ప్రసవ సమయంలో అనెస్తెటిస్ట్‌లదే కీలక పాత్ర
క్లిష్టతర ప్రసవ సమయంలో అనెస్తెటిస్ట్‌లదే కీలక పాత్ర అని అమెరికాలోని బాస్టన్‌కు చెందిన మత్తు మందు వైద్యులు డాక్టర్ భవానీ శంకర్ కొడాలి చెప్పారు.
కర్నూలు(హాస్పిటల్): క్లిష్టతర ప్రసవ సమయంలో అనెస్తెటిస్ట్‌లదే కీలక పాత్ర అని అమెరికాలోని బాస్టన్‌కు చెందిన మత్తు మందు వైద్యులు డాక్టర్ భవానీ శంకర్ కొడాలి చెప్పారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తీషియాలజిస్ట్‌్స(ఐఎస్‌ఏ) ఆధ్వర్యంలో మూడురోజులుగా కర్నూలులో కొనసాగుతున్న మత్తు మందు వైద్యుల రాష్ట్ర సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు డాక్టర్ భవానీ శంకర్ కొడాలి మాట్లాడుతూ క్లిష్టతర ప్రసవ సమయంలో తల్లీబిడ్డలను ఇద్దరిని ఎలా కాపాడాలనే అంశంపై చర్చించారు. కాన్పుల సమయంలో అనెస్తెషియా ఎలా ఇవ్వాలి, ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలి, ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై విపులంగా వివరించారు. అనంతరం వివిధ అంశాలపై డాక్టర్ బాలవెంకట్(కోయంబత్తూర్), డాక్టర్ మహేష్ వాకమూడి, డాక్టర్ అరుణ(చెన్నై), డాక్టర్ పంకజ్‌కుంద్ర(జిప్‌మర్)లు ఉపన్యసించారు. చివరగా ఐఏఎస్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ రాజగోపాల్(విజయవాడ)ను ఎన్నుకున్నారు. ఆయనకు ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి(కర్నూలు) బాధ్యతలను అప్పగించారు. డాక్టర్ రాజగోపాల్ వచ్చే అక్టోబర్ నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు. కార్యక్రమంలో ఐఏఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఉమామహేశ్వర్, డాక్టర్ శాంతిరాజు, మత్తు మందు వైద్యులు డాక్టర్ శివరామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.