ప్రభాస్- కృతి సనన్ నటించిన ఆదిపురుష్ భారీ డిజాస్టర్‌తో పాటు ఆ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఒక రకంగా ప్రభాస్ నటించిన ఏ సినిమాకు ఇంతలా వ్యతిరేఖత రాలేదనే చెప్పాలి. తాజాగ చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయింది. చంద్రమండలంపై భారత్ అడుగుపెట్టింది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ సినిమా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.
(ఇదీ చదవండి: చంద్రయాన్-3 పై సినిమా.. ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే)
చంద్రయాన్-3 కోసం రూ.615 కోట్ల బడ్జెట్ మాత్రమే ఖర్చు అయింది. కానీ 'ఆదిపురుష్' కోసం రూ.700 కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ లెక్కన 'ఆదిపురుష్' కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు భారతీయ జెండాను చంద్రమండలంపై సగర్వంగా ఎగురవేశారని చెప్పవచ్చు. ఆదిపురుష్ లాంటి చెత్త సినిమాలు తీయకుండా దేశానికి ఉపయోగపడే పనులకు ఖర్చుపెడితే బాగుంటుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
వివిధ సినిమాలకు సంబంధించిన ప్రాజెక్టుల వ్యయాలతో చంద్రయాన్-3 బడ్జెట్‌ను నెటిజన్లు పోలుస్తూ... ఇస్రోను ప్రశంసిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ కూడా 'ఓపెన్‌హైమర్' సినిమా కోసం రూ. 800 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. అణుబాంబు సృష్టికర్త జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే దర్శకుడు సుమారు పదేళ్ల కిందటే ఇంటర్‌స్టెల్లార్ అంతరిక్షం కాన్సెప్ట్‌తో వచ్చిన సనిమా కోసం ఏకంగా రూ.1350 కోట్లు ఖర్చుబెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment