జనవరి 29న కానిస్టేబుళ్ల ఎంపికకు తుది పరీక్ష
సాక్షి, అమరావతి: జనవరి 29న పోలీస్ కానిస్టేబుళ్ల (కమ్యూనికేషన్) ఎంపికకు తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి చైర్మన్ అతుల్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన 42,925 మందికి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్ష నిర్వహించిన చోటే విజయవాడ, విశాఖ, కర్నూలులో ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఏలూరులో దేహదారుఢ్య పరీక్షకు హాజరైన అభ్యర్థులు విజయవాడలో రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని వివరించారు. హాల్ టికెట్లను పోలీసు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.