31 నుంచి బడ్జెట్‌ పార్లమెంటు ! | CCPA recommends Budget session from January 31 | Sakshi
Sakshi News home page

31 నుంచి బడ్జెట్‌ పార్లమెంటు !

Published Thu, Jan 9 2020 6:10 AM | Last Updated on Thu, Jan 9 2020 6:10 AM

CCPA recommends Budget session from January 31 - Sakshi

న్యూఢిల్లీ: ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ప్రతిపాదించింది. ఈనెల 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు విడతల్లో నిర్వహించాలని అందులో పేర్కొంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం చెప్పాయి. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత, మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహిస్తారని తెలిపాయి. రెండు విడతల మధ్య ఉండే విరామంలో శాఖల వారీగా ఉన్న బడ్జెట్‌ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement