Parliament Adjourned
-
పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే ముగిసిపోయాయి. పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14న మొదలై షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 శుక్రవారం వరకు జరగాల్సి ఉండగా ఒకరోజే ముందే ముగిశాయి. ఈసారి బడ్జెట్ ఆమోదంతో పాటు కీలక బిల్లులైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లులకి పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. -
ఘనంగా నివాళులు అర్పించిన పార్లమెంటు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు పార్లమెంటు ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి. ముందుగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షతన సమావేశమైన రాజ్యసభలో.. జయలలిత నాయకత్వ పటిమను ప్రశంసించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆమెకు సంతాప సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ అన్సారీ ప్రకటించారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన లోక్సభ సమావేశమైంది. అక్కడ కూడా జయలలిత గుణగణాలను ప్రస్తావించిన తర్వాత ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత జయలలితకు సంతాప సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు పలువురు ఎంపీలు పార్లమెంటు వెలుపల కూడా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. జయలలిత చూపిన నాయకత్వ పటిమ అపూర్వమని, మహిళగా అనేక సవాళ్లు ఎదుర్కొని కూడా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు కూడా అమ్మను తలుచుకుని కళ్ల నీళ్లు పెట్టారు. -
జయలలిత మృతికి పార్లమెంటు నివాళి
-
పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదా
-
మళ్లీ అదే తీరు... అదే రచ్చ రచ్చ
న్యూఢిల్లీ : మళ్లీ అదే తీరు. అదే రచ్చ రచ్చ. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాల హోరు. సభలు ప్రారంభమవడమే ఆలస్యం వెంటనే వాయిదా. పార్లమెంట్ ఉభయ సభల్లో రెండో రోజు నెలకొన్న పరిణామాలివే. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల పోటా పోటీ నినాదాలతో ఉభయ సభలు అట్టుడికాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్సభ రెండంటే రెండే నిమిషాల్లో వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమైక్య నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఎంపీలు వెనక్కు తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం పార్లమెంట్ ఉభయ సభలు మళ్లీ ప్రారంభమైన తర్వాతా పరిస్థితుల్లో మార్పు రాలేదు. సీమాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. గందరగోళం మధ్యే సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్ ప్రకటన చేశారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు స్పీకర్ వెల్ లోనికి దూసుకు పోయి నినాదాలు చేశారు. సభ్యులు ఎంతకూ వెనక్కు తగ్గక పోవడంతో స్పీకర్ మీరాకుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. వెంటనే ఛైర్మన్ సభను గంట పాటు వాయిదా వేశారు. 12 గంటలకు సభ మళ్లీ మొదలైన తర్వాత కూడా సీమాంధ్ర ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. ఈ స్థితిలో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. -
ఉభయ సభలు వాయిదా
-
ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా
-
ఉభయ సభల్లో హోరెత్తిన సమైక్య నినాదాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయిన కొద్దిసేపట్లోనే వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన పార్లమెంట్ మాజీ సభ్యులకు సంతాపం తెలిపాయి. అనంతరం సభ్యుల గందరగోళం మధ్య లోక్ సభ మొదలైంది. సీమాంధ్ర ప్రాంత సభ్యుల సమైక్య నినాదాలతో సభ దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ మీరాకుమార్ సమావేశాలను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ్యుల నినాదాలు, ఆందోళన మధ్య రాజ్యసభ కూడా వాయిదా మధ్యాహ్నం వరకూ వాయిదా పడింది. అంతకు ముందు సభ్యులు ఛైర్మన్ వెల్ లోనికి దూసుకు వచ్చి నినాదాలు చేయటంతో హమీద్ అన్సారీ వారించినా ఫలితం లేకపోయింది. దాంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నేటి నుంచి 21 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 12 రైల్వే బడ్జెట్, 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు అవినీతి నిరోధక బిల్లు, మహిళా రిజర్వేషన్, మతహింస సహా పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని యూపీఏ సర్కారు భావిస్తోంది. అంతేకాకుండా కీలకమైన తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని ప్రధాని మన్మోహన్సింగ్ తెలిపారు. -
రేపటికి వాయిదా పడిన ఉభయ సభలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. ఈ రోజు ఉదయం ఉభయసభలు ప్రారంభం కాగానే... ఇటీవలి కాలంలో మృతి చెందిన మాజీ ఎంపీలకు నివాళి అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో తుపాన్ల ప్రభావంతో మృతి చెందినవారికి సంతాపసూచకంగా ఉభయ సభలు మౌనం పాటించాయి. అనంతరం రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి.