
స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది.. దాదాపు అన్ని లావాదేవీలకు ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు. యూజర్ల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్న సమయంలో.. ట్రాన్సాక్షన్ల మీద ఛార్జీలను వసూలు చేయడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ఇప్పటి వరకు లావాదేవీల మీద ఎలాంటి ఛార్జీలను వసూలు చేయని గూగుల్ పే.. ఇకపై ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, డీటీహెచ్ బిల్స్ చెల్లించినప్పుడు.. అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే వినియోగదారులకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఫీజు ఉండదు.
గతేడాది నుంచి మొబైల్ రీఛార్జీల మీద రూ. 3 కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తున్న గూగుల్ పే.. ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే బిల్స్ మీద 0.5 శాతం నుంచి 1 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి బిల్స్ చెల్లించిన యూజర్లకు ఇప్పటికే ఛార్జీలు పడినట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పులు
అదనపు ఛార్జీలు అందరికీ వర్తిస్తాయా? లేదా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. భవిష్యత్తులో తప్పకుండా అందరూ ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే?.. దీనిపై గూగుల్ పే స్పందించలేదు. అయితే గూగుల్ పే దీనిని అమలు చేస్తే.. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment