న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై లోక్‌సభలో డిసెంబర్ 14న జరిగే చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. లోక్‌సభలో శుక్రవారం, శనివారం (డిసెంబర్ 13, 14) రెండు రోజులపాటు రాజ్యాంగంపై చర్చలు జరగనున్నాయి. అటు రాజ్యసభలోనూ డిసెంబర్ 16, 17వ తేదీల్లో చర్చ జరగనుంది. డిసెంబరు 16న ఎగువ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో చర్చ జరగనుంది.
కాగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉభయసభల్లో రాజ్యాంగంపై చర్చించాలని ప్రతపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ప్రాథమిక స్థాయిలో మార్చేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో గతవారం నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో రాజ్యాంగంపై చర్చలకు అధికార, ప్రతిపక్ష లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంగీకరించాయి
Comments
Please login to add a commentAdd a comment