ఫుడ్ ఆగ్రిగేటర్ స్విగ్గీ ఉద్యోగులకు మరో బంపరాఫర్ ప్రకటించింది. సంస్థలోనే కాకుండా బయట ఉద్యోగులకు నచ్చిన పనిచేసుకోవచ్చని తెలిపింది. తద్వారా ఆర్ధికంగా బలపడొచ్చని చెబుతోంది.
స్విగ్గీ సంస్థ ఇటీవలే ఫ్యూచర్ వర్క్ పాలసీలో భాగంగా ఉద్యోగులు శాశ్వతంగా ఎక్కడి నుంచైనా పని చేసుకునే వెసులుబాటును కల్పించింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్‌లు రిమోట్‌గా పనిచేస్తూ ఉండొచ్చని తెలిపింది. తాజాగా మూన్ లైటింగ్ పాలసీ పేరుతో మరో కొత్త పని విధానాన్ని అమలు చేసింది. ఆఫీస్ అయిపోయిన తర్వాత, లేదంటే వీకెండ్స్‌లో పనిచేసుకోవచ్చని స్విగ్గీ హెచ్ఆర్ హెడ్ గిరీష్ మీనన్ తెలిపారు.
సాధారణంగా ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగి మరో సంస్థలో పనిచేసేందుకు ఒప్పుకోవు. కానీ స్విగ్గీ మాత్రం ఆ నిబంధనల్ని సడలించింది. మా సంస్థ స్విగ్గీ ఉద్యోగుల విభిన్న ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి, వారి అవసరాలకు అనుగుణంగా విధానాన్ని మార్చేందుకు కృషి చేస్తుంది. ఈ మూన్‌లైటింగ్ పాలసీతో ఉద్యోగులు వారు చేస్తున్న రెగ్యులర్ జాబ్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. వారి అభిరుచిని కొనసాగించేలా ప్రోత్సహిస్తాం. ప్రపంచ స్థాయి 'పీపుల్ ఫస్ట్' సంస్థను నిర్మించే దిశగా మా ప్రయాణంలో మరో అడుగు పడిందని ఈ సందర్భంగా గిరీష్ మీనన్ అన్నారు
Comments
Please login to add a commentAdd a comment