► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్‌కు ప్రధాని నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత్ లీడర్‌గా ఎదుగుతోందన్నారు. అయితే మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ సభాపక్షనేత అధిర్ రంజన్ అడ్డుకున్నారు. దీంతో కొందరు ఇంకా 2014లోనే ఉన్నారని అధిర్ రంజన్‌ను ఉద్దేశించి మోదీ పంచ్ వేశారు. 1972లో చివరిసారి బెంగాల్లో కాంగ్రెస్ గెలిచిందంటూ అధిర్‌కు కౌంటర్ వేశారు.
► తెలంగాణ ఇచ్చినా కూడా అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వలేదని మోదీ చురకలంటించారు. ఎన్ని ఓటములు ఎదురైనా కాంగ్రెస్ తీరు మారడం లేదని విమర్శించారు. గత రెండేళ్లుగా భారత్ కోవిడ్‌తో పోరాడుతోందని, కోవిడ్‌ను కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
► వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్‌లో కళ్లు తిరిగిపడిపోయారు. ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.
►కేంద్రం కేటాయించిన జడ్ కేటగిరి భద్రతను స్వీకరించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకిహోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఒవైసీ కాన్యాయ్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రాజ్యసభలో దీనిపై ప్రకటన చేసిన షా.. ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని, ఆల్టో కారు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
► రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ విషప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి బలంగా తిప్పికొట్టారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అవాస్తవాలను వల్లేవేశారు .సినిమా టికెట్లు సహా పలు అంశాలపై తప్పుడు ప్రచారం చేయడానికి కనకమేడల ప్రయత్నించారు. దీనిపై స్పందించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ పాలన కంటే వైఎస్సార్‌సీపీ పాలన వెయ్యిరెట్లు గొప్పగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
► గాయిని లతా మంగేష్కర్‌కు మృతిపట్ల నివాళిగా ఉభయ సభలను గంటపాటు వాయిదా వేశారు. లోక్‌సభ బడ్జెట్‌పై చర్చలో భాగంగా.. గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి అర్జున్ ముండా త్రిపురలోని షెడ్యూల్డ్ తెగల జాబితాను సవరించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో భారత రత్న, దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో లతా మంగేష్కర్ సంతాప సందేశాన్ని చదివి వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment