
స్పీకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. సమావేశాలు సజావుగా సాగాలని, ఆందోళనల వల్ల క్వశ్చన్‌అవర్ నష్టపోకుండా చూడాలంటూ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని తెలిపారు. రిజర్వేషన్ల వ్యవస్థ, జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో వర్సిటీల నిర్వహణపై చర్చించాలంటూ విపక్షాలు కోరాయని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంతోపాటు, సాధారణ, రైల్వే బడ్జెట్‌లు, మరికొన్ని కీలక అంశాలపై చర్చ ఉంటుంద న్నారు. వచ్చే వారం లోక్‌సభలో చర్చించాల్సిన అంశాలపై ఈ రోజు మధ్యాహ్నం జరిగే బీఏసీ సమావేశంలో అజెండా రూపొందిస్తామని తెలిపారు.