సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మా గొంతు నొక్కుతున్నారని.. ఏ పార్టీకి ఎంత సమయం ఇచ్చారో లెక్కలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం సభను తప్పుదోవ పట్టించే విధంగా ప్రసంగం చేశారని.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు చేసే ప్రకటనలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని హితవు పలికారు.
‘‘ఉదయ్ స్కీం వల్ల కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు గతంలో మాకు ఇస్తామన్న మేము ఒప్పుకోలేదు. వ్యవసాయ బోర్డు దగ్గర మీటర్లు పెట్టకూడదని 30 వేల కోట్ల రూపాయలను వదులుకున్నాం. వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు కాకుండా.. పాత మీటర్ల చోట కొత్త మీటర్ల అంశం అందులో ఉంది. వ్యవసాయ భూములు మీటర్లు ప్రైవేటుపరం చేయకూడదని మేము కేంద్రం పెట్టిన నిబంధనలకు ఒప్పుకోలేదు. కేంద్రం పెట్టిన నిబంధనలకు మేము ఒప్పుకుంటే ప్రతి ఏడాది 5000 కోట్లు మొత్తం ఐదేళ్లు 30 వేల కోట్లు వచ్చేవి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.
హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం
హరీష్ రావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టదు. తలకిందులుగా తపస్సు చేసిన రైతులకు అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment