Parliamentary Affairs Advisory Committee
-
31 నుంచి బడ్జెట్ పార్లమెంటు !
న్యూఢిల్లీ: ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదించింది. ఈనెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు విడతల్లో నిర్వహించాలని అందులో పేర్కొంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం చెప్పాయి. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహిస్తారని తెలిపాయి. రెండు విడతల మధ్య ఉండే విరామంలో శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి. -
నవంబర్ 18 నుంచి పార్లమెంట్!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలు సమావేశాలు నవంబర్ 18న ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వవర్గాలు సంకేతాలిచ్చాయి. డిసెంబర్ 13 వరకు జరిగే అవకాశముందన్నాయి. పార్లమెంటు తేదీల ఖరారుపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం కమిటీ అధ్యక్షుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో భేటీ అయింది. సమావేశాల తేదీలపై వచ్చే వారంలో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది. పెద్దల సభలో ఇక సులువే! విపక్ష పార్టీల ఎంపీల రాజీనామాలతో ఎన్డీయే ప్రభుత్వానికి రాజ్యసభలోనూ సానుకూల పరిస్థితి నెలకొంటోంది. బుధవారం కాంగ్రెస్‌కు మరో ఎంపీ దూరమయ్యారు. శీతాకాల సమావేశాలు మొదలయ్యేలోపు విపక్షాల నుంచి మరి కొందరూ రాజీనామా చేస్తారని బీజేపీ వర్గాలు అంటున్నా యి. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కేసీ రామమూర్తి బుధవారం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 45కి తగ్గింది. 243 (ఇద్దరు నామినేటెడ్ సభ్యులను మినహాయించి) సభ్యుల రాజ్యసభలో ఎన్డీయేకు 106 మంది సభ్యుల మద్దతుంది. మిత్ర పక్షాలుగా భావించే అన్నాడీఎంకేకు 11 మంది, బీజేడీకి ఏడుగురు సభ్యులున్నారు. దీంతో రాజ్యసభలో బిల్లులను విపక్షాలు అడ్డుకునే పరిస్థితులు ఉండవని భావిస్తున్నారు. -
4న ‘స్పీకర్‌పై అవిశ్వాసం’ చర్చ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు మీద వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకోసం ఏప్రిల్ 4వ తేదీన శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆరోజు ఉదయం ఎనిమిదిన్నర లేదా తొమ్మిది గంటలకు సభ సమావేశమై రెండు గంటలపాటు ఈ అంశంపై చర్చించనుంది. గురువారం జరిగిన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ కోడెల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, శాసనసభ వ్యవహారాలమంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, వైఎస్సార్సీఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు. సమావేశంలో ప్రభుత్వం.. ముందుగా నిర్ణయించి నట్లే నాలుగో తేదీన అవి శ్వాస తీర్మానంపై చర్చ చేపడతామని తెలిపింది. అందుకు ప్రతిపక్షం కూడా అంగీకరించింది. స్పీకర్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మీద రెండుగంటల పాటు చర్చించాలని నిర్ణయించారు. అయితే రెండుగంటలకు మించి చర్చ జరిగే అవకాశముంది. ఈ అంశంపై రెండురోజులపాటు చర్చిం చాలని వైఎస్సార్సీపీ సభ్యులు కోరినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఒకరోజు చర్చకు మాత్రమే అంగీకరించింది. అది కూడా సభలో పార్టీల బలాబలాలకు అనుగుణంగా అవిశ్వాసంపై మాట్లాడేందుకు సమయమివ్వాలని నిర్ణయించింది. వైఎస్సార్సీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానం మీద కూడా బీఏసీ సమావేశంలో చ ర్చ జరిగింది. అంతకుముందు ఇదే అంశంపై ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షంతో చర్చలు జరిపిన విష్ణుకుమార్‌రాజు స్పీకర్ మీద ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలపై వారు విచారం వ్యక్తం చేసే అంశాన్ని తాను సభలో చదివి వినిపిస్తానని అన్నారు.