బెంగళూరు : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీపై ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని పది రూపాయలకు పెంచింది.
దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ సందర్భంగా కస్టమర్లకు తమసర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచినట్లు యాప్‌లో పేర్కొంది.
కాగా, జొమాటో కంపెనీ 2023 ఆగస్టులో తొలిసారి ప్లాట్‌ఫామ్ ఫీజును తీసుకొచ్చింది. మొదటి ఆర్డర్‌కు రూ.2 చొప్పున వసూలు చేసింది. ఆ తర్వాత జొమాటో క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ ఫీజును రూ.10కు తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment