January 29th
-
జనవరి 29నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూడిల్లీ: ప్లార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు మొదటి బడ్జెట్ సమావేశాలు, రెండవ దశ సమావేశాలు మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగనున్నాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి. దేశ అధ్యక్షుడు రామనాథ్ కోవింద్ పార్లమెంటులోని రెండు సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజున ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌మార్ మీడియాకు చెప్పారు. కాగా రాజకీయంగా విపరీతమైన వేడిని పుట్టించిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు గందరగోళం నడుమ ఉభయసభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. -
జనవరి 29న కానిస్టేబుళ్ల ఎంపికకు తుది పరీక్ష
సాక్షి, అమరావతి: జనవరి 29న పోలీస్ కానిస్టేబుళ్ల (కమ్యూనికేషన్) ఎంపికకు తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి చైర్మన్ అతుల్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన 42,925 మందికి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్ష నిర్వహించిన చోటే విజయవాడ, విశాఖ, కర్నూలులో ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఏలూరులో దేహదారుఢ్య పరీక్షకు హాజరైన అభ్యర్థులు విజయవాడలో రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని వివరించారు. హాల్ టికెట్లను పోలీసు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.