సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉ.10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సభ ఎజెండాను రూపొందించేందుకు బీఏసీ సమావేశం కానుంది. దీని తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రూ. 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్‌లో కూడా సంక్షేమ పథకాలు, నవరత్నాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.
ఏపీ మంత్రివర్గం సమావేశంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి తొలుత ఆమోదం తెలపగగా, 2020-2021 రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2019-20 సప‍్లమెంటరీ బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్–2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో మంత్రి సుభాష్‌చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. (నవరత్నాల వెలుగులు)
ఏపీ బడ్జెట్ (2020-21) లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
- బీఏసీ సమావేశం అనంతరం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
- బీఏసీ సమావేశం అనంతరం శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
- శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు.
- కాసేపట్లో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభంకానుంది.
- రెండు రోజుల పాటు శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని మండలి బీఏసీలో నిర్ణయం.
- మండలి బీఏసీ సమావేశం ముగిసింది.
- శాసనమండలి చైర్మన్ షరీఫ్ నేతృత్వంలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు.
- ‘టీడీపీ సభ్యుల మధ్య సమన్వయలోపం కనిపించింది’ - బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
- ‘టీడీపీ ఈరోజు సభలో ద్వంద్వ విధానాన్ని అవలంభించింది. టీడీపీలో అవగాహన లోపం స్పష్టంగా కనిపించింది. అసెంబ్లీలో వాకౌట్ చేసి.. కౌన్సిల్‌లో నిరసన చేపట్టింది. గవర్నర్ ప్రసంగం కాబట్టి ఈరోజు జరిగింది ఉమ్మడి సమావేశం. టీడీపీ చేస్తే పూర్తిగా నిరసన కార్యక్రమం చేపట్టాలి. లేదంటే గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వాలి’ - విప్ సామినేని ఉదయభాను
- టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య సమన్వయ లోపం
- శాసనసభలో వాకౌట్ చేసి మండలిలో నిరసన తెలిసిన టీడీపీ
- గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ వ్యతిరేకించినట్టా స్వాగతించినట్టా అని లాబీల్లో చర్చ
- కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానం, సమావేశాల అజెండాపై చర్చించనున్నారు
- ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసింది
ఏపీ 2020-2021 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగం. ప్రసంగంలోని ప్రధానమైన అంశాలు..
- ఏడాదిలో సంక్షేమ పథకాల కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేశాం
- వివిధ పథకాల కింద 3.98 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాం
- గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధిగా నమోదయింది
- 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చాము. మరో 39 హామీలు పరిశీలనలో ఉన్నాయి
- 1060 కొత్త 108, 104 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి
- నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15337 కోట్లు కేటాయించాం
- వైఎస్సార్ రైతుభరోసా పథకం మొదటి దశ పూర్తయింది. రూ.12,500 ఇస్తామని చెప్పినప్పటికీ.. దీన్ని రూ.13,500లకు పెంచాం
- నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం
- ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీని కోసం రూ.1534 కోట్లు ఖర్చు చేశాం
- విద్యార్థులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్ద పథకం. దీనికోసం 1105 కోట్లు ఖర్చు చేశాం
- జగనన్న వసతి దీవెన కింద 18.51 లక్షల మందికి లబ్ధి. దీనికోసం 3857 కోట్లు ఖర్చు
- వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద 1.06 లక్షల మందికి లబ్ధి. దీని కోసం రూ.72.82 కోట్లు ఖర్చుచేశాం.
- వైఎస్సార్ కంటివెలుగు కింద 67.69 లక్షల మందికి లబ్ధి. దీని కోసం 53.85 కోట్లు ఖర్చు చేశాం.
- గ్రామసచివాలయాల్లో 12వేల వైఎస్సార్ క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి
- నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15,337 కోట్లు కేటాయించాం
- మొదటి దశలో 49.44 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ రూ.10,209.32 కోట్లు ఖర్చు చేశాం
- కౌలురైతులకు కూడా ప్రయోజనం కల్పిస్తూ చర్యలు చేపట్టాం
- ప్రతి గ్రామసచివాలయంలోనూ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం
- వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి నియోజకవర్గస్థాయిలో 147 వైఎస్సార్ వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేశాం
- జిల్లాస్థాయిలో 13 ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేశాం
- పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ.2వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- రూ.7వేల కోట్లతో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తున్నాం, మహిళల పేరిట ఈ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయిస్తాం
- నాలుగేళ్లలో 25 లక్షల గృహాలను సమకూరుస్తాం
- 15 లక్షల ఇళ్లకు సంబంధించి ఆగస్టులో పనులు ప్రారంభమవుతాయి
- కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
- 11,158 గ్రామ సచివాలయాలు, 3876 వార్డు సచివాలయాలున్నాయి..
- ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం 2వేల మంది అవసరాలను తీరుస్తున్నాయి..
- ఒక్కో సచివాలయంలో 10 మంది శాశ్వత సిబ్బంది, 40 మంది వాలంటీర్లు ఉన్నారు
- సున్నావడ్డీ పథకంతో 91 లక్షల మందికి ప్రయోజన చేకూరనుంది
- 45-60 మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.75వేల ఆర్ధికసాయం చేస్తున్నాం.
- రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళల సాధికారిత కోసం నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం రిజిర్వేషన్లు కల్పించాం
- 51,400 మంది ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలోకి తీసుకుంటూ ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం
ప్రాజెక్టుల గురించి..
- జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఉద్దేశించిన 54 సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో 14 ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశాం
- మిగిలిన ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయి
- ఈ ఏడాది పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండోదశ, వంశధార-నాగావళి అనుసంధానం, అవుకు రెండో సొరంగం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ది గురించి
- విద్యుత్ బకాయిలకు సంబంధించి డిస్కంలకు రూ. 17904 కోట్లు కేటాయించాం
- ఏపీఐఐసీ ద్వారా 1466పైగా కంపెనీలకు భూములు కేటాయించాం
- దీని ద్వారా 36810 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.11548 కోట్ల పెట్టుబడులు వస్తాయి
- చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం వైఎస్‌ఆర్ నవోదయ పథకాన్ని ప్రారంభించాం..
- భోగాపురం, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు పనులను వేగవంతం చేశాం
- జీఎంఆర్ సంస్థతో రూ.2,300 కోట్ల మేర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం.
- రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు కొత్త ఓడరేవుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం
- 3200 కోట్ల వ్యయంతో మూడేళ్లలో 8 చేపలు పట్టే ఓడరేవులను నిర్మిస్తాం
రివర్స్ టెండరింగ్ గురించి..
- ప్రభుత్వం స్వచ్ఛమైన మరియు అవినీతిరహితమైన పాలనకు కట్టుబడి ఉంది
- రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా చేశాం
- 100 కోట్లకుపైబడిన అన్ని టెండర్లను రిటైర్డ్ హైకోర్టు జడ్జి ద్వారా పరిశీలించబడి కమిషన్ ద్వారా ఖరారు చేయబడుతుంది.
- భూమి హక్కు గుర్తింపు చట్టం ద్వారా రిజిస్ట్రేషన్లలో అవకతవకలను భూ వివాదాలకు తావులేకుండా చేస్తున్నాం
మూడు రాజధానులపై గవర్నర్ ఏమన్నారంటే..
- పరిపాలన వికేంద్రీకరణ అనేది కీలక అంశం
- మూడు రాజధానులు ఏర్పాటు శాసన ప్రక్రియలో ఉంది
- శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది, ఆంగ్లమాధ్యమం గురించి
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాం.
- 97శాతం మంది తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకున్నారు.
- ఇందులో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పడికీ త్వరలోనే తొలగిపోతాయి.
- ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను నియంత్రించడానికి చట్టం తీసుకొచ్చాం. జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటుచేశాం.
చారిత్రాత్మకమైన దిశ బిల్లును తీసుకొచ్చాం
- మహిళలపై జరిగే నేరాలకు సత్వర విచారణ జరిపి 21 రోజుల్లో విచారణ జరిపేలా చట్టం
- 18 దిశా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేశాం
- దిశ చట్టం అమలుక ప్రత్యేక న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేస్తాం
మద్యపాన నిషేధం దిశగా అడుగులు
- దశల వారీ మద్యం నిషేధం అమల్లో భాగంగా 43వేల బెల్ట్‌షాపుల తొలగించాం. 4,300 పర్మిట్ రూమ్‌లను తొలగించాం
కరోనా, లాక్‌డౌన్, వలసకూలీల గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి..
- కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది
- కరోనా పరీక్షల నిర్వహణలో ఇతర రాష్ట్రాలకంటే ఏపీ ముందుంది
- రోజుకు దాదాపు 15వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 5.5 లక్షల పరీక్షలు పూర్తి చేశాం
- రాష్ట్రంలో మరణాల రేటు.. జాతీయ సగటు కంటే చాలా తక్కువ
- రికవరీ రేటు.. జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది
- ప్రభుత్వం టెస్టింగ్ ల్యాబ్‌లను 1 నుంచి 13కు పెంచింది
- రాష్ట్రంలో 5 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులున్నాయి
- కరోనా నివారణకు జిల్లాల్లో 65 ఆస్పత్రులు, 5,400 ఐసీయూ బెడ్స్, 38వేల ఐసోలేషన్ బెడ్స్, ఆక్సిజన్ సరఫరాతో 15వేల బెడ్స్ ఉన్నాయి.
- లాక్‌డౌన్ సమయంలో రూ.వెయ్యి ఆర్ధిక సహాయంతో పాటు ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం, కిలో పప్పు ఇచ్చాం.
- వలసకూలీల సమస్యలను పరిష్కరించేందుకు 400 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి 1.2లక్షలకు పైగా వలస కూలీలకు ఆహారం వసతి అందించాం
- ఇతర రాష్ట్రాల్ల్లో చిక్కుకున్న 3.2లక్షల వలస కార్మికులను ఉచితంగా వారి గృహాలకు చేర్చాం, ఆర్టీసీ బస్సులు , శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని సొంత గ్రామాలకు తరలించాం
- కరోనా సమయంలో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ద్వారా రూ.2,200 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు చర్యలు తీసుకున్నాం, వాలంటీర్ల ద్వారా నాలుగు విడతలుగా ఇంటించి సర్వే చేయించాం.
Comments
Please login to add a commentAdd a comment