
అసెంబ్లీలోకి గుట్కాలు తెచ్చారంటూ....
చెన్నైః డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, విపక్ష నేత ఎంకే స్టాలిన్‌కు తమిళనాడు అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. నిషేధిత గుట్కాను జులై 19న సభలోకి తీసుకువచ్చినందుకు స్టాలిన్ సహా 20 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.గుట్కా విక్రయాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తూ స్టాలిన్ సభలో గుట్కాలను ప్రదర్శించారు. అయితే నిషేధిత వస్తువును అసెంబ్లీ ప్రాంగణంలోకి తీసుకురావడం, ప్రదర్శించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పీకర్ పీ ధన్‌పాల్ రూలింగ్ ఇస్తూ సభా హక్కుల కమిటీకి ఈ అంశాన్ని నివేదించారు.
దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలని స్టాలిన్ సహా 20 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. గుట్కాలు మార్కెట్‌లో ఎంత సులభంగా లభిస్తున్నాయో వెల్లడించేందుకే తామలా చేశామని డీఎంకే ఎమ్మెల్యేలు చెబుతున్నారు.