న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ సభ్యులకు ఈసారి డిజిటల్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్–19 ప్రొటోకాల్ దృష్ట్యా సభ్యులకు ఈసారి ముద్రిత ప్రతుల పంపిణీ ఉండదు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరం(2021–22) బడ్జెట్ కాపీలను కోవిడ్–19 వ్యాప్తి ప్రమాదం దృష్ట్యా ముద్రించడానికి బదులు ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇలాంటి పరిణామం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమం. స్వాతంత్య్ర భారతావనిలో మొట్టమొదటి సారిగా దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.7% పడిపోయిన నేపథ్యంలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. కోవిడ్ మహమ్మారితో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు వృద్ధి రేటును పెంచే చర్యలుంటాయని భావిస్తున్నారు.
కసరత్తు తప్పింది
సాధారణంగా ఆర్థిక బిల్లుతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల పద్దు, కొత్తగా విధించే పన్నులు, ఇతర చర్యల వివరాలుండే ముద్రణ ప్రతులను పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో సభ్యులకు అందజేయడం ఆనవాయితీ. ఆర్థిక బిల్లులో దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను తెలిపే వివరాలుంటాయి. భారీ సంఖ్యలో ఉండే ఈ పత్రాలన్నిటినీ పార్లమెంట్ సభ్యులకు అందజేస్తారు. ముద్రణకు ఆరంభ సూచికగా హల్వా పేరుతో వేడుక ఉంటుంది.
ఈసారి డిజిటల్ బడ్జెట్
Published Tue, Jan 12 2021 4:46 AM | Last Updated on Tue, Jan 12 2021 4:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment