TS Assembly: కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మనండి, కలిసి దీక్ష చేస్తాం: సీఎం రేవంత్‌ | Telangana Assembly Sessions July 24th Live Updates | Sakshi
Sakshi News home page

రెండో రోజు వాడీవేడీగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

Published Wed, Jul 24 2024 8:37 AM | Last Updated on Wed, Jul 24 2024 6:19 PM

Telangana Assembly Sessions July 24th Live Updates

Updates..

👉తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

👉 ‘కేంద్ర బడ్జెట్‌’పై తీర్మానానికి బుధవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ముందు పెట్టారు. 

కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం

కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

అసెంబ్లీలోని సభ్యులకు తీర్మానం పత్రాలను అందజేశారు. 

ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారు.

తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారు. 

గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదు.

గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది వాస్తవం: హరీష్‌ రావు

  • మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామంటే రావడానికి మేము సిద్ధం
  • ఢిల్లీలో దీక్ష చేద్దాం రమ్మంటే సిద్ధం.
  • నిరుద్యోగుల గురించి కేటీఆర్‌ దీక్ష చేయాలని సీఎం అన్నారు
  • రుణమాఫీ గురించి నన్ను దీక్ష చేయాలని సీఎం అన్నారు
  • అన్ని మేమే చేస్తే.. మీరేం చేస్తారు?
  • ఉద్యమ సమయంలో రాజీనామా చేకుండా పారిపోయింది మీరు.
  • పదవులు గడ్డిపోసలెక్క విసిరేసింది మేము

ఢిల్లీలో మంత్రులు ఆమరణ దీక్ష చేయాలన్ని కేటీఆర్‌ వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌ కౌంటర్‌

  • కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మని చెప్పండి.
  • నేను కూడా దీక్షలో కూర్చుంటా.
  • ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చుద్దాం.
  • చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చామని మేము చెప్పలేదు.
  • మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదు

కేటీఆర్‌ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్‌

  • సీఎం కూడా సీనియర్‌ సభ్యులు
  • ఆయనకు సభా వ్యవహారాలు తెలుసు
  • సభా నాయకుడికి అనుభవం లేదని కేటీఆర్‌ మాట్లాడటం సరికాదు
  • బీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్‌ విషయాన్ని వదిలేసి అన్నీ మాట్లాడారు.
  • రాష్ట్ర ప్రయోజనాల కంటే బీఆర్‌ఎస్‌కు రాజకీయ ప్రమోజనాలు ముఖ్యం

అమృత్ నిధుల అంశంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

  • అమృత స్కీం కింద వచ్చిన నిధుల గురించి మాట్లాడి అసలు విషయం డైవర్ట్ చేస్తున్నారు.
  • రాజకీయ విషయాలు కాకుండా రాష్ట్రానికి పనికొచ్చే విషయాలు మాట్లాడాలి
  • అమృత్ స్కీం కింద వచ్చిన నిధులకు టెండర్ల ప్రక్రియ సాగుతోంది - విప్ ఆది శ్రీనివాస్
  • సగం తప్పుదారి పట్టించేలాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.
  • బీజేపీ ప్రభుత్వం అయోధ్యలో ఓడిపోయింది. ఆదిశ్రీనివాస్ విప్
  • ఓటమి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు  - ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అక్కడ బిజెపి గెలిచింది .

బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌

  • కేంద్రం అమృత్ పథకం కింద 3500 కోట్లు ఇచ్చింది.
  • ఆ 3,500 కోట్లను ఎవరికి తెలియకుండా కాంగ్రెస్ మంత్రులు పంచుకున్నారు.
  • మా నియోజకవర్గానికి మూడు కోట్లు అడిగితే మంత్రులు ఇవ్వడం లేదు.
  • మంత్రుల వాళ్ల నియోజకవర్గాలు అభివృద్ధి జరిగితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్లు కాదు.
  • అమృత్ నిధులు టెండర్లు లేకుండా మంత్రులు లెక్కలేసుకొని పంచుకున్నారు

భట్టి విక్రమార్క కామెంట్స్‌..

  • కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే మంచిది.
  • బీజేపీని అంటే బీఆర్ఎస్ ఎందుకు బయపడుతోంది.

 

కేటీఆర్ కామెంట్స్‌..

  • మేము ఎవరితోనూ చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదు.
  • ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటాం.
  • కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకున్నా గత పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం.

 

మంత్రి శ్రీధర్‌ బాబు కామెంట్స్‌..

  • విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయాలి.
  • ఇప్పటికైనా సమయం మించిపోలేదు.
  • బడ్జెట్ ఆమోదం పొందడానికి ముందే సవరణలు చేయాలని కోరుతున్నాం
  • విభజన హామీల అంశాల్లో ఒక్కటి లేదు.
  • కేంద్రంపై అందరం కలిసి ఫైట్ చేద్దాం.
  • బీజేపీ తెలంగాణ ప్రజలపై వివక్ష చూపింది
  • విభజన చట్టం ప్రకారం తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు ఇవ్వాలి
  • తెలంగాణకు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చారు.
  • నిధులు రాబట్టడంలో బీజేపీ తెలంగాణ ఎంపీలు విఫలం అయ్యారు.
  • దేశంలో తెలంగాణ భాగం కాదా?
  • కేంద్రం తెలంగాణను ఎందుకు మర్చిపోయింది?
  • కేంద్రం, బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.
     

అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ మధ్య మాటల యద్ధం

కేటీఆర్‌ మాట్లాడుతూ.. 

  • కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తీర్మానం అంటుంది.
  • కానీ, మాకు తీర్మాన కాపీ రాలేదు. 
  • రేవంత్‌ రెడ్డికి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై మాట్లాడం ఇష్టం లేదనుకుంటాను

రేవంత్‌ కామెంట్స్‌..

  • కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌.
  • రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభకు ప్రతిపక్ష నాయకుడు రాలేదు.
  • సభకి వచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు భయమేస్తోంది.
  • సభ నుంచి వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.
  • బీఆర్‌ఎస్‌ ఎంత హడావిడి చేసినా సభ నుంచి బయటకు పంపొద్దు.
  • ఢిల్లీలో చీకటి ఒప్పందాలు బయటపడతాయిన బీఆర్‌ఎస్‌ భయపడుతోంది
  • తండ్రి పేరుతో తాను రాజకీయం చేయడం లేదు.
  • నేనేమీ మేనేజ్‌మెంట్‌ కోటాలో మంత్రి, ముఖ్యమంత్రి కాలేదు.

కేటీఆర్‌ కౌంటర్‌..

  • పేమెంట్‌ కోటాలో పదవులు పొందలేదు.
  • తండ్రి పేరు అంటే రాహుల్‌ గాంధీ, రాజీవ్‌ గాంధీని ముఖ్యమంత్రి అంటున్నారా? 
     

అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌ బాబు కామెంట్స్‌..

  • నిధుల కేటాయింపులో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది
  • టూరిజం డెవలప్‌మెంట్‌ అంశంలో తెలంగాణకు నిధులు నిల్.
  • నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరాం

 

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి సీతక్క ట్వీట్

  • ఇది ఎన్డీఏ బడ్జెట్, ఇండియా బడ్జెట్ కాదు
  • తనను భయపెట్టే బాబు, నితీష్ మీద మోదీ ప్రేమ కురిపించారు
  • ఏపీకి 15వేల కోట్లు, బీహార్‌కు 26 వేల కోట్లు
  • ఇది యూనియన్ బడ్జెట్ కాదు, కుర్చీ కాపాడుకునే బడ్జెట్

 

 

 👉రేవంత్‌ తీర్మానం.. 
తెలంగాణకు అన్యాయం జరిగింది అని సభలో చర్చ జరపాలని తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య కామెంట్స్‌..

  • సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతుంది
  • రుణమాఫీ చేయడంతో రైతుల కుటుంబాలు పండుగ చేసుకుంటున్నారు
  • రాహుల్ గాంధీ వరంగల్‌లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశారు
  • త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం
  • రుణమాఫీ చేసినందుకు తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
  • రుణమాఫీ చేసినందుకు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ప్రసాదం లడ్డులు అసెంబ్లీలో పంపిణీ చేసాం.
     

అసెంబ్లీ లాబీలో  హరీష్‌రావు చిట్‌చాట్‌..

  • కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదు.
  • వీహెచ్ వంటీ సీనియర్‌ నేతకు ఏ పదవి దక్కలేదు.
  • నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన కేశవరావుకు మాత్రం పదవి ఇచ్చారు.
  • మరో సీనియర్ నేత కోదండరెడ్డిని కూడా పక్కకు పెట్టారు.
  • అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది

 

అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి చిట్‌చాట్‌..

  • బీఆర్‌ఎస్‌కు సభలో మాట్లాడేందుకు వాయిస్ లేదు
  • వాయిస్ లేదు కాబట్టే ఆర్టీసీ అంశాన్ని మాట్లాడింది.
  • బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో హరీష్ రావు తప్ప వేరే లీడర్లు లేరు.
  • బీఆర్‌ఎస్‌ పార్టీ పోయి తీహార్ జైల్లో పడింది.
  • ఇక, వాళ్ల పార్టీలో ఎవ్వరూ ఉండరు.
  • కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపించింది.
  • తెలంగాణ పేరు ఎత్తకుండా సెంట్రల్ బడ్జెట్ పెట్టడం వివక్షే.
  • తెలంగాణలో బీజేపీకి మంచి గుణపాఠం చెప్తం.
  • సెంట్రల్ బడ్జెట్‌పై రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడలేక వాయిస్ పోయింది.

 

అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క చిట్‌చాట్‌​..

  • 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తో​ంది.
  • బీఆర్‌ఎస్‌ హయంలో అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారు
  • తెలంగాణ ఏర్పడిందే నియామకాల కోసం అలాంటి నియామకాలు మీద అధికారంలో ఉన్నపుడు బీఆర్‌ఎస్‌ స్పందించలేదు  
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలతో పాటు, జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాం
  • అధికారం పోయాక బీఆర్‌ఎస్‌కు నిరుద్యోగులు గుర్తుకు వచ్చి ప్రొటెస్ట్ చేయటం హాస్యాస్పదంగా ఉంది.
  • పదేళ్లుగా ఉద్యోగాల భర్తీని పట్టించుకోని బీఆర్‌ఎస్‌, జాబ్ క్యాలెండర్ కోసం డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది
  • అసెంబ్లీ పోడియంలోకి వెల్లినా, ప్లకార్డులు ప్రదర్శించినా గత ప్రభుత్వం సస్పెండ్ చేసేది
  • కానీ మా ప్రభుత్వం అలా చేయడంలేదు
  • గతంలో నిరసనలను అణగదొక్కిన బీఆర్‌ఎస్‌, ఇప్పుడు నిరసనకు దిగడం ఆశ్చర్యం
  • బీఆర్‌ఎస్‌ నిరసనలతో రాష్ట్రంలో ఎంత ప్రజాస్వామ్యం ఉందో అర్థం అవుతుంది
  • ఉద్యోగాల భర్తీలో ఉన్న చిక్కు ముడులను విప్పి నియామకాలు చేపట్టాము
  • త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం

 

గ్రూప్‌ పరీక్షలపై సభలో హరీష్‌ రావు కామెంట్స్‌..

  • జీవో-55 ప్రకారం 1:50 క్యాన్సిల్ చేసింది
  • కాస్ట్ వారీగా మేము 1:50 మేము తీసుకున్నాం.
  • కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ దాన్ని తొలగించి జీవో-29 తెచ్చింది 
  • బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు
  • సీఎం రేవంత్‌ 1:100 సాధ్యం కాదు అంటున్నారు.
  • కానీ 2006లో వైఎస్సార్‌ ఈ రేషియో ప్రకారం గ్రూప్-1 చేశారు.
  • వైఎస్‌ జగన్ గ్రూప్-2 కూడా చేశారు
  • వాళ్లకు లేని ఇబ్బంది. మీకు ఎందుకు వస్తుంది
  • గ్రూప్-2, గ్రూప్‌-3 ఉద్యోగాల సంఖ్య పెంచండి అంటున్నాము
  • ఇబ్బంది వస్తుంది అని సీఎం రేవంత్‌ అంటున్నారు.
  • కానీ మేము యాడ్ చేశాం.. మాకు రాని లీగల్ సమస్య మీకు ఎందుకు వస్తుంది
  • 2008-09లో కాంగ్రెస్ సర్కార్ పోస్టుల సంఖ్య పెంచింది
  • కానీ రేవంత్ సర్కార్‌ మాత్రం పోస్టుల సంఖ్యను పెంచడం లేదు

పలు సమస్యలపై హరీష్‌ కామెంట్స్‌..

  • ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయింది
  • రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు
  • ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం
  • ఆర్టీసీ యూనియన్ ను పునరుద్ధరణ చేయడం
  • ఇలాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదు
  • నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా రాజీనామా చేశాను
  • మేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయింది
  • మేము అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు
  • ఊసరవెల్లి సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతుంది
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయింది
  • అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది
  • గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు
  • రాష్ట్రంలో నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు
  • నిరుద్యోగులపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వడం లేదు
  • రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి
  • కాంగ్రెస్ వస్తే 25వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు

 

👉 బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కామెంట్స్‌..

  • మా నియోజకవర్గాలకు చెందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడాలంటే స్పీకర్ అవకాశం ఇవ్వలేదు
  • బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావుకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు
  • సభలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలి
  • ప్రశ్న అందరి ప్రాపర్టీ అని సీఎం అంటున్నారు కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలని కోరుతున్నాం

 

👉అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులకు టీ బ్రేక్‌..

బీఆర్‌ఎస్‌, బీజేపీ వాయిదా తీర్మానం తిరస్కరణ..

  • తెలంగాణ రాష్ట్రంలో పంటల నష్టం గురించి బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.
  • నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇతర న్యాయపరమైన డిమాండ్లపై బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.

 

వీడియో క్రెడిట్‌.. Telugu Scribe 

సీఎం రేవంత్‌ కామెంట్స్‌.. 

  • హరీష్ రావు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి.
  • హరీష్ రావుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది.
  • స్పీకర్ కుర్చీపై ఆరోపణలు చేయడం ఏ మంత్రికి తగదు.
  • ఆర్టీసీ అంశం ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య.
  • ఆర్టీసీ కార్మికుల దీక్షలు చేసి 50 మంది చనిపోయినప్పుడు.. ఆనాడు ప్రభుత్వం వివక్ష చూపింది.
  • సీపీఐ కార్మికుల కోసం కొట్లాడింది వాళ్ల కోసం మాట్లాడడానికి సీపీఐకి అవకాశం ఇచ్చారు.
  • హరీష్ రావు మాట్లాడుతుంది చట్టాలకు విరుద్ధం.
  • ఎవరు ప్రశ్న అడిగితే వాళ్లకే అవకాశం ఇవ్వాలి అన్నది రూల్‌లో లేదు
  • ప్రశ్నోత్తరాలు సభకు వస్తే అది సభ సొంతమవుతుంది.
  • సభ సభ్యులందరి ఆస్తి.
  • ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది చైర్ విచక్షణ మీద ఉంటుంది.
  • రూల్ బుక్కు గురించి బీఆర్ఎస్ అసలు విషయం తెలుసుకోవాలి.
  • గతంలో ఎమ్మెల్యే తన సీటును వదిలి పక్కకు వస్తే సభ నుంచి  సస్పెండ్ చేశారు.
  • గతంలో బీఆర్ఎస్ ఆనవాయితీలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వాళ్లు కోరుకుంటున్నారు.
  • కుటుంబం వల్ల కార్మిక సంఘాలను గత ప్రభుత్వం రద్దు చేశారు.
  • కార్మికులను కార్మిక సంఘాలను రద్దుచేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తగా బీఆర్ఎస్ బురద చల్లుతుంది.
  • హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు.
  • సభలో కొత్త సభ్యులు ఉన్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

 

👉రేపు కేబినెట్‌ భేటీ..

  • రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్ సమావేశం.
  • రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్.
  • మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
  • శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు.

 

👉మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌..

  • ఆర్టీసీ కార్మికుల గురించి హరీష్ రావు దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు.
  • కార్మిక సంఘాలను రద్దు చేసి ఆర్టీసీని చంపేశారు.
  • ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోలేదు.
  • 2013 నుంచి ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి.
  • కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విడుదల చేసాము.
  • ఆర్టీసీ ఏడువేల కోట్ల అప్పులతో బీఆర్‌ఎస్‌ మాకు అప్పగించింది.
  • మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల రెండు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది.
  • మూడు వేల ఉద్యోగాలు నియామకం చేశాము.

 

వీడియో​ క్రెడిట్‌: Telugu Scribe

  • ఓవర్ లోడ్ అవుతుంది.
  • కానీ కార్మికులకు డబుల్ పేమెంట్ జరుగుతుంది.
  • గత మూడు నెలల నుంచి ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది.
  • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను ఎండీగా పెట్టీ ఆర్టీసీని బీఆర్‌ఎస్‌ నడిపించింది.
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా అప్పగించారు
  • ఆర్టీసీకి అన్యాయం జరగకుండా భవిషత్‌లో అన్ని చర్యలు తీసుకుంటాం
  • బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత లేదు
  • రిటైర్డ్ ఈడీనీ ఆర్టీసీకి ఎందుకు ఎండీగా పెట్టిందో చెప్పాలి?

 

👉హరీష్‌రావు Vs మంత్రి శ్రీధర్‌ బాబు.. 

హరీష్‌రావు కామెంట్స్‌..

  • ప్రభుత్వం భాధ్యతారహితంగా సమాధానం చెబుతోంది.
  • ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది.
  • ఆర్టీసీ పీఆర్‌సీని ప్రభుత్వం రాగానే ఇస్తాం అన్నారు.
  • ఆర్టీసీ ఉధ్యోగులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలి.
  • 300 కోట్లు పీఆర్సీ బకాయి చెక్కులు ఫిబ్రవరిలో ఇచ్చారు.
  • ఇంతవరకు అది బస్‌భవన్‌కు చేరలేదు.
  • ఆర్టీసి ప్రభుత్వంలో  విలీనంపై ఎందుకు జాప్యం జరుగుతుంది..
  • మంత్రి పొన్నం ప్రభాకర్ జాప్యం జరగటం లేదని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు.
  • కొత్త యూనియన్లు ఎప్పటిలోగా పునరుద్దరిస్తారు.
  • ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు
  • గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాము.
  • కొత్త బస్సుల ప్రారంభం నాడు 300కోట్లు చెక్ చూపించారు
  • మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చింది ఎంత?
  • సీసీఎస్ డబ్బులు మళ్ళించి కార్మికులకు జీతాలు ఇచ్చారా లేదా?


 

👉హరీష్‌కు మంత్రి శ్రీధర్‌ బాబు కౌంటర్‌..

  • హరీష్ రావుకు క్వశ్చన్ అవర్‌లో క్వశ్చన్ అడిగాలని తెలియదా?
  • ఈ ఉపన్యాసం ఏంటి?.
  • కాంగ్రెస్ మేనిఫెస్టోను హరీష్ రావు బట్టి పట్టారు.. చాలా సంతోషం.
  • సభ్యులు ప్రశ్నలు మాత్రమే అడగండి.. ఉపన్యాసాలు వద్దు.
     

👉సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌..

  • రోడ్డు, కరెంటు లేకుండా తండాను గ్రామ పంచాయతీలు చేశారు.
  • ప్రతీ తండా నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు వేస్తాం.
  • ప్రతీ తండాకు తాగు నీటితో పాటు కరెంటు, రోడ్డు వేస్తాం.
  • ఏడు లక్షల ఇళ్ళకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు.
  • బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్తారో చెప్పండి తీసుకెళ్తాం.
  • ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదు.
  • తండాల అభివృద్ధి జరిగినప్పుడే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది.
  • సరైన రోడ్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

 

👉ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య..

  • తండా గ్రామపంచాయతీలు చెట్ల కింద ఉండి పాలన సాగుతుంది.
  • సర్పంచ్‌ల నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళించింది.
  • సర్పంచ్‌ల ఆత్మహత్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం.


ఎమ్మెల్యే వంశీకృష్ణ కామెంట్స్‌..

  • నెంబర్ కోసమే అన్ని తండాలను గ్రామపంచాయతీలు చేశారు.
  • ఒకే తండాను రెండుగా విడగొట్టి, రెండు గ్రామపంచాయతీలు చేశారు.
  • తండా గ్రామపంచాయతీల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది.


ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్‌..

  • 62 కోట్ల మంది మహిళలు ఫ్రీ ఆర్టీసీ బస్సును ఉపయోగించుకున్నారు..
  • ఫ్రీ బస్సు వల్ల దేవాలయాల వద్ద రద్దీ పెరిగింది.
  • కొత్త బస్సులు కొనుగోలు చేసి.. ఆర్టీసీ సర్వీసులు పెంచాలి.
  • రోడ్డు భధ్రత వారోత్సవాలపై మరింత అవగాహన పెంచాలి .


మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌..

  • పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా బస్సు టైమింగ్స్‌ సెట్ చేస్తున్నాం.
  • ఆర్టీసీ ప్రయాణం భధ్రత విషయంలో రాజీపడం.
  • ఆర్టీవోలు కఠినంగా వ్యవహరించాలి.

ప్రభుత్వ విప్ రాంచంద్ర నాయక్

  • గత ప్రభుత్వం ఓట్ల కోసం నామమాత్రంగా తండాలను గ్రామపంచాయతీలను చేసింది.
  • తండా గ్రామపంచాయతీలకు ఎటువంటి ఫండ్స్ లేవు.
  • ప్రస్తుతం ప్రభుత్వం ప్రతీ తండా గ్రామపంచాయతీలకు ఆఫీస్‌తో పాటు ప్రత్యేక నిధులు ఇవ్వాలి.

 

మీడియా పాయింట్‌.. 
ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్‌..

  • బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.
  • విభజన తరువాత 2 రాష్ట్రాలు చాలా నష్ట పోయాయి..
  • నిర్మల సీతారామన్ తెలంగాణలో పర్యటన సమయంలో..
  • రేషన్ షాప్‌ల దగ్గర ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదు అని డీలర్‌ను, కలెక్టర్‌ను ప్రశ్నించారు.
  • తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి, సంజయ్ వస్తారు
  • మూసీకి ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం ఎన్నో సార్లు అడిగారు
  • తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు క్షమాపణ చెప్పాలి
  • హైదరాబాద్‌లో వారిని తిరగనివ్వం.
  • ఇలాంటి ఆర్థిక మంత్రి దేశానికి ఉండటం అరిష్టం
  • విభజన చట్టంలో ఉన్న అంశాలు పరిష్కారం చేయకపోవడం బాధాకరం
  • ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోకోవాలి
  • నిన్న బడ్జెట్‌లో తెలంగాణ పేరు తీయకపోవడం విచారకరం

 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కేపీ వివేకానంద కామెంట్స్‌..

  • కేంద్ర బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీరని అన్యాయం చేసింది
  • బీఆర్ఎస్ హయాంలో కేంద్రం ఎన్నో ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్ళింది
  • దేశానికి ఆదాయం అందించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి మూడు, నాలుగు స్థానాల్లో ఉంది
  • తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం ఉండకూడదని కుట్ర చేశారు
  • కేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలకు తెరదీశారు
  • మోదీని బడే భాయ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
  • అసెంబ్లీలో చర్చ పెట్టి హామీలను నెరవేర్చకుండా కేంద్రంపై నెపంవేసే ప్రయత్నం సీఎం చేస్తున్నారు
  • తెలంగాణకు ఎలాంటి ఐఐఎం ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి సీఎంకు లేఖ రాశారు
  • తన కేసుల కోసం కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి రాజీపడ్డారు
  • బీజేపీతో కుమ్మక్కు అయ్యి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నారు.

 

👉బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి కామెంట్స్‌.. 

  • సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొట్టి రూపాయి కూడా తీసుకురాలేదు
  • తెలంగాణలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి  చెరో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు
  • తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి  16 ఎంపీ సీట్లు ఇస్తే ఎన్ని వేల కోట్లు వచ్చే అవకాశం ఉండేదో ఆలోచించండి
  • ఏపీకి 15 వేల కోట్లు ఇచ్చారు
  • తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డ్రామాలు బంద్ చేయాలి
  • తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తాము
  • రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడ చేశారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి

 

👉నేడు రెండో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు సదరు మంత్రులు సమాధానం చెబుతారు.

👉షార్ట్ డిస్కషన్ కింద కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ను ప్రభుత్వం కోరనుంది. ఈ క్రమంలో స్పీకర్ అనుమతి ఇస్తే కేంద్ర బడ్జెట్‌పై సభలో​ చర్చ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం.. సభలో తీర్మానం చేయనుంది.

👉మరోవైపు.. గోదావరి పరివాహక ప్రాంతంలో పంట నష్టంపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు.

నేడు అసెంబ్లీలో ఇలా..

1) ప్రశ్నోత్తరాలు .

2) ప్రభుత్వ రిజల్యూషన్

3) నిన్న బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు ఉభయసభల్లో టేబుల్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.

4) వివిధ శాఖల్లో యాన్యువల్ రిపోర్టులను ఉభయ సభల్లో టేబుల్ చేస్తారు.

ఇదిలా ఉండగా..

1. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నార్తన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ 23వ వార్షిక రిపోర్టును సభలో ప్రవేశపెడతారు.

2. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ యాన్యువల్ రిపోర్టును విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు.

3. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెడతారు.

4. ఇటీవల దివంగతులైన మాజీ శాసనసభ్యులు డాక్టర్ నెమురు గొమ్ముల సుధాకర్ రావు, మహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్, ధర్మపురి శ్రీనివాస్, రమేష్ రాథోడ్‌లకు సభలో సంతాపం వ్యక్తం చేయనున్నారు.

5. శాసనసభలో స్వల్పకాలిక చర్చ(యాక్టివిటీస్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ మెట్రో సిటీ).

శాసనసభలో చర్చకు వచ్చే ప్రశ్నోత్తరాలు..

1.పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్‌నెస్‌ తనిఖీలు.

2.తండాలు గ్రామపంచాయతీలుగా ఉన్నతీకరణ

3.ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు.

4.వాణిజ్య పనుల శాఖలో అవకతవకలు.

5.నిజామాబాద్ పట్టణ శాసనసభ నియోజకవర్గంలో క్రీడా సముదాయం.

6.తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐటీ ఏర్పాటు.

7.ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లింపు.

8.రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.

9.జాతీయ రహదారి విస్తరణ పనులు.

10.మూసీ నదికి ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ చెరువుల అనుసంధానం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement