parliament seccion
-
పార్లమెంట్లో అదే అలజడి.. కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల పెరుగుదల, లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు సోమవారం కూడా ఆందోళన కొనసాగించాయి. దీంతో రెండు సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టడంతో ధరల పెరుగుదలపై లోక్‌సభలో చర్చ జరిగింది. దీనిపై మంగళవారం రాజ్యసభ కూడా చర్చించనుంది. సభ గౌరవాన్ని తగ్గించొద్దు: స్పీకర్ లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. తమ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభ గౌరవాన్ని తగ్గించే పని చేయొద్దని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైనా విపక్షాలు నినాదాలు ఆపలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డారు. దాంతో సభ మధ్యాహ్నం రెండింటిదాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా అవే దృశ్యాలు కనిపించాయి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు, ఇది ఈడీ సర్కారు అంటూ కాంగ్రెస్ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. డీఎంకే, ఎన్సీపీ సభ్యులు వారికి మద్దతుగా నిలిచారు. సభలోకి ఇకపై ప్లకార్డులు తీసుకురాబోమని నలుగురు కాంగ్రెస్ ఎంపీలు హామీ ఇవ్వడంతో వారిపై సస్సెన్షన్‌ను ఎత్తేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సభ్యులను హెచ్చరించారు. సభాపతి స్థానాన్ని అగౌరవపర్చాలన్న ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల వినతిని ప్రభుత్వం వినకపోవడం వల్లే నిరసన తెలపాల్సి వస్తోందన్నారు. రాజ్యసభలోనూ అవే సీన్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టు తదితరాలపై ప్రతిపక్షాలు రాజ్యసభను స్తంభింపజేశాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఆందోళనకు దిగాయి. దాంతో సభ మధ్యాహ్నం 12 దాకా వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ్యులు శాంతించలేదు. వెల్‌లోకి చేరుకొని, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రతిపక్షాలను కోరారు. ధరల పెరుగుదలపై మంగళవారం సభలో చర్చిస్తామన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, అస్సాంలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సభలో విపక్షాల నిరసనల మధ్యే ఖాదీ, జీడీపీలో వీధి వ్యాపారుల పాత్ర, నదుల స్వచ్ఛీకరణ, అభివృద్ధిపై చర్చను చేపట్టారు. నినాదాల హోరు పెరగడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. మాంద్యానికి అవకాశం లేదు: నిర్మల భారత్‌లో ఆర్థిక మాంద్యం గానీ, ఆర్థిక మందగమనం గానీ ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చెప్పారు. ధరల పెరుగుదలపై చర్చలో ఆమె మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా మారుతోంది అని చెప్పడానికి జీఎస్టీ వసూళ్లు, కొనుగోలు సూచికే(పీఎంఐ) సాక్ష్యమని వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరేళ్ల బాలిక ప్రధాని మోదీకి రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. మోదీపై నమ్మకం ఉంది కాబట్టే లేఖ రాసిందని అన్నారు. ప్రభుత్వ చర్యలు, విధానాల వల్ల ఇటీవల వంట నూనెల ధరలు తగ్గిపోయాయని ఉద్ఘాటించారు. ఆర్థిక మంత్రి సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోక్‌సభ నుంచి కాంగ్రెస్, డీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ‘నో వన్ కిల్డ్ జెస్సికా తరహాలో దేశంలో ద్రవ్యోల్బణం లేదు’ అని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఎద్దేవా చేశారు. పచ్చి కూరగాయలు తినాల్సిందే ధరల పెరుగుదలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ లోక్‌సభలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ధరల పెరుగుదలపై చర్చ జరుగుతుండగా హఠాత్తుగా లేచి పచ్చి వంకాయను ప్రదర్శించారు. వంట గ్యాస్ ధర విపరీతంగా పెరగడంతో పచ్చి కూరగాయలు తిని కడుపు నింపుకోవాల్సిందేనంటూ వంకాయను కొరికి నిరసన వెలిబుచ్చారు. -
Parliament:రాజ్యసభ నుంచి మరో ముగ్గురి సస్పెన్షన్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభలో మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సభలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సుశీల్‌కుమార్ గుప్తా, సందీప్‌కుమార్ పాఠక్, స్వతంత్ర సభ్యుడు అజిత్‌కుమార్ భూయాన్‌ను ఈ వారమంతా బహిష్కరించారు. సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేసినందుకు గాను ఈ ముగ్గురిని సస్పెండ్ చేయాలంటూ గురువారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ నుంచి సస్పెండైన ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 23కు చేరుకుంది. -
మెట్టు దిగని విపక్షాలు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ నిఘా, కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు పట్టిన పట్టు వీడకుండా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గురువారం సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తూ నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో విపక్ష సభ్యులు హోరెత్తించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేదాకా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఉదయం ప్రారంభం కాగానే స్పీకర్ బిర్లా టోక్యో ఒలింపిక్ క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత పతకం సాధించిన భారత హాకీ జట్టుకు అభినందనలు తెలియజేశారు. పలు క్రీడల్లో పతకాలు సొంతం చేసుకున్న భారత మహిళా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. సభలో ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి చేరుకొని నినాదాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షాల నిరసన కొనసాగుతుండగానే 10 ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలను సభ్యులు అడిగారు. ప్రశ్నోత్తరాల్లో ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉందని, ఇందులో పాలుపంచుకోవాలని స్పీకర్ కోరారు. పార్లమెంట్ సభా సంప్రదాయాలను ఉల్లంఘించవద్దని సూచించారు. పార్లమెంట్ సమావేశాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని, సభ ఎందుకు సాగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు లెక్కచేయకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఢిల్లీలో దళిత బాలికపై అత్యాచారం, హత్య ఘటనను సభలో లేవనెత్తారు. దీనిపై స్పందించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత అధిర్ రంజన్ దీనిపై మళ్లీ మాట్లాడారు. దళిత బాలిక వ్యవహారంపై కాంగ్రెస్ వాదనను కేంద్ర సహాయ మంత్రి మేఘవాల్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021ను ప్రవేశపెట్టారు. ఇన్‌కం యాక్ట్ ఆఫ్ 1961, ఫైనాన్స్ యాక్ట్ ఆఫ్ 2012కు సవరణ చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఎగువ సభలో రెండు బిల్లులకు ఆమోదం తమ డిమాండ్లపై రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. పెగసస్, కొత్త సాగు చట్టాలపై సభలో చర్చించాలని పేర్కొన్నారు. వారి ఆందోళనలు, నినాదాల కారణంగా సభను సభాపతి పలుమార్లు వాయిదా వేశారు. ఒకవైపు విపక్షాల నినాదాలు కొనసాగుతుండగానే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ‘ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఆమోదించింది. ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’ను గురువారం లోక్‌సభలో ఆమోదించారు. ఈ బిల్లుపై పర్యావరణ మంత్రి భూపేందర్ రాజ్యసభలో మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వాయు కాలుష్యానికి కారణమైన వారికి సెక్షన్ 14 కింద జరిమానా విధిస్తారని, పంటల వ్యర్థాలను దహనం చేసే రైతులకు ఈ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు. ఈ బిల్లు వాయు కాలుష్యానికి సంబంధించినదని, సభలో మాత్రం శబ్ద కాలుష్యం ఉందని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. -
బడ్జెట్‌పై కాంగ్రెస్ పెడార్థాలు తీస్తోంది
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇటీవల తాము ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అపార్థాలు సృష్టిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ రహదారుల నిర్మాణం, పేదలకు పక్కా ఇళ్లు, ఉచితంగా వంటగ్యాస్, రేషన్ పంపిణీ వంటివి చేపడుతున్నా మోదీ ప్రభుత్వం ధనికులకు అనుకూల మంటున్నాయని విమర్శించారు. శుక్రవారం మంత్రి రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. కోవిడ్ మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైన తరుణంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు బడ్జెట్ ఒక ఆయుధమని ఆమె అభివర్ణించారు. ‘స్వల్పకాలిక తక్షణ పరిష్కారాలను వెదకడానికి బదులుగా ఆర్థిక వ్యవస్థపై గుణాత్మక ప్రభావం చూపే ఉద్దీపనను, గట్టి ఉద్దీపనను కల్పించేందుకు ఈ బడ్జెట్లో ప్రయత్నం జరిగింది. ఈ క్లిష్ట సమయంలో సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు స్వల్ప కాలిక చర్యలు తీసుకుంటూనే మాధ్యమిక, దీర్ఘ కాలిక స్థిరవృద్ధి సాధనకు చర్యలు ప్రకటించాం’ అని తెలిపారు. దేశంలోని పేదలు, బడుగు వర్గాలకు సాయపడేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నా, ప్రభుత్వం కొందరు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందన్న ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం ఆగడం లేదు’ అని అన్నారు. ‘మా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్కెట్‌ప్లేస్, యూపీఐలను కొందరు ధనికులు, కొందరు అల్లుళ్లే వినియోగిస్తున్నారా?’ అంటూ మంత్రి వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. బడ్జెట్లో పేర్కొన్న అంకెలపై మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అనుమానం వ్యక్తం చేయడంపై ఆమె స్పందిస్తూ..‘యూపీఏ హయాంలో అభివృద్ధి సాధించినట్లు చూపేందుకు కృత్రిమ గణాంకాలతో వ్యయాన్ని పెంచారు. సబ్సిడీని ప్రభుత్వ బడ్జెట్ నుంచి కంపెనీలకు తరలించారు. కానీ, 2021–22 బడ్జెట్లో పారదర్శకత పాటిస్తూ వ్యయ వివరాలన్నీ స్పష్టంగా పేర్కొన్నాం’అని తెలిపారు. -
ఈసారి డిజిటల్ బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ సభ్యులకు ఈసారి డిజిటల్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్–19 ప్రొటోకాల్ దృష్ట్యా సభ్యులకు ఈసారి ముద్రిత ప్రతుల పంపిణీ ఉండదు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరం(2021–22) బడ్జెట్ కాపీలను కోవిడ్–19 వ్యాప్తి ప్రమాదం దృష్ట్యా ముద్రించడానికి బదులు ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇలాంటి పరిణామం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమం. స్వాతంత్య్ర భారతావనిలో మొట్టమొదటి సారిగా దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.7% పడిపోయిన నేపథ్యంలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. కోవిడ్ మహమ్మారితో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు వృద్ధి రేటును పెంచే చర్యలుంటాయని భావిస్తున్నారు. కసరత్తు తప్పింది సాధారణంగా ఆర్థిక బిల్లుతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల పద్దు, కొత్తగా విధించే పన్నులు, ఇతర చర్యల వివరాలుండే ముద్రణ ప్రతులను పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో సభ్యులకు అందజేయడం ఆనవాయితీ. ఆర్థిక బిల్లులో దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను తెలిపే వివరాలుంటాయి. భారీ సంఖ్యలో ఉండే ఈ పత్రాలన్నిటినీ పార్లమెంట్ సభ్యులకు అందజేస్తారు. ముద్రణకు ఆరంభ సూచికగా హల్వా పేరుతో వేడుక ఉంటుంది. -
పార్లమెంట్ సమావేశాలకు చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరు అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. కాగా ఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ఈ ఏడాది ఆగస్టు 21న చిదంబరాన్నికస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. చదవండి: చిదంబరానికి బెయిల్ -
వాగ్వాదాలు.. నిరసనలు
న్యూఢిల్లీ: సీబీఐ వివాదంపై మంగళవారం కూడా పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా విపక్షాల నిరసనలతో రాజ్యసభ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపాలని లోక్‌సభలో అధికార పక్షం పట్టుబట్టగా సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభ్యులు నిరసన కొనసాగించారు. దీంతో ఇరు పక్షాల నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధంతో సభ మూడుసార్లు వాయిదాపడింది. ప్రధాన ప్రతిపక్షమైన తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. ఒకవైపు, ఇలా గందరగోళం కొనసాగుతుండగా స్పీకర్ సుమిత్రా మహాజన్ పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో నినాదాలు కొనసాగించారు. ‘అవినీతి– సంఘ వ్యతిరేక శక్తులు’ ఏకమై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయంటూ బీజేపీకి చెందిన హకుందేవ్ నారాయణ్ యాదవ్ వ్యాఖ్యానించగానే ప్రతిపక్ష సభ్యులంతా లేచి నిలబడి ఆ వ్యాఖ్యలను తొలగించాలంటూ పట్టుబట్టారు. ఇదే సమయంలో అపురూప పొద్దార్ (టీఎంసీ), వీణా దేవి(ఎల్జేపీ)లు పరస్పరం బెదిరించుకుంటూ సైగలు చేసుకోవడంతో మిగతా సభ్యులు జోక్యం చేసుకుని వారిని వారించారు. రాజ్యసభలో.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని అధికార పక్షం పట్టుబట్టగా సీబీఐని ప్రభుత్వం వాడుకోవడంపై చర్చించాలంటూ టీఎంసీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు నినాదాలతో అంతరాయం కలిగించారు. దీంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను బుధవారానికి వాయిదా వేశారు. రైతుల స్థితిగతులపై దేశవ్యాప్త సర్వే న్యూఢిల్లీ: రైతుల స్థితిగతుల వివరాలు తెలుసుకునేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా సర్వే చేపట్టనుంది. ఈ ఏడాది పంట కాలంలో రైతుల ఆదాయం, వ్యయం, రుణాలు తదితర వివరాలు సేకరించనుంది. వ్యవసాయదారుల పరిస్థితిపై 77వ రౌండ్ నేషనల్ శాంపుల్ సర్వే (ఎన్ఎస్ఎస్) కాలంలో ఆధ్యయనం నిర్వహించనున్నట్లు మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్‌సభలో రాతపూర్వకంగా తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వేను చివరిసారిగా ఎన్ఎస్ఎస్వో 2012–2013 పంట కాలానికి చేపట్టింది. కాబట్టి 2014–2018 మధ్య కాలంలో రైతుల స్థితిగతుల వివరాలు అందుబాటులో లేవని లోక్‌సభకు గజేంద్ర సింగ్ తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా, వనరుల, ఉద్యోగుల లభ్యత తదితర అంశాలను బట్టి ఈ సర్వే కాల వ్యవధి ఉంటుందని చెప్పారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన కేంద్ర మంత్రుల కమిటీ 70వ రౌండ్ ఎన్ఎస్ఎస్ అధ్యయనం డేటా వివరాలను లెక్కలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. -
శ్రీలంక పార్లమెంట్ నిర్వహణకు సెలెక్ట్ కమిటీ
కొలంబో: పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను శ్రీలంక రాజకీయ పార్టీలు అంగీకరించాయి. అక్టోబర్ 26న ప్రధాని విక్రమసింఘేను తొలగిస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయంతో ఆ దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో పార్లమెంట్లో బలపరీక్ష జరపగా..కొత్త ప్రధాని రాజపక్స అందులో ఓడిపోయారు. ఈ పరిణామం అనంతరం పార్లమెంట్ కార్యకలాపాలు గందరగోళం మధ్య సాగుతున్నాయి. సభా కార్యకలాపాలు సవ్యంగా సాగేలా చూసేందుకు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలన్న అధ్యక్షుడి ప్రతిపాదనకు సోమవారం అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే, ఇందులో ఎవరి ప్రాతినిధ్యం ఎంత ఉండాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. -
ఏమిటీ పతనం?
పార్లమెంటు సమావేశాల కాలాన్ని కుదించడం క్రమంగా ఓ దుష్ట సంప్రదాయంగా మారిపోతోంది. 1950వ దశకంలో ఏటా పార్లమెంటు సమావేశాల వ్యవధి 130 రోజులు. ప్రస్తుతం 50 నుండి 55 రోజులకు తగ్గింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంలో మన పార్ల మెంటరీ ప్రజాస్వామ్యంలో చోటు చేసుకుంటున్న అవ లక్ష ణాల గురించి మళ్లీ చర్చ మొ దలైంది. అసలు భారత్‌లో ప్రజాస్వామ్యం మనుగడ సా ద్యపడుతుందా? అని ఆదిలో శంకించిన మేధావుల అభిప్రాయాలను పూర్వపక్షం చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా అవతరించింది. స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులు ఎదురైన ప్పుడు బ్రిటిష్ వారు భారత్‌కు అమెరికా తరహా ప్రజా స్వామ్య పాలన కావాలా, బ్రిటిష తరహా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కావాలా? అనే చర్చ లేవనెత్తారు. గాం ధీజీ, నెహ్రూజీ, డా॥బాబూ రాజేంద్రప్ర సాద్ వంటి మహానుభావులు నిర్ద్వంద్వంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే సరైనదనీ, ఆదర్శప్రాయమనీ తేల్చా రు. చట్టసభలు- పార్లమెంట్ అయినా రాష్ట్రాల్లోని శాసనసభలైనా ’టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ‘గా స్థానం పొందాయి. అంతటి పవ్రితత వాటికి ఉంది. ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ప్రభుత్వాలు చట్టాల రూపక ల్పనకు ఉపక్రమించినప్పుడు ప్రతిపక్షాలు అడ్డుపడి, సవరణలు ప్రతిపాదించి ప్రజలకు మేలు చేసేవి. ప్రజ లు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుతోనే చట్టసభలు నడుస్తున్నాయన్న స్పృహ, తమకు జీతభత్యాలు లభిస్తు న్నాయన్న స్పృహ ప్రతి సభ్యునిలో కనిపించేది. అధికా రం ఉన్నంత మాత్రాన పాలకపక్షం ఏకపక్షంగా చట్టసభ ల్ని నడుపుకున్న వైఖరి చాలా ఏళ్ల పాటు కనిపించలేదు. ‘అధికార పక్షం సహనంతో ఎదుటి పక్షాలు చెప్పే విషయాలను వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ప్రజాస్వా మ్యం పరిఢవిల్లడం సాధ్యమవుతుంది’ అన్నారు మహా త్మాగాంధీ. పార్లమెంటును అధికార పార్టీ శాసించకుం డా ఉండేందుకు స్పీకర్ వ్యవస్థ రాజకీయాలకు అతీ తంగా ఉండాలని లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మవలాం కర్ ప్రతిపాదించారు. స్పీకర్ పదవికి ఎన్నికయ్యే వ్యక్తి ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయకుండా ఉం డాల న్నారు. అయితే... తొలి ప్రధాని నెహ్రూజీ మవలాంకర్ ప్రతిపాదనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని... స్పీకర్ తటస్థంగా ఉండే సంప్రదాయాన్ని కొనసాగించడం మంచిదని పేర్కొన్నారు. చాలా ఏళ్లు అలాంటి ఉన్నత సంప్రదాయాలే కొనసాగాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సఖ్యత, సౌహార్ద్రం వెల్లివిరిసిన కారణంగానే... భారత పార్లమెంటరీ ప్రజా స్వామిక వ్యవస్థను అనేక దేశాలు అబ్బురంతో చూశా యి. కానీ అన్ని వ్యవస్థలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ వ్యవస్థలో విలువల పతనం శీఘ్రంగా జరగ డంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ వేగంగా దిగ జారుతోంది. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు నానీ పాల్కీవాలా అన్నట్లు మన రాజ్యాంగ వ్యవస్థను తూట్లు పొడిచారు. ఎప్పుడైతే రాజ్యాంగ స్ఫూర్తి రాజకీయ పార్టీల్లో లోపించిందో అప్పట్నుంచి చట్టసభల తీరు మారిపోయింది. పార్లమెంటు సమావేశాల వ్యవధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని శాసించడంపై మాధవ్ గాడ్బోలే ‘ఇండియా పార్లమెంటరీ డెమోక్రసీ ఆన్ ట్రయిల్’ అనే పుస్తకంలో ‘మన రాజ్యాంగకర్తలు అప్ప ట్లో కేంద్ర ప్రభుత్వాలు ఈ అధికారాన్ని ఇంతగా దుర్వి నియోగం చేస్తాయని ఊహించలేదు’ అని రాశారు. మన పార్లమెంటు సమావేశాల కాలాన్ని కుదించడం క్రమంగా ఓ దుష్ట సంప్రదాయంగా మారిపోతోంది. 1950వ దశకంలో ఏటా పార్లమెంటు సమావేశాల వ్యవధి 130 రోజులు. ప్రస్తుతం 50 నుండి 55 రోజు లకు తగ్గింది. కావాలని సమావేశాలను అడ్డుకోవడం ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని తీవ్రమైన వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడివడింది కనుక శాసనసభ సమావేశ కాలపరిమితిని తగ్గిస్తున్నామని కొందరు మంత్రులు చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర భౌగోళిక స్వరూపం మారితే... ప్రజల సమస్యలు తగ్గిపోతాయి? ఎంతో అనుభవజ్ఞులైన అమాత్యులది అమాయకత్వం అనుకోవాలా? అజ్ఞానం అని భావించాలా? ఎప్పుడైతే ఆదర్శంగా ఉండాల్సిన పార్లమెంటు, శాసన సభల్లో ప్రభుత్వాలు పలాయనవాదం చిత్తగిస్తున్నాయో, ఆ బాటలోనే కిందిస్థాయి ప్రజాసంస్థలు ప్రయాణించడం చూస్తున్నాం. ఇక చట్టాలను రూపకల్పన చేసే వారే స్వయంగా చట్టాల్ని ఉల్లంఘించే దృశ్యాలు పార్లమెంటు మొదలు మునిసిపల్ కౌన్సిల్ వరకు సర్వసాధారణం. చర్చలు లేకుండానే బడ్జెట్ పద్దులు గిలెటిన్ కావ డం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇక ‘కాగ్’ లాంటి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు వెల్ల డించే అంశాలపై చర్చించడం అరుదైన విషయంగా మారింది. జనాభా ప్రాతిపదికన మహిళలకు, మైనార్టీ లకు, బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతి నిధ్యం లేకపోవడం ఒక ప్రధాన లోపం. ఆశ్చర్యం ఏమిటంటే కొందరు మంత్రుల సమర్థ తను వారి పనితీరును అనుసరించే కాక ప్రతిపక్షం నోరు మూయించడంలో చూపే నైపుణ్యాన్ని అనుసరించి లెక్క వేస్తున్నారు. చట్టసభల పనితీరును మెరుగుపర్చడా నికి, సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సూచనలు చేస్తూ వచ్చిన ఎన్నో నివేదికలు ప్రభుత్వాల వద్ద మూలుగుతు న్నాయి. ‘లా కమిషన్’ సూచనలు ఉన్నాయి. కానీ ఎవరు అమలు చేస్తారు? ఈ ఏడాది జూలై ఆఖరు నుంచి ఆగస్టు 13 వరకు 17 రోజుల పాటు జరిగిన పార్లమెంటు సమావేశాలలో రాజ్యసభ 48 గంటలు పని చేయవలసి ఉండగా కేవలం 9 శాతం సమయం మేరకే కార్యకలాపాలు జరిగాయి. ఒక్క బిల్లు మాత్రమే ఆమోదం పొందడం (91 శాతం సమయం వృథా) చూస్తే ఏ మేరకు మన పార్లమెంటు పని చేయగలిగిందో అర్ధమవుతోంది. ఇంతకంటే అథ మసూచిక... 2010లో జరిగిన శీతాకాల సమావేశాలలో రెండంటే రెండు (2) శాతం సమయం మాత్రమే సమా వేశాలు జరిగాయి. ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు హూగ్సె గాల్ పార్లమెంట్ వ్యవస్థను గురించి ’'Government come and Government go, but the institution of Parliament is one of those frame works that must endure and must never be taken for granted.' అన్నాడు. దీనికి అంతం ఎప్పుడు? పార్ల మెంటరీ ప్రజాస్వామ్యం ఎప్పుడు పరిఢవిల్లుతుంది? ఈ దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిన వా రు సామాన్యప్రజలే! వారే సంఘటితమై భారత పార్ల మెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవాలి! (వ్యాసకర్త: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మొబైల్: 99890 24579)