
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే ముగిసిపోయాయి. పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14న మొదలై షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 శుక్రవారం వరకు జరగాల్సి ఉండగా ఒకరోజే ముందే ముగిశాయి. ఈసారి బడ్జెట్ ఆమోదంతో పాటు కీలక బిల్లులైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లులకి పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment