Zomato Starts Testing Rs 2 Platform Fee; Details Inside - Sakshi
Sakshi News home page

Zomato: స్విగ్గీ బాటలో జొమాటో - ఇకపై కస్టమర్లకు చుక్కలే..

Published Sun, Aug 6 2023 1:33 PM | Last Updated on Sun, Aug 6 2023 2:09 PM

Zomato starts testing Rs 2 platform details - Sakshi

Zomato Platform Fee Rs.2: టమాట ధరలు భారీగా పెరగడంతో నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఉల్లి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, జొమాటో ఇకపై ప్రతి ఆర్డర్ మీద రూ. 2 అదనపు ఫీజు వసూలు చేయడానికి సిద్దమైంది. కస్టమర్ బిల్లు ఎంత అనేదానికి సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్ మీద ఇకపై రూ. 2 వసూలు చేయనుంది. ఇప్పటికే ఈ విధానాన్ని స్విగ్గీ అనుసరిస్తోంది. రానున్న రోజుల్లో కంపెనీ మంచి ఆదాయం పొందటానికి ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: సీఎం చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌.. టాటా కంపెనీలో అది ఈమెవల్లే సాధ్యమైంది!

ప్రస్తుతానికి జొమాటో ఆర్డర్ మీద ఎటువంటి అదనపు ఫీజు వసూలు చేయడం లేదు. కానీ త్వరలోనే ఈ విధానం ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కాగా బ్లింకెట్ వంటి సంస్థలు కూడా ఫ్లాట్‌ఫామ్‌ ఫీజుని వసూలు చేయలేదు. కాగా రానున్న రోజుల్లో కంపెనీ ఎటువంటి నష్టాలను చవి చూడకూడదని, గత త్రైమాసికంలో పొందిన లాభాల మాదిరిగానే ముందుకు కొనసాగడానికి ఈ ప్రయత్నాలు చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement