జనవరి 29నుంచి బడ్జెట్‌ సమావేశాలు | Budget session from January 29 to April 6 | Sakshi

జనవరి 29నుంచి బడ్జెట్‌ సమావేశాలు

Jan 5 2018 3:13 PM | Updated on Oct 2 2018 4:19 PM

 Budget session from January 29 to April 6 - Sakshi


సాక్షి, న్యూడిల్లీ: ప్లార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 29నుంచి ప్రారంభం కానున్నాయి.  ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్థికమంత్రి  అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో  బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ  నేపథ్యంలో  ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు మొదటి బడ్జెట్ సమావేశాలు, రెండవ దశ సమావేశాలు మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగనున్నాయని అధికారిక వర్గాలు  ప్రకటించాయి.

దేశ అధ్యక్షుడు రామనాథ్ కోవింద్‌ పార్లమెంటులోని రెండు సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజున ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌మార్  మీడియాకు చెప్పారు.
కాగా రాజకీయంగా విపరీతమైన వేడిని పుట్టించిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు గందరగోళం నడుమ ఉభయసభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement