T Rajendar Health Condition: Actor T Rajendar Went America for Further Treatment - Sakshi
Sakshi News home page

T Rajendar: ఇటీవలే గుండెపోటు, చికిత్స కోసం అమెరికా వెళ్లిన నటుడు

Published Thu, Jun 9 2022 5:16 PM | Last Updated on Thu, Jun 9 2022 5:52 PM

Actor T Rajendar Went America For Further Treatment - Sakshi

సీనియర్‌ నటుడు, దర్శక, నిర్మాత టి.రాజేందర్‌ ఇటీవల అనూహ్యంగా గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని స్థానిక పోరూరులోని రామచంద్ర ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించే క్రమంలో వైద్యులు టి.రాజేందర్‌ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళంలో బ్లాక్‌ ఏర్పడిందనే విషయాన్ని గుర్తించారు. అత్యవసర చికిత్సతో ఆయన కోలుకున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇటీవల పరామర్శించి వచ్చారు. ఇప్పటికీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాజేందర్‌ను ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం మంగళవారం సాయంత్రం అమెరికాకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు భార్య ఉష, కుమారులు నటుడు శింబు, కురళరసన్, కూతురు ఇళఖ్య ఉన్నారు.

చదవండి: నజ్రియాతో కలిసి నాని భార్య స్టెప్పులు.. వీడియో వైరల్‌
ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement