం. ► సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేస్తూనే..పాకిస్తాన్‌తో స్నేహపూర్వక వాతావరణాన్ని భారత్ కోరుకుంటోంది. ► పఠాన్‌కోట్ ఘటనలో ఉగ్రవాదులను అడ్డుకుని భారీనష్టం జరగకుండా ఆపిన సైనికులకు శుభాకాంక్షలు. పలుప్రభుత్వ పథకాలపైనా రాష్ట్రపతి సానుకూలంగా వ్యాఖ్యానించారు. సభ సజావుగానే: ప్రధాన మంత్రి పార్లమెంటు సమావేశాలను అడ్డుకునేందుకు విపక్షాలు సిద్ధమవుతోంటే ప్రధాని మోదీ మాత్రం సమావేశాలు ప్రశాంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సభలో ప్రజాప్రయోజనకరమైన చర్చ జరుగుతుందని ఇందులో విపక్ష సభ్యులు సానుకూల అంశాలను ప్రభుత్వానికి సూచించే పరిస్థితి కనబడుతోందని అన్నారు. రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున 125 కోట్ల ప్రజలు పార్లమెంటులో ఏం జరుగుతుందో చూద్దామనుకుంటున్నందున విపక్షాలు సహకరిస్తాయన్నారు. -
స్పీకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. సమావేశాలు సజావుగా సాగాలని, ఆందోళనల వల్ల క్వశ్చన్‌అవర్ నష్టపోకుండా చూడాలంటూ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని తెలిపారు. రిజర్వేషన్ల వ్యవస్థ, జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో వర్సిటీల నిర్వహణపై చర్చించాలంటూ విపక్షాలు కోరాయని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంతోపాటు, సాధారణ, రైల్వే బడ్జెట్లు, మరికొన్ని కీలక అంశాలపై చర్చ ఉంటుంద న్నారు. వచ్చే వారం లోక్‌సభలో చర్చించాల్సిన అంశాలపై ఈ రోజు మధ్యాహ్నం జరిగే బీఏసీ సమావేశంలో అజెండా రూపొందిస్తామని తెలిపారు. -
దేశాభివృద్ధే మా ధ్యేయం
అఖిలపక్షంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం దేశ అభివృద్ధికి, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 26 పార్టీలకు చెందిన 40 మంది నేతలు సమావేశంలో పాల్గొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇటీవలి పరిణామాలపై పార్లమెంటులో లోతుగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య ఉభయ సభలకు చెందిన వివిధ పార్టీల నేతలకు హామీ ఇచ్చారు. జేఎన్‌యూ, హెచ్‌సీయూ సంఘటనలు, రిజర్వేషన్ల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ప్రధాన బిల్లులైన జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లులు ఆమోదం పొందేందుకు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత ఖర్గే మాట్లాడుతూ బిల్లుల ఆమోదంలో తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, అయితే తాము లేవనెత్తే అంశాలపై సమగ్ర చర్చ జరగాలన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి కోరారు. పంచాయతీ రాజ్ వ్యవహారాలపై రాజ్యసభ కమిటీని రాజ్యసభ ఛైర్మన్ అన్సారీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా కేశవరావు(టీఆర్ఎస్), గరికపాటి మోహన్‌రావు(టీడీపీ), జైరాం రమేశ్(కాంగ్రెస్)లను నామినేట్ చేశారు. ప్రతిపాదించిన ఎజెండా.. 25న ప్రశ్నోత్తరాలు ముగిశాక రైల్వే మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు.29న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. చర్చ, ఆమోదానికి ఉన్న బిల్లులు.. ► ఆర్థిక బిల్లు, 2016. 8 ఎనిమీ సంపత్తి(సవరణ, క్రమబద్ధీకరణ) బిల్లు.(ఆర్డినెన్స్ స్థానంలో). 8ది రీజనల్ సెంటర్ ఫర్ బయో-టెక్నాలజీ బిల్లు.8ఎన్నికల చట్టాలు(సవరణ) బిల్లు, 2016 లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్నవి.. ► లోక్‌పాల్, లోకాయుక్త, సంబంధిత ఇతర చట్టాలు(సవరణ) బిల్లు, 2014 లోక్‌సభ ఆమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నవి ► రాజ్యాంగ(నూటా ఇరవై రెండో సవరణ) బిల్లు, 2014-(జీఎస్టీ బిల్లు) ► ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిల్లు, 2015. 8 పరిశ్రమల(అభివృద్ధి, నియంత్రణ) బిల్లు, 2015 ► వినియోగ చట్టాలు(రద్దు) బిల్లు, 2015 ► జాతీయ జల మార్గాల బిల్లు, 2015 ► విజిల్ బ్లోయర్స్ రక్షణ (సవరణ) బిల్లు ► హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల(వేతనాలు, సర్వీసు షరతులు) సవరణ బిల్లు, 2015 రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు ► రియల్ ఎస్టేట్(నియంత్రణ, అభివృద్ధి) బిల్లు, 2013 ► హైజాకింగ్ వ్యతిరేక బిల్లు, 2014 కొత్తగా ప్రవేశపెట్టబోయే బిల్లులు ► రాజ్యాంగ(షెడ్యూలు కులాలు) ఉత్తర్వులు(సవరణ) బిల్లు.8 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బిల్లు. -
వాడివేడిగా బడ్జెట్ పార్లమెంట్!
కుదిపేయనున్న జేఎన్‌యూ, రోహిత్ ఆత్మహత్య అంశాలు నేడు అఖిలపక్షంతో వెంకయ్య భేటీ సాక్షి, న్యూఢిల్లీ: మంగళవారం ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. జేఎన్‌యూ వివాదం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య, పఠాన్‌కోట్‌పై ఉగ్రదాడి తదితర అంశాలు పార్లమెంటును కుదిపేయనున్నాయి. జీఎస్టీతోపాటు ఇతర కీలక అంశాలపై అధికార, విపక్షాల వాగ్యుద్ధంతో గత రెండు సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకొనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు ప్రధాని మోదీ ఇప్పటికే విపక్షాల నాయకులతో సమావేశమవగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా అన్ని పార్టీలతో సభలో సంపద్రింపులు జరపనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జేఎన్‌యూ వివాదంపైన అయినా లేదా విపక్షాలు కోరిన ఏ అంశాలపైనా అయినా పార్లమెంటులో చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టంచేసింది. సమావేశాలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తామని, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సమావేశాలు జరిగే రోజుల్లో కోత వేయబోమని విపక్షాలకు వెంకయ్య చెప్పారు. ఈ సమావేశాల్లో మొత్తం 74 అంశాలను పార్లమెంటు ముందుకు తేనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో 62 లెజిస్లేటివ్ కాగా, 12 ఆర్థికపరమైనవి. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లుతో సహా 26 బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించేలా ప్రభుత్వం భారీ ఎజెండాతో సిద్ధమైంది. ఏపీ పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అదేవిధంగా విభజన చట్టాన్ని పూర్తిగా అమలుచేయడంతోపాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలను ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో లేవదీయనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే పక్షంలో తెలంగాణకూ ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో కోరతామని టీఆర్ఎస్ ఇప్పటికే స్పష్టం చేసింది. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి మంగళవారం రాష్ట్రపతి ప్రసంగిస్తారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక స్థితిగతుల్ని వివరించే ఆర్థిక సర్వేను ఈ నెల 26న పార్లమెంటుకు సమర్పిస్తారు. 25న రైల్వే బడ్జెట్‌ను, 29న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. -
జేఎన్‌యూపై తగ్గేదిలేదు!
దూకుడుగా పార్లమెంటు సమావేశాల్లో చర్చకు బీజేపీ సిద్ధం న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కూడా గందరగోళం చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతుండటంతో.. అధికార బీజేపీ అస్త్ర, శస్త్రాలను నూరుతోంది. ముంబై దాడులకు సంబంధించి హెడ్లీ వాంగ్మూలం (ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్) తోపాటు జేఎన్‌యూ అంశంపై విపక్షాలకు దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. జన్ స్వాభిమాన్ అభియాన్.. జేఎన్‌యూలో జాతి వ్యతిరేక కార్యక్రమాలపై విపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ.. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు ‘జన్ స్వాభిమాన్ అభియాన్’ పేరుతో బీజేపీ దేశవ్యాప్త కార్యక్రమాలు చేపట్టనుంది. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు జేఎన్‌యూ వాస్తవాలను చెప్పనున్నారు. ‘ఐక్యత, సమగ్రత, అభివృద్ధి’ నినాదంతో కార్యక్రమాలు జరుగుతాయి. లాయర్ల ఒక్కరోజు దీక్ష దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయటం లేదని నిరసిస్తూ ఢిల్లీలోని కర్కర్దూమా జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ఒక్కరోజు దీక్ష నిర్వహించారు. దీంతో కోర్టు కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. అడ్వొకేట్ల దుస్తులు ధరించి వచ్చిన కొందరు ఆగంతకులు పటియాలా కోర్టు ఆవరణలో జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారని న్యాయవాదులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ సందర్భంగా ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో నినాదాలు చేశారు. దీంతో ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సప్రేల ధర్మాసనం ఈ అనూహ్య ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గిలానీ తరహాలోనే మరికొందరిని! అఫ్జల్ అనుకూల నినాదాలు చేసిన ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ గిలానీని దేశద్రోహం కింద అరెస్టు చేసిన కేసులో మరికొందరిని చేర్చనున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరికొందరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో భారత వ్యతిరేక నినాదాలు చేసినందుకు గిలానీపై దేశ ద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కన్హయ్యను అరెస్టు చేసిన రోజే వర్సిటీ ప్రొఫెసర్లు అలీ జావెద్, నిర్మలాంశు ముఖర్జీ, త్రిప్త వహీలను పోలీసులు విచారించారు. వీరంతా ప్రెస్‌క్లబ్‌లో గిలానీతోపాటు వేదికపై ఉన్నారని పోలీసులు తెలిపారు. 2001లో పార్లమెంటుపై దాడి కేసులో గిలానీని అరెస్టు చేసినా.. ఆధారాలు లేక 2003లో ఢిల్లీ కోర్టు గిలానీని విడుదల చేసింది.