extra charges
-
స్విగ్గీ బాటలో జొమాటో - ఇకపై కస్టమర్లకు చుక్కలే..
Zomato Platform Fee Rs.2: టమాట ధరలు భారీగా పెరగడంతో నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఉల్లి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, జొమాటో ఇకపై ప్రతి ఆర్డర్ మీద రూ. 2 అదనపు ఫీజు వసూలు చేయడానికి సిద్దమైంది. కస్టమర్ బిల్లు ఎంత అనేదానికి సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్ మీద ఇకపై రూ. 2 వసూలు చేయనుంది. ఇప్పటికే ఈ విధానాన్ని స్విగ్గీ అనుసరిస్తోంది. రానున్న రోజుల్లో కంపెనీ మంచి ఆదాయం పొందటానికి ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: సీఎం చేతుల మీదుగా గోల్డ్ మెడల్.. టాటా కంపెనీలో అది ఈమెవల్లే సాధ్యమైంది! ప్రస్తుతానికి జొమాటో ఆర్డర్ మీద ఎటువంటి అదనపు ఫీజు వసూలు చేయడం లేదు. కానీ త్వరలోనే ఈ విధానం ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కాగా బ్లింకెట్ వంటి సంస్థలు కూడా ఫ్లాట్‌ఫామ్ ఫీజుని వసూలు చేయలేదు. కాగా రానున్న రోజుల్లో కంపెనీ ఎటువంటి నష్టాలను చవి చూడకూడదని, గత త్రైమాసికంలో పొందిన లాభాల మాదిరిగానే ముందుకు కొనసాగడానికి ఈ ప్రయత్నాలు చేస్తుంది. -
స్విగ్గీలో కొత్త చార్జీలు.. ప్రతి ఆర్డర్‌పైనా అదనంగా..
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కస్టమర్ల నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తోంది. విలువతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్‌కు అదనంగా రూ. 2 'ప్లాట్‌ఫామ్ ఫీజు' పేరుతో వసూలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతానికి బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఫుడ్ ఆర్డర్లపై మాత్రమే ఈ చార్జీలను స్విగ్గీ వసూలు చేస్తోంది. క్విక్-కామర్స్, ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లపై ఈ చార్జీలను ఇంకా విధించడం లేదు. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు! మరోవైపు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలలో స్విగ్గీ ఈ ఛార్జీలను ఇంకా ప్రవేశపెట్టకపోవడం గమనార్హం. గత వారంలో దశలవారీగా అమలులోకి వచ్చిన ఈ చార్జీలు ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉంది. రూ. 2 తక్కువగానే అనిపించినా స్విగ్గీ ప్రతిరోజు 1.5 మిలియన్లకు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. అంటే భారీ మొత్తంలోనే ఆదాయం వస్తుంది. ఈ మొత్తం వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి తగినంత భారీ కార్పస్‌ను సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! డెలివరీ వ్యాపారం మందగించడమే ఈ కొత్త చార్జీలు వసూలుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థిక అనిశ్ఛిత పరిస్థితులకు కంపెనీ మినహాయింపు కాదు అని 380 ఉద్యోగాల తొలగింపు సందర్భంగా స్విగ్గీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మెజెటీ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. కాగా మరో ప్రధాన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం ఇంకా ఎలాంటి ప్లాట్‌ఫామ్ ఫీజులను ప్రవేశపెట్టలేదు. ఆదాయాల పరంగా చూస్తే జొమాటో ఆదాయం రూ. 4,100 కోట్లతో పోలిస్తే స్విగ్గీ ఆదాయం దాదాపు రూ. 5,700 కోట్లుగా ఉంది. -
ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదులు... స్పందించిన సింధియా
న్యూఢిల్లీ: స్పెస్ జెట్ బోర్డింగ్ పాస్ కోసం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. దీంతో సింధియా ఫిర్యాదులను పరీశీలించేందుకు అంగికరీంచడమే కాకుండా త్వరితగతిన విచారణ చేస్తానని ట్వీట్ చేశారు. కొన్ని విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ చేయాలని పట్టుబట్టడమే కాకుండా అలా చేయడంలో విఫలమైన ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ పలువురు సోషల్ మీడియా ఫిర్యాదులు చేశారు. అంతేగాదు ఎయిర్పోర్ట్ కౌంటర్లో బోర్డింగ్ పాస్ కోసం ప్రయత్నించే వారి నుంచి కొన్ని ఎయిర్‌లైన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ కౌంటర్లో చెక్ ఇన్ చేయడానికి ఒక్కో టికెట్‌కు రూ. 200 ఖర్చవుతుందని స్పైస్‌జెట్‌తో పాటు ఇండిగో కూడా అదే పని చేసిందని వెల్లడించారు. దీని వల్ల వినియోగ దారులకు చాలా అన్యాయం జరుగుతుందంటూ ఫిర్యాదులు చేశారు. Agreed, will examine this asap! https://t.co/KkY8b0xP93 — Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 13, 2022 Ridiculous .Is @JM_Scindia listening? https://t.co/HBL8hUo4oT — Madhavan Narayanan (@madversity) May 13, 2022 new rule of SpiceJet. If you wish to get a boarding card at the check in counter,you need to pay extra. This is like telling a customer In a restaurant that if you want eat in a plate, you will be charged. Wonder what’s conssumer forum doing!@flyspicejet @BDUTT @madversity — Dr. Neeti Shikha (@neetishikha) May 13, 2022 (చదవండి: ల్యాప్‌టాప్ కీబోర్డులో పట్టుబడ్డ రూ. 1.3 కోట్ల బంగారం) -
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు చేదువార్త. ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న విత్ డ్రా, డిపాజిట్ సేవలకు జనవరి 1, 2022 నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు అందించే ఉచిత లావాదేవీల పరిమితిని అధిగమించిన తర్వాత ప్రత్యేకమైన ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఐపీపీబీ తెలిపింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రతి నెల ఉచితంగా 4 లావాదేవీలు చేయవచ్చు, ఆ తర్వాత ప్రతి విత్ డ్రా లావాదేవీకి దాని విలువలో 0.50%(కనీసం రూ.25) ఛార్జీల రూపంలో వసూలు చేయనుంది. ఈ ఖాతాదారులకు క్యాష్ డిపాజిట్ చేసుకోవడం ఉచితం. ఎలాంటి ఛార్జీలు ఉండవు. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు కాకుండా ఇతర పొదుపు ఖాతాదారులు, కరెంట్ ఖాతాదారులు నెలకు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకునే మొత్తంలో 0.50 శాతం (కనీసం రూ.25) వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఈ ఖాతాదారులు రూ.10వేల వరకు క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ రూ.10వేల మొత్తానికి పైగా డిపాజిట్ చేసుకుంటే 0.50 శాతం లేదా రూ.25 ప్రతి లావాదేవీకి ఛార్జీలు ఉంటాయి. ఈ నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. లేకుంటే ఎక్కువ విత్‌డ్రాలు చేసుకుంటే అదనంగా ఛార్జీల బదులు తప్పనిసరి ఉంటుంది. గతంలో కూడా ఉచితంగా అందిస్తున్న డోర్ స్టెప్ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తుంది. 01 ఆగస్టు 2021 నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తూ వచ్చింది. (చదవండి: మోదీ ప్రభుత్వం భారీ స్కెచ్..! వచ్చే మూడేళ్లలో..!) -
Mee Seva: ‘ఆసరా’ కోసం దర్జాగా దోచేస్తున్నారు..
సాక్షి, కరీంనగర్: ఆసరా అర్జీదారులకు వసూళ్ల బెడద తప్పడం లేదు. ఆసరా పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించగా ఆచరణలో వసూళ్ల పర్వం కొనసాగుతూ..నే ఉంది. జిల్లా అధికారులు కొలువుండే జిల్లా కేంద్రంతో పాటు మారుమూల పల్లెల్లోనూ దోపిడీ దర్జాగా సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం మొద్దునిద్రలో జోగుతుండటం అర్జీదారులకు శాపంగా మారింది. మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో అధికారులకు ఉన్న అనుబంధమే తమకీ పరిస్థితని బాధితులు వాపోతున్నారు. మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో అర్జీలను నమోదు చేస్తుండగా నిర్వాహకులు ఇష్టారీతిగా దోచుకుంటున్నారు. ఒక్కో అర్జీకి రూ.50 నుంచి రూ.వంద వరకు దర్జాగా వసూలు చేస్తున్నారు. ఇదేంటంటే మాకేమన్న జీతాలిస్తున్నారా అంటూ ఛీత్కారపు మాటలు. అధికారులేం చేస్తున్నట్టు.. ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ఎలాంటి రుసుం వసూలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. సదరు సేవలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాల్సిన మీ సేవ కేంద్రాల నిర్వాహకులు మాత్రం ఇష్టారీతిగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మీ సేవ కేంద్రాన్ని రెవెన్యూ, ఎన్ఐసీ అధికారులు ప్రతి నెలా నిర్దేశిత సంఖ్యలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. గిర్దావర్, నాయబ్ తహసీల్దార్‌తో పాటు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ తనిఖీలు నిర్వహించాలి. కానీ, కార్యాలయాల్లోనే కూర్చుని తనిఖీ చేసినట్లు మమ అనిపిస్తున్నారు. ఒకవేళ తనిఖీలే జరిగితే గరిష్ట కేంద్రాలు సీజ్ కావాల్సిందే. టోల్‌ఫ్రీ నంబర్ 1100కు ఫిర్యాదు చేయొచ్చు మీ సేవ, ఈ సేవ కేంద్రాలు ఏ కేంద్రాలైనా ఆసరా పింఛన్ల అర్జీలను ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాలి. ఒకవేళ రూపాయి అడిగినా ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో సరిౖయెన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే మీ సేవ కేంద్రాన్ని సీజ్ చేసే అవకాశముంది. ఒకవేళ సదరు అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఆర్డీవో, లేదా ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే సరి. 31 వరకు అవకాశం.. మార్గదర్శకాలివి ► 57 ఏళ్లు నిండినవారికి ఆసరా పింఛన్లు మంజూరు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. అర్హులు ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు సమయంలో ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే దరఖాస్తుదారుల తరఫున ఈ సేవ కమిషనర్‌కు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. ► జనన, మరణ నమోదు అధికారులు జారీ చేసిన పత్రం, టీసీ, పాఠశాల నుంచి బోర్డు పరీక్షలకు హాజరైన ధ్రువీకరణ పత్రం లేదా ఓటరు కార్డు లేదా ఓటర్ల జాబితా ఆధారంగా దరఖాస్తుదారు పుట్టిన తేదీని నిర్ణయించనున్నారు. ► పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలకు మించకూడదు. ఆ«ధార్ కార్డులో పేర్కొన్న విధంగా లబ్ధిదారు పేరు, పాస్‌పోర్టు ఫొటో, జిల్లా, మండలం, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్ కోడ్, బ్రాంచి, మొబైల్ నంబరు తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయడం తప్పనిసరి. ఆదాయ ధ్రువీకరణ కోసం పరుగులు ► దరఖాస్తుతో పాటు ఆదాయం, బ్యాంకు ఖాతా, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను కోరుతున్నారు. అన్ని పత్రాలు ఉన్నా ఆదాయ ధ్రువపత్రం అందరి వద్ద లేకపోవడంతో దానికోసం పరుగులు పెడుతున్నారు. ► ఆదాయ ధ్రువపత్రం పొందేందుకు రూ.10, రూ.20 విలువ ఉన్న స్టాంపు పత్రం అవసరం. కానీ జిల్లాలో ఇవి కొరత ఉండటంతో రూ.50, రూ.100 విలువ ఉన్న స్టాంపు పత్రాలను కొనాల్సి వస్తోంది. జిల్లాకేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు 20కి పైగా స్టాంప్ వెండర్లు ఉన్నారు. ► వీరివద్ద తక్కువ ధర పత్రాలు లేకపోవడంతో అధిక ధర వెచ్చించి కొనాల్సి వస్తోంది. రూ.50 విలువ గల పత్రానికి రూ.70, రూ.100 విలువ ఉన్న పత్రానికి రూ.130 వసూలు చేస్తున్నారు. ఇలా ఒక దరఖాస్తుకు రూ.200 వరకు ఖర్చవుతోందని బా«ధితులు ఏకరవు పెడుతున్నారు. పది రోజులుగా ఆధార్ సర్వర్‌డౌన్ జిల్లాలో పదిరోజులుగా ఆధార్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కారణంగా సాంకేతిక సమస్యలతో సైట్ ఓపెన్ కావడం లేదు. కేంద్రాల నిర్వాహకులు మౌజ్లతో ఎంత కుస్తీ పట్టినా చివరికి నిరాశే ఎదురవుతోంది. దీంతో రైతులు, పింఛన్ ఆశావహులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నాలుగు ఈసేవా కేంద్రాలు, మండలాల్లో 15, బ్యాంకుల్లో 65 ఆధార్‌సేవా కేంద్రాలు, మీసేవాల్లో 54 కేంద్రాల ద్వారా ఆధార్ నమోదు జరుగుతోంది. రైతుబీమాకు మూడు రోజులే అవకాశం ఉండడంతో రైతులు రోజూ మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ గడువు ముగిసిందంటే మరో సంవత్సరం వరకు వేచిచూడాల్సిందే. వృద్ధాప్య పింఛన్ వయసును 57కు కుదించడంతో దరఖాస్తు చేసేందుకు చాలామంది మీ సేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. తీరా కేంద్రానికి వెళ్లాకా ఆధార్‌లో అర్హత వయసు లేకపోవడంతో తిరుగుముఖం పడుతున్నారు. వీరికి కూడ ఈ నెల ఆఖరు చివరి తేది. సర్వర్ డౌన్ కారణంగా రాష్ట్రమంతటా ఇదే సమస్యని అధికారులు చెబుతున్నారు. వర్షన్లు చేంజ్ కావడం, మాడిఫికేషన్ అయినకొలది బేసిక్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. దీంతో సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు వివరించారు. రూ.వంద తీసుకున్నరు మా నానమ్మ ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేద్దామని కలెక్టరేట్ సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్లాను. సంబంధిత పత్రాలు తీసుకున్నారు. అయిపోయింది రూ.వంద ఇవ్వమని అడిగారు. ఇదేంటంటే మాకెమన్న ప్రభుత్వమిస్తదా.. అంటూ మాట్లాడారు. వారి ఛీత్కారపు మాటలకు తాళలేక డబ్బులిచ్చేశా. – రాజేందర్, మంకమ్మతోట దర్జాగా వసూలు చేస్తున్నారు ప్రభుత్వం ఉచితంగా దరఖాస్తులు తీసుకుసేందుకు అవకాశమిచ్చిందని మీ సేవ సెంటర్‌కు వెళ్తే దర్జాగా వసూలు చేస్తున్నారు. మా తాతది అప్లై చేద్దామని భగత్‌నగర్‌లోని మీ సేవ కేంద్రానికి వెళ్లా. సంబంధిత పత్రాలిచ్చాకా రూ.80 తీసుకున్నారు. ఇదేంటీ ఉచితం కదా అంటే.. అది పేపరోళ్లు గట్లనే రాస్తరు. వాస్తవం వేరు అన్నారు. – కరుణ, కట్టరాంపూర్ చదవండి: ఇన్స్పెక్టర్ అరెస్టు: దోపిడీ కేసులో పోలీసుల ఉదాసీనం -
ఎల్పీజీ: అదనంగా రూ. 6 కోట్లు!
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్‌పై డెలివరీ బాయ్స్ ప్రతినెలా అదనంగా ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా.? అక్షరాల రూ.6 కోట్ల పైమాటే. ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజం. ప్రతి వినియోగదారుడు సిలిండర్ రిఫిల్పై డెలివరీ బాయ్స్‌కు బిల్లుపై అదనంగా రూ.20 నుంచి రూ.30 చెల్లిస్తున్నారు. చిల్లరే కదా అనుకుని తేలిగ్గా తీసుకోవడంతో అది కాస్తా ‘తప్పనిసరి‘గా మారింది. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో గ్యాస్ బండ( సిలిండర్) వినియోగదారులకు నానాటికి భారంగా మారుతోంది. ఓ వైపు ఆరు నెలలకోసారి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతుండగా, మరో వైపు డెలివరీ బాయ్స్ డిమాండ్ చేసి మరీ అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఎల్పీజీ రీఫిల్ బుక్ చేసి ఆన్లైన్లో నిర్ణీత ధర చెల్లించినా డెలివరీ సమయంలో అదనపు బాదుడు తప్పడం లేదు. ఇక నగదు చెల్లింపు అయితే బిల్లుతో కలిపి అదనంగా రూ. 30 వరకు వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ప్రధాన ఆయిల్ కంపెనీలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసం లేదని స్పష్టం చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తే నిర్ణీత ధర రూ.746.50పైసలు అయినా నగదు రూ.770 చెల్లించాల్సిందే. అదే చేతిలో చిల్లల లేకుంటే మరో పది రూపాయిలు కూడా పెరగొచ్చు. డెలివరీ బాయ్స్ వినియోగదారుడి చేతికి బిల్లు ఇచ్చి అదనపు మోత కలిపి వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఏజెన్సీల నిర్లక్ష్యం.. ఏజెన్సీలు వినియోగదారులకు రీఫిల్ డోర్ డెలివరీ బాధ్యతలో నిర్లక్ష్యం వహించడం విస్మయానికి గురి చేస్తోంది. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, గ్యాస్, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)లతో కలుపుకొని బిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల నిర్దేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులకు సిలిండర్ సరఫరా బాధ్యతను డెలివరీ బాయ్స్‌కు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. అదనపు వసూళ్లపై డిస్ట్రిబ్యూటర్లకు ఫిర్యాదుచేసినా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. చాలీచాలని వేతనాలు.. సిలిండర్ డెలివరీ బాయ్స్‌కు చాలీచాలని వేతనాల చెల్లిస్తుండటం కూడా వినియోగదారులపై అదనపు బాదుడుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు వారికి నామమాత్రపు వేతనాలు చెల్లిస్తుండగా, మరికొందరు రీఫిల్ డెలివరీపై కమీషన్ ఇస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడం సర్వ సాధారణంగా మారింది. నిబంధనల ప్రకారం బాయ్స్ సిలిండర్‌ను డోర్ డెలివరీ చేసే సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువును వినియోగదారులకు చూపించాలి. అయితే ఈ నిబంధన ఎక్కడ కూడా అమలవుతున్న దాఖలాలు లేవు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు తప్ప బరువు చూపించాలన్న ధ్యాస లేకుండా పోయింది. నిబంధనలు ఇవీ ⇔ వినియోగదారుడు ఆన్లైన్లో గ్యాస్ రీఫిల్ బుకింగ్ చేసుకున్న తర్వాత బిల్లు జనరేట్ చేసి డోర్ డెలివరీ చేయాలి ⇔ ఏజెన్సీ నుంచి 5 కిలో మీటర్ల వరకు ఉచితంగా డోర్ డెలివరీ ఇవ్వాలి. ⇔ ఏజెన్సీ నుంచి 6 కిలో మీటర్ల నుంచి 15 కిలో మీటర్లు ఉంటే రవాణా చార్జీల పేరుతో రూ.10 వసూలు చేయవచ్చు. ⇔ 16 –30 కిలో మీటర్లు దూరం ఉంటే రవాణా చార్జీగా రూ. 15 వసూలు చేయాలి ⇔ వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి. -
నిబంధనలు మీరితే లైసెన్సుల రద్దు
గుంటూరు వెస్ట్: జిల్లాలోని బల్లకట్టు, పడవరేవుల కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలు మేరకు ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేయాలని జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవో సోమేపల్లి వెంకటసుబ్బయ్య కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా అధిక చార్జీలు వసూలు చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్లో పుట్లగూడెం, గోవిందాపురం, రామాయగూడెం బల్లకట్టు, మాదిపాడు పడవ రేవుల కాంట్రాక్టర్లు, నిర్వాహకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేపల్లి మాట్లాడుతూ నిర్ణీత రుసుం కన్నా అధికంగా వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. ధరల వివరాలు, పడవ, బల్లకట్టు కెపాసిటీ తెలియజేసేలా బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని చెప్పారు. లైసెన్సులను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో జోసఫ్‌కుమార్, బల్లకట్టు, పడవ రేవుల కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
‘ఎక్స్ట్రా ఫిట్టింగ్’పై కొరడా
♦ పలు షోరూమ్‌లకు ఆర్టీఏ నోటీసులు ♦ డీలర్షిప్ సస్పెండ్ చేస్తామని హెచ్చరిక హైదరాబాద్: ఎక్స్ట్రా ఫిట్టింగ్‌లు, హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్న ఆటోమొబైల్ షోరూమ్‌లపై ఆర్టీఏ కొరడా ఝళిపించింది. నిబంధనలకు విరుద్దంగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న పలు షోరూమ్‌లకు రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్లు, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల పై విధించిన ఫీజులకు 2 నుంచి 3 రెట్లు అధికంగా వసూలు చేయడం, వివిధ రకాల చార్జీలు, సేవలు, అదనపు హంగుల నెపంతో ఒక్కో వాహనం పైన రూ.3500 నుంచి రూ.5000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇటీవల కమిషనర్ స్వయంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కాచిగూడ, మెహదీపట్నం, తదితర ప్రాంతాల్లోని పలు షోరూమ్‌లలో అదనపు వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడికావడంతో సదరు షోరూమ్‌ల చట్టబద్దతను ప్రశ్నిస్తూ కమిషనర్ షోకాజ్ నోటీసులు అందజేశారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలను విక్రయిస్తున్న షోరూమ్‌ల డీలర్‌షిప్పులను ఎందుకు సస్పెండ్ చేయకూడదంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. -
దసరా వేళ..ప్రయాణం కిటకిట
కిక్కిరిసిన బస్సులు, రైళ్లు అదనపు చార్జీల వడ్డన ఆర్టీసీలోనూ 50 శాతం బాదుడే రెగ్యులర్ రైళ్లలో ‘ప్రీమియం’ దోపిడీ రెట్టింపు చార్జీల ‘ప్రైవేట్’ సాక్షి, సిటీబ్యూరో: మహానగరం పల్లె బాట పట్టింది. దసరా ఉత్సవాల కోసం నగర వాసులు భారీ సంఖ్యలో సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బుధవారం రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడాయి. మరోవైపు సొంత వాహనాల్లోనూ పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. బుధవారం ఒక్క రోజే 750కి ప్రత్యేక బస్సులు నడిపినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపా రు. మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లు, ఉప్ప ల్, ఎల్బీనగర్, కూకట్పల్లి, ఈసీఐఎల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లారు. మరోవైపు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టే షన్లు ప్రయాణికులతో పోటెత్తాయి. రిజర్వేషన్ బోగీలు నిండిపోవడంతో జనరల్ బోగీల్లో పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది. వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ పండుగ పూట అదనపు రైళ్లు, బోగీలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ 50 శాతం బాదుడే.. ఈ ఏడాది రద్దీ మేరకు 3,335 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టిన ఆర్టీసీ యథావిధిగా 50 శాతం అదనపు చార్జీలు విధిస్తూ ప్ర యాణికులను నిలువుదోపిడీ చేస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ మరో అడుగు ముందుకేసి రెట్టింపు చార్జీలను వసూలు చేస్తున్నాయి. ప్రత్యేక రైళ్లలో మాత్రమే ప్రీమియం చార్జీల పేరుతో ప్రయాణికులపై భారం మోపిన రైల్వేశాఖ తాజాగా ఏపీ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్ వంటి రెగ్యులర్ రైళ్లలోనూ దోపిడీకి తెరలేపింది. కాగా, బస్సుల పరిస్థితి ఇలావుంటే పేద, మధ్యతరగతి వర్గాలకు చౌకగా లభించే రైలు ప్రయాణం కూడా భారంగానే మారుతోంది. స్లీపర్ బోగీలను సైతం వదిలిపెట్టకుండా ప్రీమియం సర్వీసుల పేరుతో బెర్తుల బేరానికి పాల్పడుతున్న దక్షిణమధ్య రైల్వే ఏపీ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ఎక్స్ప్రెస్, ఫలక్‌నుమా, బెంగళూర్, పాట్నా, గోదావరి, శబరి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సైతం 50 శాతం బెర్తులపై ప్రీమియం చార్జీలు విధిస్తూ అమ్మకానికి పెట్టింది. దీంతో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు స్లీపర్ క్లాస్ చార్జి రూ.475. అయితే ప్రీమియం రైళ్లలో ఇది రూ.600తో ప్రారంభమై రూ.1200 వరకు కూడా పెరిగిపోయింది.