తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. పవర్‌పై వాడీవేడి చర్చ | Telangana Assembly Sessions 29th July Live Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్‌ అప్‌డేట్స్‌

Published Mon, Jul 29 2024 9:09 AM | Last Updated on Mon, Jul 29 2024 12:51 PM

Telangana Assembly Sessions 29th July Live Updates

Updates..

 సీఎం రేవంత్‌ కామెంట్స్‌..

  • కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.
  • ఇలా మాట్లాడితే ప్రాసిక్యూలేషన్ చేయాల్సి వస్తుంది.
  • కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
  • విచారణ ఆపాలని కోర్టు చెప్పలేదు. 
  •  2021లో పూర్తి చేస్తామని బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకున్నారు.
  • ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు.
  • రూ.81వేల కోట్లు అప్పులకు కారణమయ్యారు.
  • నల్లగొండ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.
  • పార్లమెంట్‌ ఎన్నికల్లోనే మీ సంగతి తేలిపోయింది.
  • పవర్‌ ప్లాంట్‌ పేరుతో దోచుకున్నారు. 

     

👉మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి కామెంట్స్‌..

  • మీరు ఫ్లోరోసిన్‌ను మాకు బహుమతిగా ఇచ్చారు.
  • బీహెచ్‌ఈఎల్‌కు కాంట్రాక్ట్‌ ఇస్తే తప్పేంటి?.
  • పవర్‌ ప్లాంట్‌ నల్లగొండలో కడితే తప్పు.. వేరే చోట కడితే తప్పా?.
  • సూపర్‌ క్రిటికల్‌లో అయితే నాలుగేళ్లలో భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ పూర్తి చేస్తామని బీహెచ్‌ఈఎల్‌ చెప్పింది.
  • బీహెచ్‌ఈఎల్‌ సబ్‌ కాంట్రాక్ట్‌ల్లో మా బంధువు ఒక్కరు కూడా లేరు.
  • మీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కూడా కరెంట్‌ పోయిందని అధికారులకు ఫోన్‌ చేశారు.
  • నల్లగొండ తెలంగాణలో లేదా?.
  • కరెంట్‌ లేదని హెల్ఫ్‌లైన్‌కు ఫోన్‌ చేస్తే కేసులు పెడుతున్నారు.
  • దానిపై ఎందుకు మాట్లాడటం లేదు?.
  • జీవన్‌ రెడ్డిపై కూడా కేసు పెడతారా?.

 

👉గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాపై మూడు మర్డర్ కేసులు పెట్టారు - జగదీష్ రెడ్డి

👉మూడు మర్డర్ కేసుల్లో కోర్టు నిర్దోషిగా తీర్చి కేసులను కొట్టివేసింది - జగదీష్ రెడ్డి.

👉మంత్రి కోమటిరెడ్డి నాపై రెండు మర్డర్ కేసుల ఆరోపణలు చేశారు - జగదీష్ రెడ్డి.

👉ఆ మర్డర్ కేసులో అంశంపై హౌస్ కమిటీ వేయాలని కోరుతున్నా - జగదీష్ రెడ్డి.

👉హౌస్ కమిటీ వేసి నిజా నిజాలు తేల్చాలి - జగదీష్ రెడ్డి.

👉హౌస్ కమిటీ ద్వారా నిజాలు తేలుతాయి అప్పుడు రాజీనామా వాళ్లు చేస్తారా నేను చేస్తానా అనేది తెలుస్తుంది.

👉నేను ఉద్యమంలో పనిచేశాను ఆ కేసులు ఉన్నాయి.. వాళ్ల లాగా సంచులు మోసిన జీవితం నాది కాదు. - జగదీష్ రెడ్డి

👉సంచులు మోసి జైలుకుపోయిన జీవితం నాది కాదు. జగదీష్ రెడ్డి

👉రికార్డుల నుంచి తొలగించాలి అంటే ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలను సైతం తొలగించాలి. - జగదీష్ రెడ్డి.

 

👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పై వ్యాఖ్యల  మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

👉మర్డర్ కేసులో జైశ్వర్ రెడ్డి ఉన్నారు - కోమటి రెడ్డి

👉ఏడాది పాటు జగదీష్ రెడ్డిని జిల్లా బహిష్కరించింది - మంత్రి.

👉కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు - జగదీష్ రెడ్డి.

👉కోమటిరెడ్డి చెప్పినట్లుగా నా పై కేసులు ఉన్నట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. - జగదీష్ రెడ్డి

👉నిరూపించకపోతే ముఖ్యమంత్రి కోమటిరెడ్డి ఇద్దరు రాజీనామా చేసి ముక్కు నేలకు రాయాలి. - జగదీష్ రెడ్డి

👉జగదీష్ రెడ్డి సవాలను స్వీకరిస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

👉కేసులో రికార్డులు బయటపెడతా... లేకపోతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా - కోమటి రెడ్డి వెంకట్ రెడ్

 

👉సీఎం రేవంత్‌కు జగదీష్‌ రెడ్డి కౌంటర్‌..

👉చర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాలను రేవంత్‌​ గుర్తు చేసుకుంటున్నారు.

👉మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాను.

👉జగదీష్‌ రెడ్డి సూర్యాపేట రైస్‌ మిల్లులో దొంగతనం చేసింది మర్చిపోయాడు.

👉మర్డర్‌  కేసులో జగదీష్‌ రెడ్డి ఏ-2: మంత్రి కోమటిరెడ్డి

👉మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు.

👉రాంరెడ్డి హత్య కేసులో ఏ-6

👉లక్షా 80వేల దొంగతనం కేసులో ముద్దాయి జగదీష్‌ రెడ్డి.

👉నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. సభలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతాను.

👉జగదీష్‌ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను.

👉నేను చెప్పిన కేసులో జగదీష్‌ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడు.

👉కోమటిరెడ్డి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. 

 

సీఎం రేవంత్‌ సీరియస్‌ కామెంట్స్‌.. 

  • సభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..
  • కరెంట్‌ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేయమని అడిగింది మీరే.
  • సత్యహరిశ్చంద్రుడు మా నాయకుడి రూపంలో పుట్టారన్నట్టు మాట్లాడారు.
  • జ్యుడీషియల్‌ కమిషన్‌ ముందుకెళ్లి మీ వాదన వినిపించి ఉంటే మీ నిజాయితీ తెలిసేది.
  • కానీ, మీరు కమిషన్‌ విచారణే వద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.
  • కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.
  • విచారణ కొనసాగించాల్సిదేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.
  • కమిషన్‌ ఛైర్మన్‌ను మాత్రమే మార్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.
  • సాయంత్రంలోగా విద్యుత్‌ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ పేరును ప్రకటిస్తాం.
  • తెలంగాణను సంక్షోభం నుంచి కాపాడింది సోనియా గాంధీ, జైపాల్‌ రెడ్డి మాత్రమే.
  • సోనియా గాంధీ దయ వల్ల రాష్ట్రం కరెంట్‌ సమస్య నుంచి గట్టెక్కింది.
  • లేనిపక్షంలో తెలంగాణ చీకటిమయమయ్యేది.
  • నాడు నేను టీడీపీలో ఉన్నా అసెంబ్లీలో వాస్తవాలు చెప్పాను.  
  • దీంతో, నన్నుమార్షల్స్‌ను పెట్టి బయటకు ఇడ్చుకెళ్లారు.  
  • సోలార్‌ పవర్‌లో ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. దీంతో, కరెంట్‌ ఉత్పత్తి పెరిగింది. 
  • సిగ్గులేకుండా ఇంకా మేము విద్యుత్‌ ఉత్పత్తి చేశామని చెప్పుకుంటున్నారు.
  • బీహెచ్‌ఈఎల్‌ నుంచి సివిల్‌ వర్క్‌లు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చారు.
  • ఆఖరికి అటెండర్‌ పోస్టులు కూడా వాళ్ల బినామీలకే ఇచ్చారు.
  • ఈ సందర్భంగా వాళ్లకు కావాల్సిన వాళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇక్కడే
  • విచారణ అంటే భయపడి కోర్టుకు వెళ్లారు.
  • టెండర్‌ ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇంకా విద్యుత్‌ ఉత్పత్తి కాలేదు.
  • ఇండియా బుల్స్‌ నుంచి రూ.1000 కోట్లు దండుకున్నారు.
  • భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ ఇప్పటికీ నీళ్లలో మునిగిపోతోంది. 

 

👉అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. 

👉ఇప్పటి వరకు డిమాండ్‌ బుక్స్‌ ఇవ్వలేదన్న జగదీష్‌ రెడ్డి.

👉రాత్రే పంపించామన్న స్పీకర్‌

👉దేనిపై మాట్లాడాలో అర్థం కావడం లేదు: జగదీష్‌ రెడ్డి.

👉పదేళ్లలో రేపు రాత్రి 10 గంటలకు వచ్చి మాట్లాడే వాళ్లు: శ్రీధర్‌ బాబు

👉హరీష్‌ రావు బుల్డోడ్‌ చేసేపని పెట్టుకున్నారు. ఇది మానుకోవాలి: శ్రీధర్‌ బాబు

👉మీరు త్వరగా ఇంటికి వెళ్తే మేమేం చేస్తాం: మంత్రి శ్రీధర్‌ బాబు. 

👉పది రోజుల ముందే సభ పెడితే ఏమయ్యేది: జగదీష్‌ రెడ్డి.

👉ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సమంజసమేనా?.

👉మీటర్ల విషయంలో సీఎం రేవంత్‌ సభను తప్పుదోవ పట్టించారు.

👉కరెంట్‌ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.

👉ఉదయ్‌ స్కీమ్‌లో 27 రాష్ట్రాలు చేరాయి.

👉ఒప్పందంలో వాళ్లకు అనుకూలమైన అంశాలను మాత్రమే చెప్పారు.

👉స్మార్ట్‌ మీటర్లతో డిస్కంలు చేరాయి. మీటర్ల విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. 

 

👉అసెంబ్లీలో విద్యుత్‌పై చర్చ.. ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కామెంట్స్‌

  • గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. 
  • అందుకే పవర్ సెక్టార్‌ గందరగోళంగా మారింది. 
  • రైతులకు ఉచిత కరెంట్‌ తెచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. 
  • విద్యుత్‌ రంగం అస్తవ్యస్తమైంది. 
  • యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వల్ల 1800 మెగావాట్ల అదనపు కరెంట్‌ రాష్ట్రానికి వచ్చింది. 
  • కేసీఆర్‌ ఎందుకు రాలేదంటే, మీ స్థాయికి మేము చాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అంటున్నారు. 
  • ఇంత పెద్ద విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్‌ సభకు రాలేదు. 
  • మీ స్థాయి ఏంటో ప్రజలు మీకు చెప్పారు.
  • కనీసం అధికారులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. 
  • చేసిన తప్పులు చాలవని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
  • సభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు?.
  • విద్యుత్‌ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.
  • ఉచిత కరెంట్‌ ఇచ్చామని బీఆర్‌ఎస్‌ గొప్పలు చెప్పుకుంటోంది.
  • ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.
  • విద్యుత్‌ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.
  • ఉచిత కరెంట్‌ ఇచ్చామని బీఆర్‌ఎస్‌ గొప్పలు చెప్పుకుంటోంది.
  • ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.
  • గనులకు 250 కి.మీలకు దూరం ఉన్న దామెరచెర్ల దగ్గర పవర్‌ ప్లాంట్‌ ఎందుకు పెట్టారు?.
  • యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.
  • పవర్‌ ప్లాంట్‌లో టెండర్‌ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. 
     

 

👉విద్యుత్ మీటర్ల అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్.

  • సీఎం రేవంత్ రెడ్డి మాపై బురద జల్లే ప్రయత్నం చేశారని దీనిపై చర్చకు సిద్దమంటున్న బీఆర్ఎస్.
  • హోం శాఖ, మెడికల్ అండ్ హెల్త్‌పై మాట్లాడనున్న - మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
  • ఎడ్యుకేషన్ పై చర్చపై మాట్లాడనున్న- ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డి.
  • ఎక్సైజ్ , ట్రాన్స్ పోర్ట్ చర్చపై మాట్లాడనున్న - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
  • విద్యుత్ చర్చ పై మాట్లాడనున్న -  మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
  • ఎం అండ్‌యూడీ, ఐటీ మున్సిపల్ చర్చపై మాట్లాడనున్న - ఎమ్మేల్యే వివేకా నంద గౌడ్.

 

👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ఐదో రోజు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, నేడు ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌పైనే చర్చించనున్నారు.

👉మరోవైపు.. నేడు సభలో 19 పద్దులపై శాసనసభలో చర్చ ఉండనుంది. ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్‌ డిమాండ్లపై, మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్  డెవలప్మెంట్, ఎంఏయూడీలపై చర్చ జరుగుతుంది.

పరిశ్రమల శాఖ పద్దులపై చర్చ..
👉ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్‌పై కూడా చర్చించనున్నారు. 19 పద్దులపై చర్చించిన తర్వాత వాటికి శాసనసభ ఆమోదం తెలుపనుంది. ఇక, ముఖ్యమంత్రి వద్దనే  మున్సిపల్, విద్యాశాఖ, హోం  శాఖ ఉన్న విషయం తెలిసిందే.

👉మోటర్లకు మీటర్లు పెట్టేందుకు 2017లోనే ఉదయ్ స్కీంలో గత ప్రభుత్వం సంతకం చేసిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఉదయ్ స్కీంపై సంతకం చేయ్యలేదని, మీటర్లు పెట్టలేదు బీఆర్‌ఎస్‌ చెబుతోంది. దీనిపై కూడా సభలో చర్చ జరుగనుంది. ఇదిలాఉండగా.. అసెంబ్లీలో పోడు భూముల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement