తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అప్‌డేట్స్
గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం
- గత ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పింది
- రైతులను రారాజు చేస్తామని చెప్పి మోసం చేసింది.
- వడ్లు వేయాలని చెప్పి.. కొనుగోళ్లు మాత్రమే చెయ్యలేదు.
- పత్తి వేయొద్దని.. గత ప్రభుత్వం చెప్పింది..అదే ఏడాది పత్తి రేట్లు భారీగా పెరిగింది
నిన్న 18 గంటలు...19 పద్దుల పై చర్చ జరిగింది: స్పీకర్ గడ్డం ప్రసాద్
- పద్దుల పై వరుసగా ఒకేసారి సభ్యులు మాట్లాడాలి
- సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వరుసగా అన్ని పద్దుల పై మాట్లాడాలి
- సభ సజావుగా జరిగేందుకు నిన్న అందరూ సహకరించారు.
- ఇవాళ సైతం 19 పద్దుల పై చర్చ జరగాలి.. సభ్యులు సహకరించాలి
ప్రారంభమైన తెలంగాణ శాసన సభ
- ఆరో రోజు శాసన సభ సమావేశాలు
- ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసిన సభ
- స్కిల్ యూనివర్సిటీ పై మొదలైన చర్చ
- స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
అసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమం..
వ్యవసాయ ఉత్పత్తులతో వేధికను అలంకరించిన వ్యవసాయ శాఖ
లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం 6 వేల 191 కోట్ల నిధులు కేటాయింపు
రెండో విడుత నిధులు విడుదల చేయనున సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క
17 మంది రైతులకు రుణమాఫీ చెక్కు లను అందజేయనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో ఆరో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదో రోజు(సోమవారం) 17 గంటలకు పైగా జరిగిన శాసనసభ.. వేకువ జామున 3 గంటలల వరకు కొనసాగింది. 19 పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్శిటీ బిల్లు రానుంది. మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. నేడు అసెంబ్లీ వేదికగా రూ.లక్షన్నర రుణాల వరకు మాఫీ ప్రకటన చేయనున్నారు.
తెలంగాణ శాసనసభ మూడో విడత సమావేశాల్లో ఐదోరోజు 2024–25 వార్షిక బడ్జెట్ పద్దులపై సోమ వారం సుదీర్ఘ చర్చ జరిగింది. సమయపాలన పాటించి డిమాండ్లకు పరిమితమై మాట్లాడాల్సిందిగా స్పీకర్ సభ ప్రారంభమైన వెంటనే కోరారు. డిమాండ్లపై చర్చకు సంబంధించి ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలపాటు సమయం కేటాయిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
మధ్యాహ్నం మూడు గంటల వరకు చర్చ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రశ్నోత్తరాలు లేకుండానే సోమవారం ఉదయం 19 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే నేరుగా పద్దులపై చర్చ ప్రారంభమైంది. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 19 పద్దులను సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించారు.
అయితే సభ్యులు తమకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ సేపు ప్రసంగించడం, ఒకేరోజు 19 పద్దులను చర్చించి ఆమోదించాల్సి ఉండటంతో సోమవారం అర్ధరాత్రి దాటినా చర్చ కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment