బడ్జెట్‌ సమావేశాల్లో 38 బిల్లులు | 38 Bills On Agenda Of Government For Budget Session | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్రం

Published Sun, Jan 31 2021 12:15 AM | Last Updated on Sun, Jan 31 2021 2:47 AM

38 Bills On Agenda Of Government For Budget Session - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 38 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో కేంద్ర బడ్జెట్‌ సహా ఐదు ఫైనాన్స్‌ బిల్లులు ఉన్నాయి. నాలుగు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రతిపాదించనుంది. అలాగే 3 చట్టాల ఉపసంహరణకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.

శాసన సంబంధిత బిల్లులు
1. నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్, సమీప ప్రాంతాల వాయు నాణ్యత నిర్వహణ కమిషన్‌ బిల్లు–2021 (ఆర్డినెన్స్‌ స్థానంలో.)
2. మధ్యవర్తిత్వం, సయోధ్య (సవరణ) బిల్లు, 2021 (ఆర్డినెన్స్‌ స్థానంలో)
3. జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లు, 2021 (ఆర్డినెన్స్‌ స్థానంలో)
4. జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2021 ( ఆర్డినెన్స్‌ స్థానంలో)
5. డీఎన్‌ఏ టెక్నాలజీ (యూజ్‌ అండ్‌ అప్లికేషన్‌) రెగ్యులేషన్‌ బిల్లు, 2019.
6. తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమం (సవరణ) బిల్లు, 2019
7. ది ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ (సవరణ) బిల్లు, 2020
8. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు, 2019
9. సినిమాటోగ్రాఫ్‌ (సవరణ) బిల్లు, 2019
10. లోక్‌సభ ఆమోదించిన ఆనకట్ట భద్రతా బిల్లు, 2019.
11. లోక్‌సభ ఆమోదించిన మేజర్‌ పోర్ట్‌ అథారిటీస్‌ బిల్లు, 2020
12. పురుగుమందుల యాజమాన్య బిల్లు, 2020
13. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌ బిల్లు, 2020
14. లోక్‌సభ ఆమోదించిన 2020 మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లు.
15. గనుల (సవరణ) బిల్లు, 2011 (ఉపసంహరణ కోసం)
16. అంతర్రాష్ట్ర వలస కార్మికుల (ఉపాధి నియంత్రణ, సేవా నిబంధనలు) సవరణ బిల్లు, 2011 (ఉపసంహరణ కోసం)
17. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంబంధిత చట్టాలు (సవరణ) బిల్లు, 2013 (ఉపసంహరణ కోసం)
18. ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సే్ఛంజెస్‌∙(ఖాళీల తప్పనిసరి నోటిఫికేషన్‌) సవరణ బిల్లు, 2013 (ఉపసంహరణ కోసం)
19. మల్టీ–స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ (సవరణ) బిల్లు, 2021
20. నేషనల్‌ ఇన్సి్టట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (సవరణ) బిల్లు, 2021
21. చార్టెడ్‌ అకౌంటెంట్లు, కాస్ట్‌ అండ్‌ వర్క్స్‌ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు (సవరణ) బిల్లు, 2021
22. కాంపిటిషన్ (సవరణ) బిల్లు, 2021
23. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సవరణ) బిల్లు, 2021
24. నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (నాబ్‌ఫిడ్‌) బిల్లు, 2021
25. క్రిప్టోకరెన్సీ, డిజిటల్‌ కరెన్సీ రెగ్యులేషన్‌ బిల్లు 2021
26. జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీ బిల్లు, 2021
27. మెట్రో రైలు (నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ) బిల్లు, 2021
28. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, 2021
29. విద్యుత్‌ (సవరణ) బిల్లు, 2021
30. మెరైన్‌ ఎయిడ్స్‌ టు నావిగేషన్‌ బిల్లు, 2021
31. ఇన్‌లాండ్‌ వెసల్స్‌ బిల్లు, 2021
32. మాన్యువల్‌ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం, పునరావాస సవరణ బిల్లు, 2021
33. జువెనైల్‌ జస్టిస్‌ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) సవరణ బిల్లు, 2021

ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన బిల్లులు  
1. ఆర్థిక బిల్లు, 2021
2. 2020–21 నిధుల కోసం అనుబంధ డిమాండ్లపై అప్రొప్రియేషన్‌ బిల్లు 
3. 2021–22 నిధుల డిమాండ్లపై చర్చ, ఓటింగ్, సంబంధిత అప్రొప్రియేషన్‌ బిల్లు 
4. 2020–21 ఆర్థిక సంవత్సరానికి జమ్మూ కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాల నిధుల కోసం అప్రొప్రియేషన్‌ బిల్లు
5. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జమ్మూ కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతాల నిధుల కోసం అప్రొప్రియేషన్‌ బిల్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement