గుజరాత్ కోర్టు గో హత్యపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కోర్టు అక్రమంగా పశువులను రవాణా చేసిన వ్యక్తి కేసును విచారిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది. గో హత్య నిలిపేస్తే భూమిపై ఉన్న అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా కోర్టు జడ్జి పేర్కొన్నారు. సదరు వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తూ న్యాయమూర్తి ఈ విషయాలను వెల్లడించారు.
ఈ మేరకు న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆవుపేడతో చేసిన ఇళ్లు రేడియోషిన్‌కి గురికావని సైన్స్ రుజువు చేసింది. గోమూత్రం అనేక నయం చేయలేని వ్యాధులకు మందు. ఆవు ఒక జంతువు మాత్రమే కాదని, 68 కోట్ల పవిత్ర స్థలాలకు, 33 కోట్ల దేవతలకు నిలయమని అన్నారు. అందుకు సంబంధించిన శ్లోకాలను ప్రస్తావిస్తూ..ఆవులను హింసిస్తే మన సంపద, ఆస్తులు నశిస్తాయని చెప్పారు.
ప్రస్తుత రోజుల్లో ప్రజలకు కోపం, ఆవేశం వంటివి పెరిగిపోవడానికి గోవధే కారణం. దీనిని పూర్తిగా నిషేధించే వరకు వాతావరణం మార్పులకు(కాలుష్యానికి) గురికాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సదరు వ్యక్తిని గతేడాది ఆగస్టులో 16 ఆవులు అక్రమంగా రవాణ చేయడంపై అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించడమే గాక సుమారు రూ. 5 లక్షల జరిమాన విధించింది.
(చదవండి: 76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్..ధర ఎంతో తెలుసా!)
.
Comments
Please login to add a commentAdd a comment