delevery
-
వచ్చేస్తున్నాయి.. జెప్టో కేఫ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రధాన నగరాల్లో కేఫ్ సేవలను విస్తరిస్తున్నట్టు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో తెలిపింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్టోర్లలో 120కిపైగా కేఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్టు వివరించింది. త్వరలో హైదరాబాద్, చెన్నై, పుణే నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్టు వెల్లడించింది.అధిక నాణ్యత గల ఆహార తయారీ ప్రక్రియతో 10 నిమిషాల డెలివరీని సాధ్యం చేశామని, అందుకే బలమైన కస్టమర్ స్పందనను చూస్తున్నామని కంపెనీ తెలిపింది. బ్రూయింగ్ నైపుణ్యాలను ఉపయోగించే కాఫీ మెషీన్లతో సహా కేఫ్‌ల కోసం అత్యాధునిక పరికరాలను నిశితంగా పరిశోధించి, తమ బృందం సేకరించిందని వివరించింది.ఇదీ చదవండి: జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలుచాయ్, కాఫీ, అల్పాహారం, పేస్ట్రీస్, స్నాక్స్ వంటి 148 రకాల ఉత్పత్తులను 10 నిముషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని తెలిపింది. కొత్త నగరాలకు విస్తరించడం, ప్రతి నెలా 100కుపైగా కొత్త కేఫ్‌లను ప్రారంభిస్తున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1,000 కోట్ల యాన్యువల్ రన్ రేట్ సాధిస్తామని జెప్టో సీఈవో ఆదిత్ పలీచా తెలిపారు. -
జొమాటో కస్టమర్లకు భారీ షాక్!
బెంగళూరు : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీపై ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని పది రూపాయలకు పెంచింది. దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ సందర్భంగా కస్టమర్లకు తమసర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచినట్లు యాప్‌లో పేర్కొంది. కాగా, జొమాటో కంపెనీ 2023 ఆగస్టులో తొలిసారి ప్లాట్‌ఫామ్ ఫీజును తీసుకొచ్చింది. మొదటి ఆర్డర్‌కు రూ.2 చొప్పున వసూలు చేసింది. ఆ తర్వాత జొమాటో క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ ఫీజును రూ.10కు తీసుకొచ్చింది. -
స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్..కళ్లు చెదిరేలా జీతాలు!
ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు తీరిపోనున్నాయి. వారి కష్టానికి ప్రతిఫలంగా స్విగ్గీ సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. అర్హతల్ని బట్టి సంస్థలో పని చేసే డెలివరీ బాయ్స్‌ను ఇకపై మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగాల్ని పొందేందుకు డెలివరీ బాయ్స్ కంపెనీ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చని పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద స్విగ్గీ సంస్థలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ ను మేనేజర్లుగా నియమించుకుంటుంది. వెలుగులోకి వచ్చిన ఆయా నివేదికల ప్రకారం..స్విగ్గీలో 5,6ఏళ్లుగా డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న ఉద్యోగుల్నిఅర్హతల ఆధారంగా మేనేజర్లుగా ప్రమోషన్లు ఇస్తుంది. ఇందుకోసం కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది. కళ్లు చెదిరేలా శాలరీలు గిగ్ వర్కర్లకు అధిక డిమాండ్ ఉన్న సమయంలో స్విగ్గీ నిర్ణయం చర్చాంశనీయంగా మారింది. సాధారణంగా డెలివరీ బాయ్స్‌కు నెలజీతం సగటున రూ.15,000 నుండి రూ.18వేల మధ్య ఉంటుంది. ఫెస్టివల్స్ సందర్భాలలో రూ.25,000 దాకా సంపాదించవచ్చు. అయితే ప్రస్తుతం స్విగ్గీ నిర్ణయంతో మేనేజర్లుగా బాధత్యలు చేపట్టే డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌లు కళ్లు చెదిరేలా సంవత్సరానికి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలు శాలరీలు లేదంటే డిమాండ్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ శాలరీలు ఉండొచ్చు. ఏరియా మేనేజర్ స్థాయి ఉద్యోగులకు అనుభవం ఆధారంగా జీతం సంవత్సరానికి సుమారు రూ.11 లక్షల వరకు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డెలివరీ బాయ్ నుంచి మేనేజర్ వరకు ఈ సందర్భంగా స్విగ్గీలో డెలివరీ బాయ్ నుంచి మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన బెంగళూరు ఏరియా మేనేజర్ శరత్ మాట్లాడుతూ.."డిగ్రీపూర్తి చేశా. కంప్యూటర్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వచ్చు. అర్హతకు తగ్గ జాబ్ దొరక్కపోవడంతో 2017లో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా జాయిన్ అయ్యాను. ఇటీవల స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌లను మేనేజర్లుగా నియమించుకుంటుందని తెలుసుకొని జాబ్ కోసం అప్లయ్ చేశాను. జాబ్ వచ్చింది. ఇప్పుడు డెలివరీ బాయ్ నుంచి మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చిందంటూ" మేనేజర్ శరత్ సంతోషం వ్యక్తం చేశాడు. చదవండి: ప్రాణం నిలిపిన డెలివరీ బాయ్.. సర్వత్రా హర్షం -
నొప్పుల ఇంజెక్షన్.. నోస్టాక్
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నొప్పుల ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. ప్రధానంగా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు నొప్పుల నివారణకు గాను డైక్లోఫెనక్ ఇంజెక్షన్లు ఇస్తారు. రెండు నెలలుగా ఈ టీకాల సరఫరా లేదు. కొన్నిచోట్ల ఈ ఇంజెక్షన్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రలు అందజేస్తుండగా, మరికొన్ని చోట్ల అవి కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో రోగులకు అవస్థలు తప్పటం లేదు. నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నా యి. వీటి పరిధిలో ప్రతి నెల దాదాపు 60 వేల వరకు డైక్లోఫెనక్ ఇంజెక్షన్ల వినియోగం ఉంటుంది. వినియోగాన్ని బట్టి జిల్లాకు టీకాల సరఫరా ఉంటుంది. నిజామాబాద్‌లోని గంగాస్థాన్‌లో గల సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి రెండు జిల్లాలకు మందులు సరఫరా చేస్తారు. అయితే రెండు నెలలుగా ఈ టీకాల సరఫరా నిలిచి పోయింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోజుకు 800 వరకు, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆరోగ్య కేంద్రాల్లో 200 నుంచి 300వరకు, కామారెడ్డిలో 500 వరకు డైక్లోఫెనక్ ఇంజెక్షన్ల వినియోగం ఉంటుంది. మిగతా ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ వీటి వినియోగం ఎక్కువే. ప్రస్తుతం ఈ టీకాలు అందుబాటులో లేక రోగులకు మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. నొప్పుల నివారణలో కీలకం.. డైక్లోఫెనక్ ఇంజెక్షన్‌ను ముఖ్యంగా నొప్పుల నివారణకు వినియోగిస్తారు. ప్రసవాలు, లేదా ఇతర ఆపరేషన్ అనంతరం నొప్పుల నివారణకు, అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారికి, జ్వరంతో వచ్చే నొప్పులకు కూడా ఈ డైక్లోఫెనక్ ఇంజెక్షన్లను వినియోగిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పెరుగుతున్న ప్రసవాలు, ఇతర సాధారణ శస్త్రచికిత్సలు, అత్యవసర చికిత్సల సందర్భంలో రోగులకు నొప్పుల నివారణ ఇంజెక్షన్ ఎంతో ముఖ్యం. అయితే ఈ టీకాల కొరత ఉండడంతో ప్రస్తుతం ట్రామాడండల్ ఇంజెక్షన్‌ను వినియోగిస్తున్నారు. కానీ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాలు అందుబాటులో లేవు. ఈ టీకాలకూ కొరత ఉండడంతో, వీటిని కొనుగోలు చేస్తున్నారు. రెండునెలలుగా సరఫరా లేదు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అత్యవసర శస్త్ర చికిత్సలు జరిగేటప్పుడు ప్రత్యామ్నాయంగా ఇతర ఇంజెక్షన్లు వినియోగించాలంటే కొనుగోలు చేయాల్సి వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రసవాల కోసం వచ్చే మహిళలకు నొప్పుల ఇంజెక్షన్ ఇవ్వడానికి టీకాలు అందుబాటులో లేవంటున్నారు. మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమస్య ఉండడంతో జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. త్వరలో వస్తాయి.. డైక్లోఫెనక్ ఇంజెక్షన్ల సరఫరాకు సంబంధించి ఇదివరకే అధికారులకు నివేదించాం. త్వరలోనే జిల్లాకు టీకాలు వస్తాయి. కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు సంబంధించి సరిపోయేంత ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతాం. - జైపాల్‌రెడ్డి, ఈఈ, కేంద్ర ఔషధ గిడ్డంగి, నిజామాబాద్ -
ప్రసవ సమయంలో అనెస్తెటిస్ట్లదే కీలక పాత్ర
కర్నూలు(హాస్పిటల్): క్లిష్టతర ప్రసవ సమయంలో అనెస్తెటిస్ట్లదే కీలక పాత్ర అని అమెరికాలోని బాస్టన్‌కు చెందిన మత్తు మందు వైద్యులు డాక్టర్ భవానీ శంకర్ కొడాలి చెప్పారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తీషియాలజిస్ట్్స(ఐఎస్ఏ) ఆధ్వర్యంలో మూడురోజులుగా కర్నూలులో కొనసాగుతున్న మత్తు మందు వైద్యుల రాష్ట్ర సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు డాక్టర్ భవానీ శంకర్ కొడాలి మాట్లాడుతూ క్లిష్టతర ప్రసవ సమయంలో తల్లీబిడ్డలను ఇద్దరిని ఎలా కాపాడాలనే అంశంపై చర్చించారు. కాన్పుల సమయంలో అనెస్తెషియా ఎలా ఇవ్వాలి, ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలి, ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై విపులంగా వివరించారు. అనంతరం వివిధ అంశాలపై డాక్టర్ బాలవెంకట్(కోయంబత్తూర్), డాక్టర్ మహేష్ వాకమూడి, డాక్టర్ అరుణ(చెన్నై), డాక్టర్ పంకజ్కుంద్ర(జిప్మర్)లు ఉపన్యసించారు. చివరగా ఐఏఎస్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ రాజగోపాల్(విజయవాడ)ను ఎన్నుకున్నారు. ఆయనకు ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి(కర్నూలు) బాధ్యతలను అప్పగించారు. డాక్టర్ రాజగోపాల్ వచ్చే అక్టోబర్ నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు. కార్యక్రమంలో ఐఏఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఉమామహేశ్వర్, డాక్టర్ శాంతిరాజు, మత్తు మందు వైద్యులు డాక్టర్ శివరామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.