ఆందోళనల మధ్యే ఖర్గే రైల్వే బడ్జెట్
న్యూఢిల్లీ : రైల్వేశాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే బుధవారం లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలిసారిగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే సీమాంధ్ర ఎంపీల నిరసనల మధ్యే ఖర్గే తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. రైల్వేలను అనుసంధానం చేస్తామని, డబ్లింగ్, రైల్వేల ఆధునికీకరణకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తన ప్రసంగంలో తెలిపారు.
రైలు ప్రయాణికులకు సౌకర్యాలు, భద్రత మరింత మెరుగుపరచే దిశగా..రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే కసరత్తు పూర్తీ చేశారు. యూపీఏ-2 ఇదే చివరి రైల్వే బడ్జెట్. 2009 వోటాన్ అకౌంట్ రైల్వే బడ్జెట్‌లో..రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ 2 శాతం రైలు టికెట్ ధర తగ్గించినట్టే.. ఇప్పుడుకూడా రైల్వే టికెట్ ధరలు కాసింతైనా తగ్గించేందుకు ఖర్గే ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో..ఛార్జీలు తగ్గించకపోయినా.. కొత్తగా రైలు ఛార్జీలు పెంచడంలేదని తెలుస్తోంది.