
దేవేంద్రిని పేడలో పూడ్చిపెట్టిన దృశ్యం
బులంద్‌షార్, ఉత్తరప్రదేశ్ : పాము కాటుకు గురైన మహిళను కాపాడేందుకు ఆవు పేడలో పూడ్చి పెట్టిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వంట చెరకు కోసం పుల్లలకు వెళ్లిన దేవేంద్రీ(35) అనే మహిళను నాగుపాము కాటేసింది. దీంతో ఆమె భర్త స్థానిక మంత్రగాడికి కబురు పెట్టాడు.
హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న మంత్రగాడు బాధితురాలిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆవు పేడలో మహిళను కప్పివుంచితే అది విషాన్ని లాగేస్తుందని చెప్పడంతో గ్రామస్థులు అందుకు ఏర్పాటు చేశారు. దేవేంద్రీ శరీరాన్ని 75 నిమిషాల పాటు ఆవు పేడతో కప్పిపెట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
దేవేంద్రీకి ఐదుగురు పిల్లలు ఉన్నారు. మంత్రగాడి మాటలు నమ్మినందుకు తన భార్య ప్రాణాలు కోల్పోవాల్సివచ్చిందని భర్త కన్నీరుమున్నీరు అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment