ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు తీరిపోనున్నాయి. వారి కష్టానికి ప్రతిఫలంగా స్విగ్గీ సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. అర్హతల్ని బట్టి సంస్థలో పని చేసే డెలివరీ బాయ్స్‌ను ఇకపై మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగాల్ని పొందేందుకు డెలివరీ బాయ్స్ కంపెనీ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చని పలు రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.
పైలెట్ ప్రాజెక్ట్ కింద స్విగ్గీ సంస్థలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ ను మేనేజర్లుగా నియమించుకుంటుంది. వెలుగులోకి వచ్చిన ఆయా నివేదికల ప్రకారం..స్విగ్గీలో 5,6ఏళ్లుగా డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న ఉద్యోగుల్నిఅర్హతల ఆధారంగా మేనేజర్‌లుగా ప్రమోషన్‌లు ఇస్తుంది. ఇందుకోసం కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది.
కళ్లు చెదిరేలా శాలరీలు
గిగ్ వర్కర్లకు అధిక డిమాండ్ ఉన్న సమయంలో స్విగ్గీ నిర్ణయం చర్చాంశనీయంగా మారింది. సాధారణంగా డెలివరీ బాయ్స్‌కు నెలజీతం సగటున రూ.15,000 నుండి రూ.18వేల మధ్య ఉంటుంది. ఫెస్టివల్స్ సందర్భాలలో రూ.25,000 దాకా సంపాదించవచ్చు. అయితే ప్రస్తుతం స్విగ్గీ నిర్ణయంతో మేనేజర్‌లుగా బాధత్యలు చేపట్టే డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌లు కళ్లు చెదిరేలా సంవత్సరానికి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలు శాలరీలు లేదంటే డిమాండ్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ శాలరీలు ఉండొచ్చు. ఏరియా మేనేజర్ స్థాయి ఉద్యోగులకు అనుభవం ఆధారంగా జీతం సంవత్సరానికి సుమారు రూ.11 లక్షల వరకు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
డెలివరీ బాయ్ నుంచి మేనేజర్ వరకు
ఈ సందర్భంగా స్విగ్గీలో డెలివరీ బాయ్ నుంచి మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన బెంగళూరు ఏరియా మేనేజర్ శరత్ మాట్లాడుతూ.."డిగ్రీపూర్తి చేశా. కంప్యూటర్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వచ్చు. అర్హతకు తగ్గ జాబ్ దొరక్కపోవడంతో 2017లో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా జాయిన్ అయ్యాను. ఇటీవల స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌లను మేనేజర్‌లుగా నియమించుకుంటుందని తెలుసుకొని జాబ్ కోసం అప్లయ్ చేశాను. జాబ్ వచ్చింది. ఇప్పుడు డెలివరీ బాయ్ నుంచి మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చిందంటూ" మేనేజర్ శరత్ సంతోషం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment