తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల చేత గురువారం ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాసన మండలిలో ఎమ్మెల్సీల సంఖ్య పరిపూర్ణం అయిందని తెలిపారు. ఇప్పుడు మండలిలో 40 మంది ఎమ్మెల్సిలు ఉన్నారని తెలిపారు.