
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై కరోనావైరస్ ఎఫెక్ట్ పడింది. ఆర్థిక బిల్లు ఆమోదం తర్వాత లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఏప్రిల్ 3వ తేది వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయితే కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సమావేశాలు వాయిదా వేయాలని అఖిలపక్షం కోరింది. దీంతో లోక్‌సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. కీలకమైన ఆర్థిక బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటు ద్వారా తెలిపింది.